– మటన్ రుచుల విందు ‘లజీజ్-ఈ-గోశ్త్’
– ఈ ఫెస్టివల్ మార్చి 3 నుంచి ఏప్రిల్ 6 వరకు..
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మటన్ ప్రియుల జిహ్వ చాపల్యాన్ని తీర్చేందుకు బార్బీక్యూ నేషన్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ‘లజీజ్-ఈ-గోశ్త్’ పేరుతో ఫుడ్ ఫెస్టివల్ ప్రారంభించామని బార్బీక్యూ నేషన్ హాస్పిటాలిటీ లిమిటెడ్ సీడీవో మాన్సూర్ మెమోన్, ఆంధ్ర హెడ్ నరేష్ నాయుడు తెలిపారు. సోమవారం విజయవాడ బందరు రోడ్డులోని ఎల్ఈపీఎల్ సెంట్రల్ మాల్ లోని బర్భిక్యూ నేషన్ లో మీడియా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ ఫుడ్ ఫెస్టివల్ మార్చి 3 నుంచి ఏప్రిల్ 6వ తేదీ వరకు ఉంటుందన్నారు. ఈ విందులో మటన్ ప్రియులకు అరుదైన వంటకాలు అందిస్తున్నామని పేర్కొన్నారు. ఈ విందు మటన్ మారగ్ సూప్తో ప్రారంభమవుతుందన్నారు. స్టార్టర్స్‌లో ఖీమా కలేజి, మటన్ ఖీమా పావ్, గలౌటీ కబాబ్, మటన్ శేఖావతి సీఖ్, మటన్ రాన్ వంటి స్పెషల్స్ అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రధాన వంటకాలలో మృదువైన మసాలాలతో హైదరాబాదీ మటన్ హలీం, నిహారి గోశ్త్, షాహీ మటన్ ఖోర్మా, హైదరాబాదీ జాఫ్రాని మటన్ దమ్ బిర్యానీ వంటి రుచులను ఆస్వాదించవచ్చని తెలిపారు. ఈ విందును అత్యంత మధురంగా ముగించేందుకు ఫ్రూట్ కస్టర్డ్ (పాలు, కస్టర్డ్ పౌడర్, తాజా పండ్లతో చేసిన క్రీమీ డెజర్ట్), షీర్ ఖుర్మా (తాజా పాలతో, సేమియాతో తయారైన సంప్రదాయ స్వీట్) వంటి రుచికరమైన మిఠాయిలు కలవన్నారు. ప్రత్యేకంగా రూపొందించిన కేసర పిస్తా కుల్ఫీ, హనీ ఆల్మండ్ & డేట్స్ కుల్ఫీ వంటి కుల్ఫీలు ఈ విందుకు మరింత విశిష్టతను ఇస్తాయన్నారు. బార్బీక్యూ నేషన్ ప్రత్యేకతను ప్రతిబింబిస్తూ.. రెస్టారెంట్ మంత్రముగ్ధంగా అలంకరించబడిందన్నారు. ఈ ఫెస్టివల్ అనుభూతిని పెంచేందుకు థీమ్‌కు అనుగుణంగా వేషధారణలో ఉన్న సిబ్బంది అందుబాటులో ఉంటారన్నారు. ప్రత్యేకంగా రూపొందించిన వినోద కార్యక్రమాలు కూడా భోజన అనుభూతిని మరింత ఆనందదాయకంగా మార్చుతాయని తెలిపారు.
ఈ ఫుడ్ ఫెస్టివల్ ద్వారా అతిథులకు విభిన్నమైన, తాజాదనంతో కూడిన డైనింగ్ అనుభూతిని అందించాలన్న లక్ష్యంతో పని చేస్తున్నామన్నారు. మా ప్రత్యేక వంటకాలను కొనసాగిస్తూ మటన్ ప్రియులకు ఓ కొత్త అనుభూతిని అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. మరిన్ని వివరాలు, రిజర్వేషన్ కోసం https://www.barbequenation.com సంప్రదించాలని కోరారు.
Prajavartha Online Telugu News