Breaking News

లవకుశ సినిమా తెలుగు చలనచిత్ర చరిత్రలో ఒక మైలురాయి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
శనివారం గాంధీనగర్ లోని కార్యాలయంలో  1963వ సంవత్సరంలో నాటి నుండి నేటి వరకు చలనచిత్ర రంగంలో ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోదగినటువంటి అన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు  రాముడు కింద నటించినటువంటి  “లవ కుశ” చలనచిత్రంలో లవకుశ పాత్రలు నేటి వరకు కూడా ఎవరు మరవ లేనటువంటి విషయమని నేటికీ ప్రేక్షకుడు మరువనటువంటి లవ కుశ లో కుసులు పాత్ర లో నటించినటువంటి పియూరి నాగ సుబ్రహ్మణ్యం ( నాగరాజు) గారిని సాంస్కృతిక విభాగం గౌరవ అధ్యక్షులు, టిడిపి రాష్ట్ర కార్యదర్శి నవనీతం సాంబశివరావు గారి చేతుల మీదగా నాగసుబ్రహ్మణ్యం గారికి ఘన సన్మానం చేయడం జరిగినది.

ఈ సందర్భంగా నవనీతం సాంబశివరావు మాట్లాడుతూ  1963 మార్చి 29వ తారీకున ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ” లవకుశ చలనచిత్రం ” నేటికీ ఎవరు మరవన్నటువంటి చిత్ర రంగంలో ఒక గొప్ప గౌరవం తెచ్చుకున్నటువంటి చిత్రమని, ఈ చిత్రంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు నటన నేటికీ రాముడు ఏ రకంగా ఉంటారు అని కళ్ళకు కట్టినట్టు చూపించినటువంటి చిత్రమని, ఇలాంటి గొప్ప చిత్రంలో లవకుశ పాత్రలు కూడా పెద్ద ఎత్తున పట్టణకు అవకాశం ఉన్నటువంటి పాత్రలు అని, అందులో కుశులు కింద నటించినటువంటి పెద్దలు నాగ సుబ్రహ్మణ్యం నటన నేటికీ కూడా అనేకమంది గుర్తించుకున్నటువంటి పాత్ర అని, ఆయన కాకినాడలో జన్మించి అమలాపురంలో నివాసం ఉంటూ నేటికీ 78 సంవత్సరాలు నిండిన కళల పట్ల ఉన్నటువంటి అమితమైన ప్రేమతో, నేటికీ కూడా రంగస్థలం దగ్గర నుండి చిత్రరంగం వరకు నటించడం అతనికి ఉన్న ఇటువంటి ప్రత్యేకమని 1963 లో ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి మొట్టమొదటి రంగుల చిత్రంగా లవకుశ చిత్రంలో ఐదు సంవత్సరాల పాటు నిర్మించినటువంటి సంగతిని గుర్తు చేస్తూ, ఆనాడు ఈ చిత్రానికి భారీ బడ్జెట్ తో నందమూరి తారక రామారావు రాముడి పాత్రలో, అంజలీ దేవి సీత పాత్రలో నటించి మరపురానటువంటి చిత్రమని కొనియాడారు.

కుసులు కింద నటించినటువంటి బాలసుబ్రమణ్యం లవకుశ లోనే కాకుండా, సీతారామ కళ్యాణం, వెంకటేశ్వర మహత్యం, వెలుగునీడలు వంటి అనేక చిత్రాలలో నటిస్తూ 2006 లో ప్రేక్షక లో ముందుకు వచ్చిన కళ్యాణం చిత్రంలో కూడా నటించడం ఇతని ప్రత్యేకతలలో ఒకటిగా తెలియజేశారు, ఇతనికి విజయవాడ నగరంలో అనేకమంది స్నేహితులు ఉన్నారని ఇతని 50వ దశకం చిన్ననాటి నుండి నాటక రంగంలో చింతామణి నాటకంలో భవాని గా నటించడం ఇతనికి మంచి పేరును గుర్తింపును తీసుకొని వచ్చిందని, వేరు బుర్రకథల లో కూడా ప్రావన్యం ఉండి అనేక పల్లెలలో బుర్రకథలు చెప్పటంతో పాటు, నేతాజీ సుభాష్ చంద్రబోస్ జీవిత చరిత్రను, పల్నాటి యుద్ధాన్ని, బొబ్బిలి యుద్ధాన్ని బుర్రకథల రూపంలో ప్రజలకు చేరువ చేసినటువంటి ఉన్నతమైనటువంటి వ్యక్తి ఈ కుసులుగా నటించిన సుబ్రహ్మణ్యంని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 10 వేలకు పైగా వీధి నాటకాలు,బుర్రకథలు తదితర సాంస్కృతిక విభాగంలో పెద్ద ఎత్తున ముందుకు సాగినటువంటి వ్యక్తి అని నేడు ఉన్నటువంటి కళాకారులు అనేకమంది ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగుతున్నారని ఇతను సామాన్య జీవితం ఈరోజుకు గడుపుతూ ఎక్కడ ఎటువంటి మంచి కార్యక్రమాలు ఉన్న ఆ కార్యక్రమాలలో పాల్గొనడంతో పాటు వారికి సలహాలు సూచనలు అందిస్తూ కళా రంగం ముద్దుబిడ్డగా వెలువందుతున్నారని విజయవాడ నగరానికి నగరంలో నిర్వహించేటువంటి సాంస్కృతిక విభాగాలు అయినా తను కలిసి మెలిసి ముందుకు సాగుతారు అని తెలియజేస్తూ విజయవాడ గాంధీ నగర్ లోని కవితా వారి బిల్డింగ్ కూడా వచ్చిపోతూ అనేకమంది కళాకారులకు సలహాలు ఇస్తూ తనకు నిండు నూరేళ్లు ఆ దేవుడు ప్రసాదించాలని భవిష్యత్తులో మరిన్ని మంచి కార్యక్రమాలు చేస్తూ గుర్తింపు పొందినటువంటి పాత్రలు పోషిస్తూ ప్రేక్షకులకు మంచి పాత్రలు అందించాలని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో దాసరి జయరాజు,P వెంకన్న, M శ్రీనివాస్ యాదవ్, నారాయణ, కొండా, శ్రీనివాసరావు, బాలాజీ, మేస్త్రి శ్రీనివాస్ రావు, బండి రామ్మోహన్రావు, గోపి, లీలా ప్రసాద్ లతోపాటు అనేకమంది కళాకారులు కూడా ఈ సన్మాన కార్యక్రమం లో పాల్గొని పెద్దలైనటువంటి నాగ సుబ్రహ్మణ్యం ని సన్మానించుకోవడం జరిగింది.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *