Breaking News

గ్రామ ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించేందుకు ఎంపి కేశినేని శివ‌నాథ్ కృషి

-రేపూడి గ్రామ ప్రజలతో పంచాయతీ ఛాంపియన్స్ సమావేశం

ఏకొండూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్టీఆర్ జిల్లాలోని 295 గ్రామాలను విక‌సిత్ పంచాయ‌తీ కార్య‌క్ర‌మంలో స‌మగ్ర గ్రామీణాభివృద్ది చేసి, ప్ర‌జ‌ల‌కు మెరుగైన జీవ‌న ప్ర‌మాణాలు క‌ల్పించేందుకు ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) కృషి చేస్తున్నారని జిల్లా ఎన్.ఐ.ఆర్.డి.పి.ఆర్. ప్రోగ్రామ్ కో-ఆర్డినేటర్ సొంగా సంజయ్ వర్మ తెల‌పారు. ప్ర‌తి కుటుంబంలో ఒక‌రు పారిశ్రామిక‌వేత్త అయ్యేందుకు ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) , ఎమ్మెల్యే కొలిక‌పూడి శ్రీనివాస‌రావు అందిస్తున్న స‌హ‌కారం అందుకోవాల‌ని కోరారు. తిరువూరు నియోజకవర్గం ఎ.కొండూరు మండలంలోని రేపూడి గ్రామంలో ఆదివాం పంచాయతీ ఛాంపియన్స్ డ్వాక్రా మహిళలతో, గ్రామ ప్రజలతో సమావేశం నిర్వహించారు.

గ్రామపార్టీ ప్రసాద్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ గ్రామ స‌భ‌లో ఎన్టీఆర్ జిల్లా ఎన్.ఐ.ఆర్.డి.పి.ఆర్. ప్రోగ్రామ్ కో-ఆర్డినేటర్ సొంగా సంజయ్ వర్మ, మండ‌ల‌పార్టీ అధ్య‌క్షుడు గడ్డి కృష్ణారెడ్డి మాట్లాడుతూ స్వయం ఉపాధి రంగంలో ఎన్టీఆర్ జిల్లాను దేశంలో మోడల్ జిల్లాగా తీర్చిదిద్దటమే ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) లక్ష్యంగా పనిచేస్తున్నారని తెలిపారు, స్వయం ఉపాధి రంగంలో ఎంటర్ ప్రెన్యూర్స్ గా మారేందుకు పి.ఎమ్.జి.పి (ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయిమెంట్ జనరేషన్ ప్రోగ్రామ్-ప్రధాన మంత్రి ఉపాధి కల్పనా కార్యక్రమం) ద్వారా అందించే ఎమ్.ఎస్.ఎమ్.ఈ (మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ ప్రైజస్ ) రుణాలపై అవగాహన కల్పించారు. అలాగే స్వ‌యం ఉపాధి రంగంలో ఎంట‌ర్ ప్రెన్యూర్స్ గా మారేందుకు ఉన్న అవ‌కాశాల‌ను వివ‌రించారు. రేపూడి గ్రామంలో నాటు కోళ్ల పెంప‌కం, ప‌శువుల పెంప‌కంకు వాతావ‌ర‌ణం చాలా అనుకూలంగా వుంద‌న్నారు. ఆస‌క్తి వున్న‌వారికి హైద‌రాబాద్ లోని ఎన్.ఐ.ఆర్.డి లో శిక్ష‌ణ ఇప్పించి యూనిట్స్ పెట్టించేందుకు స‌హ‌క‌రిస్తామ‌న్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో , మండల పార్టీ ప్రధాన కార్యదర్శి వనపర్ల డెవిడ్ రాజు , మండ‌ల స‌మైక్య అధ్య‌క్షురాలు శ్రీల‌త‌, మాజీ ఎ.ఎమ్.సి చైర్మ‌న్ అలవాలా రమేష్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ వాసం మునియ్య, రైతు సంఘం నాయ‌కులు పిన్నమనేని శ్రీనివాసరావు,మాజీ ఏఎంసి డైరెక్టర్ పోలిశెట్టిపాడు ప్రసాద్ రెడ్డి ల‌తో పాటు డ్వాక్రా మహిళలు, గ్రామ ప్ర‌జ‌లు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *