Breaking News

స్వయం ఉపాధి యూనిట్లు, జనరిక్ మెడికల్ షాపుల కొరకు దరఖాస్తులు ఆహ్వానం

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వ ము 2024-25 సంవత్సరమునకు సంబందించి స్వయం ఉపాధి యూనిట్లు, జనరిక్ మెడికల్ షాపుల కొరకు, మేదర/ కుమ్మరి శాలివాహన వారి యూనిట్లుకు మరియు గ్రూపు MSME యూనిట్లుకు ప్రభుత్వ సబ్సిడీతో కూడిన బ్యాంకు ఋణాల కోసం మార్చి 25 వరకూ దరఖాస్తు చేసుకునేందుకు గడువును పెంచడం జరిగిందనీ బిసి కార్పొరేషన్ ఈ డి – ఏ. శ్రీనివాస రావు శనివారం ఒక ప్రకటనలో తెలియచేసారు. గతంలో ఆన్లైన్లో 8.10-3-2025 నుండి 8.22-3-2025 వరకు దరఖాస్తు చేసుకొన వలసినదిగా తెలియ జేయడమైనదన్నారు. ప్రస్తుతము ప్రభుత్వము వారు దరఖాస్తులు రిజిస్ట్రేషను చేసుకొనుటకు ఆఖరు తేది.25-03-2025 వరకు పొడింగించడమైన దృష్ట్యా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మరియు కాపు సామాజిక వర్గము వారు ఆర్దిక సహాయము కొరకు దరఖాస్తు చేసుకొనుటకు దరఖాస్తుదారుని యొక్క వయస్సు 21 నుండి 50 సంవత్సరములు ఉన్న వయో పరిమితిని 21 నుండి 60 సంవత్సరములకు పెంచడమైనదన్నారు.

కావున పై విషయములను దృష్టిలో ఉంచుకుని జిల్లాలో గల అర్హత కలిగిన బిసి, కాపు, వైశ్య, రెడ్డి, కమ్మ, క్షత్రియ, బ్రాహ్మణ మరియు EBC సామాజిక వర్గములకు చెందిన వారందరు ఋణముల కోసం http://apobmms.apcfss.in వెబ్సైట్లో దరఖాస్తులు రిజిస్ట్రేషను చేసుకొనవలెను.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *