Breaking News

స్వచ్ఛ సర్వేక్షణ్ లో రాజమండ్రికి ఓటు వేయండి

-మన నగరాన్ని గర్వపడేలా చేయండి
-యువత పెద్ద ఎత్తున భాగస్వామ్యం కావాలి
-కమిషనర్ కేతన్ గార్గ్

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
స్వచ్ఛ సర్వేక్షణ్ లో మెరుగైన స్థానం కొరకు వార్డు ప్రత్యేకాధికారులు, అందరు విభాగాధిపతులు సమన్వయంతో పనిచేయాలనీ నగర పాలక సంస్థ కమిషనర్ కేతన్ గార్గ్పిలుపు ఇచ్చారు. స్వచ్చ భారత్ బృందం సభ్యులు నగరమునకు క్షేత్రస్థాయి పరిశీలనకు రాబోతున్నందున వార్డు ప్రత్యేకాధిపతులు మరియు అన్ని విభాగాధిపతులు వారికి కేటాయించబడిన విధులను సక్రమంగా నిర్వహించవలసినదిగా మంగళవారం ఆదేశించియున్నారు.

విభాగాధిపతులు క్రింది స్థాయి సిబ్బందితో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భముగా కేతన గార్గ్ మాట్లాడుతూ సిటిజన్ ఫీడ్ బ్యాక్, క్షేత్రస్థాయి అంశముల అమలులో మార్గదర్శకమును ఖచ్చితంగా పాటించాలన్నారు. సిటిజన్ ఫీడ్ బ్యాక్ అంశము కొరకు నియమించబడిన బృందాలు ది.04-03-2025 తేదిన క్షేత్రస్థాయిలో సిటిజన్ ఫీడ్ బ్యాక్ తీసుకొనియున్నారు. ఇప్పటివరకు 16 వేల మంది వద్ద సిటిజన్ ఫీడ్ బ్యాక్ తీసుకొని రాష్ట్ర స్థాయిలో రాజమహేంద్రవరం 3వ స్థానములో కొనసాగుతున్నదన్నారు.. సిటిజన్ ఫీడ్ బ్యాక్ యింకా పెంచాల్సిన అవసరముందని, ప్రజలను యింకా చైతన్యవంతులు చేసి ఫీడ్ బ్యాక్ కార్యక్రమంలో భాగస్వామ్యులను చేయాలని అన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిన్నతనంలోనే కండరాల క్షీణత గుర్తింపుపై ప్రత్యేక దృష్టి: మంత్రి కందుల దుర్గేష్

-అమరావతి రేర్ డిసీజెస్ ఆర్గనైజేషన్ ఫౌండర్ శోభారాణి సుంకర సేవలు అభినందనీయమని కొనియాడిన మంత్రి దుర్గేష్ అమరావతి, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *