Breaking News

కోనసీమ ప్రభల తీర్థాన్ని రాష్ట్రోత్సవంగా ప్రకటించాలని రాష్ట్ర ముఖ్యమంత్రిని కోరిన రాష్ట్ర సృజనాత్మకత మరియు సంస్కృతి కమిషన్ చైర్‌పర్సన్ తేజస్వి పొదపాటి

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత మరియు సంస్కృతి కమిషన్ చైర్‌పర్సన్ తేజస్వి పొదపాటి బుధవారం సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ని కలిసి కోనసీమ ప్రభల తీర్థాన్ని రాష్ట్రోత్సవంగా ప్రకటించాలని అభ్యర్థించారు. 400 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ మహోత్సవం ప్రతీ ఏటా 4 లక్షల మందికి పైగా భక్తులను ఆకర్షిస్తూ, కోనసీమ ప్రాంతపు సంప్రదాయాలకు, ప్రజా సంస్కృతికి ప్రతిబింబంగా నిలుస్తోందని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరియు భారత ప్రభుత్వ సంస్కృతి మంత్రిత్వ శాఖ కూడా ఈ ఉత్సవాన్ని ప్రశంసించారని తేజస్వి పొదపాటి తెలిపారు.

ఈ ప్రతిపాదనను ఇప్పటికే గౌరవ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ కి సమర్పించామని వారు ఈ విషయంలో సానుకూలంగా స్పందించారని, కోనసీమ ప్రభల తీర్థాన్ని రాష్ట్ర పండుగగా గుర్తించడం పట్ల ఆయన పూర్తి అంకితభావంతో ఉన్నారని ఆమె తెలియజేసారు. కోనసీమ ప్రభల తీర్థాన్ని రాష్ట్ర పండుగగా గుర్తింపు ఇవ్వడం వల్ల తెలుగు సంస్కృతి పునరుద్ధరించబడటమే కాకుండా, స్థానికంగా ఘనంగా జరుపుకునే సంప్రదాయాలకు మరింత గౌరవం చేకూరుతుందని ఆమె పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ఈ ప్రతిపాదనపై సానుకూలంగా పరిశీలిస్తామని హామీ ఇచ్చారు అని తేజస్వి పొదపాటి తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *