Breaking News

స్వచ్ఛత గ్రీన్ లీఫ్ రేటింగ్ విధానం పై సమావేశం

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
పర్యాటక రంగం అభివృద్ధి కోసం అతిధి గృహాల్లో సురక్షితమైన పారిశుద్ధ్య నిర్వహణను మెరుగుపర్చేందుకు ప్రవేశ పెట్టిన స్వచ్చత గ్రీన్ లీఫ్ రేటింగ్ విధానంను నిర్దేశిత మార్గదర్శకాల ప్రకారం సక్రమంగా అమలు జరిగేలా పటిష్ట ప్రణాళిక ప్రకారం చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మీ అధికారులను ఆదేశించారు.

సోమవారం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో స్వచ్ఛత గ్రీన్ లీఫ్ రేటింగ్ విధానం (ఎస్ జీ ఎల్ ఆర్ ఎస్) జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మీ, తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సింహా తో కలసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మీ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ తాగునీరు మరియు పారిశుధ్యం శాఖ, టూరిజం మంత్రిత్వ శాఖ సంయుక్తంగా ఆతిధ్య గృహాలకు స్వచ్ఛత గ్రీన్ లీఫ్ రేటింగ్ విధానంను ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. పర్యాటక రంగంలో ఆతిద్యానికి సంబంధించి హోటల్స్, లాడ్జిలు, హోమ్ స్టే లు, ప్రార్ధనాలయాలకు సంబంధించిన సత్రాలలో పారిశుధ్ధ్య నిర్వహణ ప్రమాణాలకు అనుగుణంగా స్వఛ్చత గ్రీన్ లీఫ్ రేటింగ్ ను కేటాయించటం జరుగుతుందన్నారు. ఆతిధ్య గృహాలలో సురక్షితమైన పద్ధతులలో పారిశుధ్ధ్య పనులను అమలు చేయటం, ఘన వ్యర్ధాల వేరు చేయుట, ధ్రవ వ్యర్ధాలు తగ్గించుట, తిరిగి వినియోగించుట, రీచార్జి చేయుట, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని వినియోగించకుండుట, వినియోగించే ప్లాస్టిక్ ను సక్రమంగా నిర్వహణ చేయుట, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుట తదితర అంశాలను ఎస్ జీ ఎల్ ఆర్ ఎస్ కమిటీలు పర్యవేక్షించటం జరుగుతుందని, నిర్దేశిత ప్రమాణాలు ప్రకారం 1లీఫ్, 3లీఫ్, 5లీఫ్ స్టేటస్ కేటాయించటం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమాలను పర్యవేక్షణకు జిల్లా స్థాయిలో కలెక్టర్ చైర్మన్ గా, ఆర్ డబ్ల్యు ఎస్ ఎస్ఈ మెంబరు కన్వీనర్ గా , జిల్లా పరిషత్ సీఈఓ, ఎంపీడీవోలు, జిల్లా టూరిజం శాఖ అధికారి సభ్యులుగా కమిటీ ఉంటుందని, డివిజన్ స్థాయిలో రెవెన్యూ డివిజన్ అధికారి, సబ్ కలెక్టర్ చైర్మన్ గా ఆర్ డబ్ల్యు ఎస్ డీఈఈ మెంబరు కన్వీనర్ ,డీఎల్డీవోలు, ఎంపీడీవోలు సభ్యులుగా, కమిటీ ఉంటుందన్నారు. జిల్లా, డివిజన్ స్థాయి కమిటీలలో మున్సిపల్ కమిషనర్లను సభ్యులుగా చేర్చటం జరుగుతుందన్నారు. ర్యాంకింగ్ కు నిర్దేశించిన అంశాలపై షెడ్యూల్ ప్రకారం ఆతిధ్య రంగంలోని ప్రైవేటు అసోసియేషన్లు, ప్రార్ధనాలయాల్లోని సత్రాలకు సంబంధించి దేవాదాయశాఖ, మైనార్టీశాఖ అధికారులను సమన్వయం చేసుకుంటూ శిక్షణ అవగాహన కార్యక్రమాలు 2025 ఫిబ్రవరి 28వ తేది నాటికి నిర్వహించాలన్నారు. నిర్దేశిత ప్రమాణాల ప్రకారం ఆతిధ్య రంగం వారు వ్యక్తిగతంగా ర్యాంకింగ్ లు 2025 మార్చి 15 తేది నాటికి ప్రకటించుకోవాలని, వాటిని 2025 మార్చి 31 తేది నాటికి కమిటీలు వెరిఫికేషన్ చేయాలన్నారు. జిల్లాలో 30 ఏప్రిల్ 2025 తేది నాటికి కనీసం 5 ఆతిధ్య వసతి గృహాలకు ర్యాంకింగ్ ఇవ్వాలని, 2025 అక్టోబరు 2 నాటికి రాష్ట్రంలోని 1000 ఆతిథ్య వసతి గృహాలకు ర్యాంకింగ్ ఇవ్వాల్సి ఉంటుందన్నారు. స్వఛ్చత గ్రీన్ లీఫ్ రేటింగ్ విధానానికి సంబంధించి జిల్లాలోని అన్ని కేటగిరిల్లోని ఆతిధ్య గృహాలను మ్యాపింగ్ చేయాలని, వీటిలోని పారిశుధ్ధ్యం, హౌస్ కీపింగ్ సిబ్బంది నిరంతరం శిక్షణ కార్యక్రమాలు, అంతర్గతంగా పారిశుధ్ధ్యం ప్రమాణాల ఆడిట్, పారిశుధ్ధ్యం స్థితి తదితర అంశాలపై కమిటీలు పర్యవేక్షించాలన్నారు.

సమావేశంలో అర్ డబ్ల్యు ఎస్ ఎస్ఈ కళ్యాణ చక్రవర్తి, జిల్లా పరిషత్ సీఈఓ జ్యోతిబసు, ఆర్డీఓ శ్రీనివాసులు, జిల్లా టూరిజం అధికారి శ్రీరమ్య, హోటల్స్ అసోసియేషన్ సభ్యులు పి బాల సుబ్రహ్మణ్యం, పంచాయితీ, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *