రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
శనివారం స్ధానిక వైటీసీ ఆవరణలో ఉన్న పలు ప్రభుత్వ ఉద్యోగులు ఆయా కార్యాలయాల్లో స్వచ్ఛంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా నైపుణ్యాభివృద్ధి కార్యాలయం లో డి ఎస్ డి వో జివిడి మురళీ, జిల్లా అగ్నిమాపక అధికారి మార్టిన్ లూధర్ కింగ్ , ఎడి ప్రదీప్ కుమార్, జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ సహాయ ఇంజనీర్ కే. శాంత కుమారి, సీనియర్ అసిస్టెంట్ రామకృష్ణ, యితర సిబ్బంది, డ్వామా, డి ఆర్ డి ఎ, జిల్లా గ్రామ పంచాయతీ అధికారి, జిల్లా క్రీడ సాధికారికత అధికారి, జిల్లా సూక్ష్మ నీటిపారుదల అధికారి, జిల్లా పరిశ్రమలు, తదితర శాఖల ఉద్యోగులు సిబ్బంది కార్యాలయాల్లో స్వచ్ఛత కార్యక్రమాలను నిర్వహించి, సింగిల్ ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నియంత్రించే దిశగా చర్యలు తీసుకుంటామని తెలియ చేశారు. స్ధానిక ఆర్ అండ్ బి కార్యాలయం ఆవరణలో జిల్లా ఆర్ అండ్ బి అధికారి ఎస్బీవీ రెడ్డి ఆద్వర్యంలో స్వచ్చంద్ర కార్యక్రమాన్ని వేడుకగా నిర్వహించారు.
Prajavartha Online Telugu News