Breaking News

రీస‌ర్వేలో పార‌ద‌ర్శ‌క‌త‌కు పెద్ద పీట‌..

– భూ లెక్క‌ల‌ను ప‌క్కాగా తేల్చేందుకే రీస‌ర్వే
– జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో స‌మ‌గ్ర భూ స‌ర్వేలో పార‌ద‌ర్శ‌క‌త‌కు పెద్ద‌పీట వేస్తున్నామ‌ని.. అత్యంత జ‌వాబుదారీత‌నంతో భూ లెక్క‌ల‌ను ప‌క్కాగా తేల్చేందుకే రీస‌ర్వే నిర్వ‌హిస్తున్న‌ట్లు జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.లక్ష్మీశ అన్నారు.
క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ బుధ‌వారం చంద‌ర్ల‌పాడు మండ‌లం, ఉస్తేప‌ల్లి గ్రామ ప‌రిధిలో జ‌రుగుతున్న గ్రామ స‌రిహ‌ద్దుల నిర్ధార‌ణ‌, రెండోద‌శ రీస‌ర్వే డేటా సేక‌ర‌ణ కార్య‌క‌లాపాల‌ను త‌నిఖీ చేశారు. రైతుల‌తో ముచ్చ‌టించి రీస‌ర్వేతో భ‌విష్య‌త్తులో చేకూరే ప్ర‌యోజ‌నాల‌ను వివ‌రించారు.
ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ మాట్లాడుతూ ప్ర‌తి మండ‌లంలో ఎంపిక చేసిన గ్రామంలో రీస‌ర్వే కార్య‌క‌లాపాలు ప్ర‌స్తుతం చురుగ్గా సాగుతున్నాయ‌ని.. క్షేత్ర‌స్థాయిలో స‌ర్వే, రెవెన్యూ సిబ్బంది స‌మ‌న్వ‌యంతో ప‌నిచేస్తూ రీస‌ర్వే నిర్వ‌హిస్తున్న‌ట్లు తెలిపారు. ఫీల్డ్ గ్రౌండ్ ట్రూతింగ్ ప‌నుల‌తో స‌హా ప్ర‌తి విష‌యంలోనూ అప్ర‌మ‌త్తంగా ఉండాలని ఆదేశించిన‌ట్లు వెల్ల‌డించారు. రైతుల‌కు ఏవైనా అనుమానాలు ఉంటే వెంట‌నే నివృత్తి చేస్తున్న‌ట్లు తెలిపారు. ఎలాంటి పొర‌పాట్ల‌కు తావులేకుండా క‌చ్చిత‌మైన రికార్డుల రూప‌క‌ల్ప‌న‌కు కృషిచేస్తున్నామ‌న్నారు. గ్రామ ప‌రిధిలో రీస‌ర్వే కార్య‌క‌లాపాల‌కు సంబంధించిన స‌మాచారాన్ని ఎప్ప‌టిక‌ప్పుడు రైతుల‌కు తెలియ‌జేస్తున్న‌ట్లు వెల్ల‌డించారు.
క్షేత్ర‌స్థాయి త‌నిఖీల్లో క‌లెక్ట‌ర్ వెంట నందిగామ ఆర్‌డీవో కె.బాల‌కృష్ణ‌, అసిస్టెంట్ డైరెక్ట‌ర్ (స‌ర్వే, భూ రికార్డులు) టి.త్రివిక్ర‌మ‌రావు, గ్రామ రైతులు, మండ‌ల స‌ర్వేయ‌ర్‌, గ్రామ స‌ర్వేయ‌ర్లు, వీఆర్‌వోలు త‌దిత‌రులు ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *