-“ఇంటింటికీ టీడీపీ – 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి–సంక్షేమం” కార్యక్రమం ఐదో రోజూ విజయవంతం -ఐదు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా 12 లక్షల ఇళ్లను సందర్శించిన కూటమి నాయకులు, కార్యకర్తలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న “ఇంటింటికీ టీడీపీ – 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి–సంక్షేమం” కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా ఐదో రోజూ విజయవంతంగా కొనసాగింది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున ఇంటింటికీ వెళ్లి రెండేళ్ల పాలనలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, అమలు చేసిన …
Read More »Daily Archives: July 31, 2026
రెక్కలు విప్పిన ఉత్తరాంధ్ర
-అల్లూరి విమానాశ్రయంతో ఉత్తరాంధ్ర కలలకు రెక్కలు -తెలుగు కళలు, సంస్కృతి ఉట్టిపడేలా విమానాశ్రయ ప్రాంగణం -గిరిజన సంప్రదాయ నృత్యం థింసాకు గిన్నీస్ వరల్డ్ రికార్డు -ఉత్తరాంధ్ర ఆర్ధిక ప్రగతికి ఊతమిచ్చేలా కార్యకలాపాలు ఉండాలన్న సీఎం -వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభోత్సవ ఏర్పాట్లను సమీక్షించిన సీఎం చంద్రబాబు విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఈ విమానాశ్రయాన్ని ఏవియేషన్, ఏరోస్పేస్ హబ్ గా తీర్చిదిద్దాలని సూచించారు. …
Read More »రైతులందరికీ శుభవార్త..
-ఖరీఫ్ పంటల బీమా నమోదు గడువు ఆగస్టు 15 వరకు పొడిగింపు: మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఖరీఫ్-2026 సీజన్‌కు సంబంధించి పంట దిగుబడి ఆధారిత ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (PMFBY) కింద వరి పంట మినహా మిగిలిన అన్ని నోటిఫై చేసిన ఖరీఫ్ పంటలకు పంటల బీమా నమోదు (ప్రీమియం చెల్లింపు) గడువు ఈరోజు జూలై 31తో ముగియాల్సి ఉండగా, రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఆగస్టు 15 వరకు మరో 15 రోజులపాటు పొడిగించినట్లు …
Read More »తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి నది వరద ఉదృతి క్రమంగా పెరుగుతుందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. శుక్రవారం సాయంత్రం 7 గంటల నాటికి భద్రాచలం వద్ద నీటి మట్టం 49.8 అడుగులు, కూనవరం వద్ద నీటిమట్టం 16.35 మీటర్లు, పోలవరం వద్ద 10.26 మీటర్లు, ధవళేశ్వరం కాటన్ బ్యారేజి వద్ద ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 5,39,934 క్యూసెక్కులు ఉందని తెలిపారు. శుక్రవారం రాత్రికి మొదటి ప్రమాద …
Read More »చేనేత ఉత్పత్తుల్లో వైవిధ్యీకరణకు ప్రాధాన్యత
-మార్కెట్ అవసరాలకు అనుగుణంగా కొత్త ఉత్పత్తుల రూపకల్పన -రాష్ట్ర చేనేత మరియు జౌళి శాఖ కమిషనర్ రేఖా రాణి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ చేనేత మరియు జౌళి శాఖ కమిషనర్ రేఖా రాణి తూర్పు గోదావరి జిల్లా అంగర, పులుగుర్త ప్రాథమిక చేనేత సహకార సంఘాలను సందర్శించి, చేనేత కార్మికులు తయారు చేస్తున్న ఉత్పత్తులు, సంఘాల పనితీరు, మార్కెటింగ్ విధానాలను పరిశీలించారు. ఈ సందర్భంగా చేనేత ఉత్పత్తుల వైవిధ్యీకరణ, ఉత్పత్తుల అభివృద్ధి, మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా కొత్త ఉత్పత్తులను రూపొందించడంపై …
Read More »ఉత్తరాంధ్ర కలలకు రెక్కలు.. మన భవిష్యత్తుకు చుక్కాని భోగాపురం ఎయిర్‌పోర్ట్ : మంత్రి కందుల దుర్గేష్
-ఋషికొండ బ్లూ ఫ్లాగ్ బీచ్‌లో ఘనంగా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ప్రారంభోత్సవ కర్టెన్ రైజర్ కార్యక్రమం -ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించిన రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ -ఋషికొండ తీరంలో అలరించిన సాండ్ ఆర్ట్, సాంస్కృతిక వేడుకలు.. ఆకర్షణీయంగా నిలిచిన భోగాపురం ఎయిర్పోర్ట్ నమూనాతో రూపొందించిన సైకత శిల్పాలు, సాంస్కృతిక ప్రదర్శనలు, సెల్ఫీ పాయింట్లు -టూరిజం, కనెక్టివిటీతోనే లక్షలాది ఉద్యోగాలు..అభివృద్ధి బాటలో ఉత్తరాంధ్ర.. పర్యాటక శోభతో మెరిసిన ఋషికొండ: మంత్రి కందుల దుర్గేష్ -ఋషికొండ బ్లూ ఫ్లాగ్ బీచ్ …
Read More »జాతీయ వాదానికి సంస్కృతమే ఊతం
-ఆగష్టు 25 నుండి రాష్ట్ర వ్యాప్తంగా సంస్కృత సప్తాహం వారోత్సవాలు -ఆగస్టు 29 గిడుగు రాంమూర్తి జయంతి వేడుకలు -సాహితీ వేత్తలకు అవార్డు బహుకరణ -తెలుగు మరియు సంస్కృత అకాడమీ చైర్మన్ ఆర్. డి. విల్సన్ @ శరత్ చంద్ర అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : సంస్కృతం పండితుల భాష గా ప్రజల్లో నానుడి ఉందని దాన్ని చెరిపి వేసి సామాన్యులకు సంస్కృత భాష చేర్చే కార్యాచరణ అకాడమీ చేపడుతుందని తెలుగు మరియు సంస్కృత అకాడమీ చైర్మన్ ఆర్. డి. విల్సన్ @ …
Read More »జువైనైల్ జస్టిస్ యాక్ట్ 2015 సవరణలపై సూచనలు ఆహ్వానిస్తున్నాం
-ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (APSCPCR) చైర్‌పర్సన్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : బాలల సంరక్షణ, రక్షణ , పునరావాస చట్టపరమైన ప్రక్రియలను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో కేంద్ర మహిళా శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ, జువైనైల్ జస్టిస్ (కేర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్) యాక్ట్, 2015పై సమీక్షిస్తున్న కేంద్రప్రభుత్వం చట్టంలో అవసరమైన సవరణలు, కొత్త ప్రతిపాదనలపై సలహాలు, సూచనలను ఆహ్వానిస్తోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్‌పర్సన్ వేటుకూరి ఎ.వి.ఎస్. సూర్యనారాయణ రాజు …
Read More »తిరుపతి ఎస్ఐహెచ్ఎంలో హోటల్ మేనేజ్‌మెంట్ కోర్సుల్లో అడ్మిషన్లు…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతిలోని స్టేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్‌లో (ఎస్ఐహెచ్ఎం) 2026-27 విద్యా సంవత్సరానికి గాను అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైందని సంస్థ ప్రిన్సిపాల్ డాక్టర్ ఆర్. రమణ ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. కేంద్ర, రాష్ట్ర పర్యాటక శాఖల భాగస్వామ్యంతో నడుస్తున్న ఈ సంస్థలో ఇంటర్ ఉత్తీర్ణులైన వారికి 3 ఏళ్ల B.Sc (హాస్పిటాలిటీ & హోటల్ అడ్మినిస్ట్రేషన్), 10వ తరగతి పూర్తి చేసిన వారికి 1.5 ఏళ్ల క్రాఫ్ట్స్ కోర్స్ ఇన్ ఫుడ్ ప్రొడక్షన్ అందుబాటులో ఉన్నాయన్నారు. …
Read More »స్పెషల్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్స్ ఆఫ్ సెకండ్ క్లాస్ వారికి రెండు రోజుల అవగాహన కార్యక్రమం ప్రారంభం
మంగళగిరి/గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ న్యాయ అకాడమీ, భోపాల్ మరియు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అమరావతి వారి ఆదేశాల మేరకు అనంతపురము, కడప, కృష్ణా, కర్నూలు మరియు ప్రకాశం జిల్లాలకు చెందిన 45 మంది స్పెషల్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్స్ ఆఫ్ సెకండ్ క్లాస్ వారికి రెండు రోజుల అవగాహన కార్యక్రమం శుక్రవారం మంగళగిరిలో గల ఆంధ్రప్రదేశ్ న్యాయ అకాడమీలో ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్ న్యాయ అకాడమీ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ సభ్యులు మరియు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి అయిన జస్టిస్ అవధానం హరి హరనాధ …
Read More »
Prajavartha Online Telugu News