Breaking News

దేశంలోనే ఎన్టీఆర్ జిల్లాను మోడ‌ల్ జిల్లాగా తీర్చిదిద్ద‌ట‌మే ఎంపి కేశినేని శివ‌నాథ్ ల‌క్ష్యం

-మారేపల్లి గ్రామ ప్రజలతో పంచాయతీ ఛాంపియన్స్ సమావేశం

ఎ.కొండూరు, నేటి పత్రిక ప్రజావార్త :
స్వ‌యం ఉపాధి రంగంలో ఎన్టీఆర్ జిల్లాను దేశంలో మోడ‌ల్ జిల్లాగా తీర్చిదిద్ద‌ట‌మే ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) ల‌క్ష్యంగా ప‌నిచేస్తున్నార‌ని ఎన్టీఆర్ జిల్లా ఎన్.ఐ.ఆర్.డి (నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ అండ్ పంచాయితీ రాజ్) ప్రోగ్రామ్ కో-ఆర్డినేట‌ర్ సొంగా సంజ‌య్ వ‌ర్మ తెలిపారు. తిరువూరు నియోజ‌క‌వ‌ర్గం ఎ.కొండూరు మండ‌లంలోని మారేప‌ల్లి గ్రామంలో మంగ‌ళ‌వారం పంచాయతీ ఛాంపియన్స్ డ్వాక్రా మహిళలతో, గ్రామ ప్రజలతో సమావేశం నిర్వహించారు.

గ్రామ సర్పంచి తాళ్లూరి నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ గ్రామ స‌భ‌లో సొంగా సంజ‌య్ వ‌ర్మ‌, మండ‌ల‌పార్టీ అధ్య‌క్షుడు గడ్డి కృష్ణారెడ్డి మాట్లాడుతూ మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదిగి ఆర్థికంగా వారి కాళ్ల మీద వారు నిలబడినప్పుడే పేదరిక నిర్మూలన సాధ్యమతుందన్నారు. గ్రామాల్లోని రైతులు, మ‌హిళలు, యువ‌కులు ఎంట‌ర్ ప్రెన్యూర్స్ గా మారి ఆర్థికాభివృద్ది సాధించేందుకు ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని), ఎమ్మెల్యే కొలిక‌పూడి శ్రీనివాస‌రావు అందిస్తున్న స‌హ‌కారం గురించి వివ‌రించారు.

అలాగే స్వ‌యం ఉపాధి రంగంలో ఎంట‌ర్ ప్రెన్యూర్స్ గా మారేందుకు ఉన్న అవ‌కాశాల‌ను వివ‌రించారు. మ‌ధ్య‌,చిన్న త‌ర‌హా ప‌రిశ్ర‌మ‌ల‌కు సంబంధించి మామిడి తాండ్ర‌, నాటు కోళ్లు పెంప‌కం, పుట్టగొడుగుల పెంపకం, కాలుష్యం లేని ఇటక తయారీ, చిరు ధాన్యాల నుండి పిండిని తయారు చేసే యంత్రాలు, ప్లాస్టిక్ నివారించి నాచురల్ గా ల‌భించే వేస్ట్ క్లాత్ ల ద్వారా పేపర్ బ్యాగులు తయారీ, వర్మి కంపోస్ట్ ఎరువు తయారు చేయడం, తేనె, పట్టు పరిశ్రమ, సోలార్ ద్వారా డిహైడ్రేషన్ ఫుడ్ తయారు చేయడం గురించి వివ‌రించి …వీటి ద్వారా సంపాద‌న ఏ విధంగా వుంటుందో కూడా తెలియ‌జేశారు. ఈ కుటీర ప‌రిశ్ర‌మ‌ల‌కు ఏర్పాటు చేసి త‌యారు చేసే ఉత్ప‌త్తుల‌కు కావాల్సిన మార్కెటింగ్ స‌హ‌కారం కూడా ఎంపి కేశినేని శివ‌నాథ్ అందిస్తార‌ని తెలిపారు.

పి.ఎమ్.జి.పి (ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయిమెంట్ జనరేషన్ ప్రోగ్రామ్-ప్రధాన మంత్రి ఉపాధి కల్పనా కార్యక్రమం) ద్వారా అందించే ఎమ్.ఎస్.ఎమ్.ఈ (మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ ప్రైజస్ ) రుణాలపై అవగాహన క‌ల్పించారు. ఎం ఎస్ ఎం ఈ లోన్లు పై చిన్న, మధ్య తరహా పరిశ్రమలు చేపట్టవలసిన విధి విధానాలను వాటిపై ప్రభుత్వం, బ్యాంకులు కలిగిస్తున్న ప్రోత్సాహకాలను తద్వారా చేకూరే సబ్సిడీలను తెలియ‌ప‌ర్చారు. ఇందుకు పంచాయ‌తీ ఛాంపియ‌న్స్ ప్ర‌జ‌ల‌కు పూర్తి స‌హ‌కారం అందిస్తార‌నన్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో ఆంధ్రప్రదేశ్ మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ వాసం మునియ్య, టిడిపి నాయ‌కుడు పోలిశెట్టిపాడు ప్రసాద్ రెడ్డి, పంచాయితీ ఛాంపియన్స్ చేకు రమేష్, ప్రొద్దుటూరి కృష్ణ, జువ్వ తరుణ్, కీలావత్ వసుంధరావు, షేక్ తాజాహుద్దీన్, శ్రీరామ్, బి కొండయ్య, బి వెంకటకృష్ణ ల‌తోపాటు ఆశా వర్కర్స్, బుక్ కీపర్స్, డ్వాక్రా మహిళలు, గ్రామ ప్ర‌జ‌లు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *