-2026 జనవరి 1వ తేదీ నాటి ఓటర్లను ప్రామాణికంగా ప్రకటన -కమిషనర్ మయూర్ అశోక్ గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల్లో భాగంగా రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు తుది ఓటర్ల జాబితాను మంగళవారం నగరపాలక కార్యాలయంలో ప్రదర్శించామని, ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా అందుబాటులో ఉంచుతామని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. 2026 జనవరి 1వ తేదీని అర్హత తేదీగా తీసుకుని సిద్ధం చేసిన ఓటర్ల జాబితాను …
Read More »Daily Archives: September 22, 2026
రాబోయే ఎన్నికల నిర్వహణకు ముందస్తు చర్యలను వేగవంతం చేయాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో రాబోయే ఎన్నికల నిర్వహణను అత్యంత పటిష్టంగా, పారదర్శకంగా చేపట్టేందుకు అవసరమైన ముందస్తు చర్యలను వేగవంతం చేయాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కమిషనర్ రిసెప్షన్ సెంటర్, కౌంటింగ్ కేంద్రాల కోసం ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాలని పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ఎన్నికల ప్రక్రియలో అవసరమైన రిసెప్షన్ సెంటర్, బ్యాలెట్ బాక్సులను భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్‌లు, ఓట్ల లెక్కింపు చేపట్టే కౌంటింగ్ సెంటర్ల ఏర్పాటుపై …
Read More »అభివృద్ధి పనులు ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పూర్తి చేయాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో చేపడుతున్న వివిధ అభివృద్ధి పనులు ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా త్వరితగతిన, నిర్దేశిత నిబందనల మేరకు నాణ్యతా ప్రమాణాల పాటిస్తూ పూర్తి చేయాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కమిషనర్ అరండల్ పేట, భారత్ పేట, విజయపురి కాలనీ, సీతయ్య డొంక తదితర ప్రాంతాల్లో అభివృద్ధి, పారిశుధ్య పనులను పరిశీలించి, అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, నగరంలో కొత్తగా రోడ్లు మరియు …
Read More »గుంటూరు జిల్లాలో రూ.527 కోట్లతో పట్టణాభివృద్ధి పనులకు శంకుస్థాపన
-జిల్లా కలెక్టర్ సి.ఎం. సాయికాంత్ వర్మ గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు జిల్లాలోని నాలుగు పట్టణాల్లో మొత్తం రూ.527 కోట్లతో చేపట్టనున్న పట్టణాభివృద్ధి ప్రాజెక్టులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేయడం జిల్లాకు లభించిన అరుదైన అవకాశమని జిల్లా కలెక్టర్ సి.ఎం. సాయికాంత్ వర్మ అన్నారు. రాష్ట్రంలోని 26 జిల్లాల్లోని 123 మున్సిపాలిటీలలో ప్రపంచస్థాయి మౌలిక వసతుల కల్పనకు 11,360 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చే వర్చువల్ గా మంగళవారం శంకుస్థాపన …
Read More »గుండె శస్త్రచికిత్స, గుండె నర్సింగ్‌పై ఎయిమ్స్ మంగళగిరిలో జాతీయ సదస్సు
మంగళగిరి, నేటి పత్రిక ప్రజావార్త : ఎయిమ్స్ మంగళగిరి నర్సింగ్ కళాశాల, సొసైటీ ఆఫ్ కార్డియాక్ నర్సెస్ సంయుక్త ఆధ్వర్యంలో “గుండె శస్త్రచికిత్స, గుండె నర్సింగ్‌లో వైద్య నైపుణ్యాలను బలోపేతం చేయడం” అనే అంశంపై రెండు రోజుల జాతీయ సదస్సు సెప్టెంబర్ 21, 22 తేదీల్లో నిర్వహించారు. ఎయిమ్స్ మంగళగిరి కార్యనిర్వాహక సంచాలకులు ప్రొఫెసర్ డాక్టర్ అహంతేమ్ శాంతా సింగ్ మార్గదర్శకత్వంలో నిర్వహించిన ఈ సదస్సులో భాగంగా సెప్టెంబర్ 21న ప్రత్యేక శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి సుమారు 100 …
Read More »నిత్యావసర ధరల భారంతో సామాన్యుడి బతుకు భారమైంది
– ధరలు తగ్గించే వరకు దశలవారీ ఉద్యమాలు – సీపీఐ నగర కార్యదర్శి జి. కోటేశ్వరరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్నంటుతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని సీపీఐ నగర కార్యదర్శి జి.కోటేశ్వరరావు విమర్శించారు. నిత్యావసర ధరల పెరుగుదలను నిరసిస్తూ మంగళవారం విజయవాడ కొత్తపేట నెహ్రూ బొమ్మ సెంటర్‌లో 37, 51, 52, 53 డివిజన్ల ఆధ్వర్యంలో కొట్టు రమణారావు అధ్యక్షతన సీపీఐ ఆందోళన నిర్వహించింది. ఈ సందర్భంగా కోటేశ్వరరావు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో అధికారంలోకి …
Read More »ప్రజా ఉద్యమాలపై భౌతిక దాడులు, లాఠీచార్జ్ గర్హనీయం
-ఆందోళనకారులపైనే కేసులా? దాడులకు పాల్పడిన వారిపై చర్యలు లేవీ? -సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య ఖండన విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామకాల్లో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై విజయవాడ శాప్ కార్యాలయం ఎదుట వైసీపీ చేపట్టిన నిరసనపై భౌతిక దాడులు చేయించడం, లాఠీచార్జ్‌కు పాల్పడటం వంటి చర్యలు గర్హనీయమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య తీవ్రంగా ఖండించారు. ప్రజా ఉద్యమాలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని ఆయన తప్పుపట్టారు. ఈ మేరకు మంగళవారం …
Read More »హనుమాన్‌జంక్షన్‌లో 430 మంది పేదలకు హక్కు పత్రాల పంపిణీ
-430 మంది పేదలకు ఉచిత రిజిస్ట్రేషన్.. పొజిషన్ ధ్రువపత్రాలు అందజేత -పేదలకు చట్టబద్ధమైన హక్కు కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం: మంత్రి సుభాష్ -పేదల కళ్లలో కనిపించిన ఆనందం ఎప్పటికీ మరువలేనిది: సుభాష్ -గత ఎన్నికల్లో వైసీపీ నేతలకు ప్రజలు గట్టి గుణపాఠం చెప్పారు: మంత్రి సుభాష్ -కొడాలి నాని, వల్లభనేని వంశీ తీరుపై మంత్రి సుభాష్ తీవ్ర విమర్శలు -అహంకారపూరిత వ్యాఖ్యలకు ఎన్నికల్లో ప్రజలే సమాధానం చెప్పారు: సుభాష్ -ఇది రాజకీయ సభ కాదు.. పేదలకు హక్కు కల్పించే కార్యక్రమం: యార్లగడ్డ -నకిలీ …
Read More »ప్రభు కిషోర్ జన్మదినాన్ని పురస్కరించుకుని విజయవాడలో సేవా కార్యక్రమాలు
-రక్తదాన శిబిరం, అవయవదాన అవగాహన ర్యాలీ, సైబర్ క్రైమ్ అవగాహన కార్యక్రమం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వరుణ్ గ్రూప్ చైర్మన్ ప్రభు కిషోర్ జన్మదినాన్ని పురస్కరించుకుని, లయన్స్ క్లబ్ ఆఫ్ విజయవాడ జూబ్లీ హారిత ఆధ్వర్యంలో, వరుణ్ మోటార్స్ సహకారంతో విజయవాడలో పలు సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించారు. వరుణ్ మోటార్స్, బజాజ్ సర్కిల్, విజయవాడలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రక్తదాన శిబిరం, అవయవదాన అవగాహన ర్యాలీ, సైబర్ క్రైమ్ అవగాహన కార్యక్రమం, మొక్కల పంపిణీ చేపట్టారు. రక్తదానం, అవయవదానం ప్రాముఖ్యతతో …
Read More »ఆంధ్రప్రదేశ్‌లో ఎంటీఆర్ ఉత్పత్తులకు మరింత ప్రాధాన్యం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ మార్కెట్‌పై ప్రముఖ ఆహార ఉత్పత్తుల సంస్థ ఎంటీఆర్ ఫుడ్స్ మరింత దృష్టి సారించింది. రాష్ట్ర ప్రజల ఆహార అభిరుచులకు అనుగుణంగా ఇప్పటికే పలు ఉత్పత్తులను అందిస్తున్న సంస్థ, తాజాగా మరికొన్ని కొత్త ఉత్పత్తులను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. సాంబార్ మసాలా, రసం మసాలాకు మంచి ఆదరణ ఉండగా, మసాలా కారం, కారం గోల్డ్ పికిల్ చిల్లీ, కరివేపాకు పొడి, ఇడ్లీ కారం పొడి, కంది పొడి వంటి ఉత్పత్తులను కూడా వినియోగదారులకు అందిస్తోంది. పండుగల సీజన్‌ను దృష్టిలో …
Read More »
Prajavartha Online Telugu News