Breaking News

జిల్లాలో స్వీప్ అవగాహన కార్యక్రమం

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి, గుంటూరు జిల్లా వారి ఆదేశాలు మేరకు, ఈరోజు గుంటూరు నందు గల స్థానిక హిందూ ఫార్మసీ కాలేజీ మరియు సిమ్స్ ఫార్మసీ కాలేజీలలో స్వీప్ అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది.
ఈ కార్యక్రమంలో అదనపు మున్సిపల్ కమిషనర్ ఓబులైష్ మాటలాడుతూ ఓటు హక్కు మరియు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రాముఖ్యత గురించి వివరించడం జరిగింది. అర్హత కలిగిన ప్రతి పౌరుడు వారి యొక్క ఓటును వినియోగించమని మరియు మెరుగైన సమాజం కోసం సరియైన నాయకుడిని ఎన్నుకునే బాధ్యత మనందరి పైన ఉందని తెలియజేసినారు . ఆ తరువాత, కె. సంజీవరావు (జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారి) మాటలాడుతూ ఓటు ఎలా వినియోగించుకోవాలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉపయోగించి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ గురించి విద్యార్థులకు వివరించారు మరియు బ్యాలెట్ పేపర్ ఎలా ఉంటుందో మరియు ఎన్నికల్లో ఎలా ఓటు వేయాలో కూడా వివరించారు. శ్రీమతి రమాదేవి గారు మాటలాడుతూ ఓటు హక్కు ప్రాధాన్యతా గురించి తలియచాసినారు.

ఈ కార్యక్రమంలో హిందూ ఫార్మసీ కాలేజీ మరియు సిమ్స్ ఫార్మసీ కాలేజీలలో పనిచేస్తున ఉపాధ్యాయులు మరియు కాలేజీ సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొనడం జరిగింది.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

స్వల్ప వర్షానికే జలమయం.. డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా విఫలం

-​రాజారాజేశ్వరి పేట నుంచి బుడుమేరు వరకు నీట మునిగిన రోడ్ల పరిశీలన -​గత రెండేళ్లుగా నగరానికి ఒక్క రూపాయి నిధులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *