Breaking News

ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 6 మంది అనారోగ్య బాధితులకు చెక్కులు అందించిన ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్

పుట్టపర్తి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ నేడు ధర్మవరం ఎన్డీఏ కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి (ఎంఆర్ఎఫ్) ద్వారా 6 మంది అనారోగ్య బాధితులకు చెక్కులను అందించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం వివిధ రకాల సహాయ కార్యక్రమాలను ప్రవేశపెట్టి, అనారోగ్య బాధితుల‌కు సహాయం అందించేందుకు ఎప్పుడూ కృషి చేస్తుందన్నారు. “ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రజల సమస్యలను తెలుసుకొని, ఆపత్కాలంలో వారికి మద్దతుగా నిలవడానికి నిరంతరం సంకల్పబద్ధంగా పనిచేస్తోంది. ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు అనారోగ్య బాధితులు సహాయం పొందడంపై ప్రాధాన్యత ఇస్తూ, ఎంఆర్ఎఫ్ ద్వారా ఎంతోమంది ప్రజలకు సాయం అందిస్తున్నాం” అని మంత్రి తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *