Breaking News

గ్రామీణ ప్రాంత మ‌హిళ‌ల ఆర్థిక స్వాలంబ‌న‌కు ఎంపి కేశినేని శివ‌నాథ్ కృషి

-బోడ‌వాడ‌, జ‌మ్మ‌వ‌రం గ్రామ ప్ర‌జ‌ల‌తో స‌మావేశ‌మైన పంచాయతీ ఛాంపియ‌న్స్

వీరుల‌పాడు,  నేటి పత్రిక ప్రజావార్త :
ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) ఆదేశాల మేర‌కు హైద‌రాబాద్ జాతీయ గ్రామీణాభివృద్ధి మరియు పంచాయతీ రాజ్ సంస్థ (ఎన్.ఐ.ఆర్.డి.పి.ఆర్) లో స‌మగ్ర గ్రామీణాభివృద్ది కోసం శిక్ష‌ణ పొందిన పంచాయ‌తీ చాంపియ‌న్స్ నందిగామ నియోజ‌క‌వ‌ర్గం వీరుల‌పాడు మండ‌లంలోని బోద‌వాడ‌, జ‌మ్మ‌వ‌రం గ్రామాల్లో స‌మ‌గ్ర గ్రామీణాభివృద్దికి శ్రీకారం చుట్టారు. పంచాయ‌తీరాజ్ వ్య‌వ‌స్థ‌ను ఉప‌యోగించుకుని గ్రామాల‌ను ఏ విధంగా అభివృద్ది వైపు న‌డిపిస్తార‌నే అంశంపై బోడ‌వాడ‌, జ‌మ్మ‌వ‌రం గ్రామ ప్ర‌జ‌ల‌తో పంచాయ‌తీ ఛాంపియ‌న్స్ సోమ‌వారం స‌మావేశం నిర్వ‌హించారు.

ఈ స‌మావేశానికి హాజ‌రైన ఎన్టీఆర్ జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు కందుల కల్పన, వీరుల‌పాడు మండ‌ల పార్టీ అధ్య‌క్షుడు కె.శ్రీనివాస‌రావు మాట్లాడుతూ ప్రతి ఇంటి నుంచి ఒక ఎంటర్ ప్రెన్యూర్ వుండాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశయాలకు అనుగుణంగా విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ కృషి చేస్తున్నారన్నారు. ప్ర‌తి మ‌హిళ ఆర్థిక స్వాలంబ‌న సాధించే దిశ‌గా ఎంపి కేశినేని శివ‌నాథ్ చేయూత అందిస్తున్నార‌ని చెప్పారు.

ప్ర‌తి గ్రామంలో ఇంటింటికి కేంద్ర రాష్ట్ర ప‌థ‌కాల‌పై అవ‌గాహ‌న క‌ల్పించి, స్వ‌యం ఉపాధి రంగంలో కుటీర ప‌రిశ్ర‌మ‌లు ఏర్పాటు చేయించేందుకు స‌హ‌కారం అందించేందుకు ఎంపి కేశినేని శివ‌నాథ్ పంచాయ‌తీ ఛాంపియ‌న్స్ ను ఏర్పాటు చేశార‌ని తెలిపారు. మ‌హిళ‌ల‌కు, నిరుద్యోగ యువ‌త‌కు ఉపాధి అవ‌కాశాలు క‌ల్పించ‌టం కోసం కేంద్ర ప్ర‌భుత్వం అందించే పి.ఎమ్.ఈ.జి.పి, ముద్ర లోన్, ఎన్.ఆర్.ఈ.జీ.ఎస్ ఫండ్స్ వినియోగం గురించి అవ‌గాహ‌న క‌ల్పిస్తార‌ని చెప్పారు. స్వ‌యం ఉపాధి రంగంలో వున్న కుటీర ప‌రిశ్ర‌మ‌ల‌పై అవ‌గాహ‌న క‌ల్పించి వారికి ఆస‌క్తి వున్న కుటీర ప‌రిశ్ర‌మ‌ను ఏర్పాటు చేయించేందుకు స‌హ‌కారం అందిస్తార‌ని చెప్పారు. అలాగే గ్రామీణ ప్రాంతంలోని యువ‌త‌ను క్రీడల ప‌ట్ల ప్రోత్స‌హించే విధంగా ఎంపి కేశినేని శివ‌నాథ్ స‌హ‌కారంతో అవ‌కాశాలు మెరుగుప‌రుస్తార‌ని వివ‌రించారు.

ఈ కార్య‌క్ర‌మంలో జమ్మవరం టిడిపి అధ్యక్షుడు కిలారు వెంకట సత్యనారాయణ,బోడవాడ గ్రామ టిడిపి అధ్యక్షులు మద్దిలేని లక్ష్మణరావు, మండ‌ల స‌మైక్య అధ్య‌క్షురాలు సిహెచ్ కృష్ణ‌కుమారి, ఎన్టీఆర్ జిల్లా ఎన్.ఐ.ఆర్.డి.పి.ఆర్ ప్రొగ్రామ్ కో-ఆర్డినేట‌ర్స్ సొంగా సంజ‌య్ వ‌ర్మ, జివి న‌ర‌సింహారావు, వీరులపాడు మండ‌ల‌ జనసేన అధ్యక్షుడు బేతపూడి జయరాజ్,బోడవాడ గ్రామ జనసేన పార్టీ అధ్యక్షుడు గుంటి వీరయ్య , తాటి గుమ్మి గ్రామ టిడిపి సీనియర్ నాయకులు రోశయ్య, , బోడవాడ టిడిపి నాయకుడు రాయ‌ల స‌త్యం, పంచాయ‌తీ ఛాంపియ‌న్స్ కె.సునీల్, ఎస్.సురేష్, వై.ప్ర‌దీప్, కె.రాము, హ‌నుమంత‌రావు, గోపి, శ్రీను, జివి స‌త్య‌నారాయ‌ణ‌, కెవి న‌ర‌సింహ‌రావు ల‌తో పాటు డ్వాక్రా సంఘ మ‌హిళ‌లు, గ్రామ ప్ర‌జ‌లు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *