-పాలచేర్ల ఆటో నగర్ లో మార్చి 26 బుధవారం రిజిస్ట్రేషన్ నమోదు కార్యక్రమం
-డి ఐ ఒ – శ్రీవనిధర్ రామన్
రాజమహేంద్రవరం / రాజానగరం , నేటి పత్రిక ప్రజావార్త :
ఉద్యమ్ (యాప్)లో పరిశ్రమల రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా పరిశ్రమల అధికారి శ్రీవనిధర్ రామన్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ఇప్పటికే సచివాలయం సిబ్బంది ద్వారా సర్వే పక్రియ ప్రారంభమైనట్లు తెలిపారు. రిజిస్ట్రేషన్ కోసం మార్చి 26 బుధవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆటో నగర్, పాలచెర్ల, రాజానగరం మండలం లో నమోదు పక్రియ కు ఏర్పాట్లూ చేస్తున్నట్లు తెలిపారు. రిజిస్ట్రేషన్ కోసం అర్హులైన అభ్యర్థులు ఫోన్ నంబర్, పాన్ కార్డు, ఆధార్, బ్యాంక్ బుక్ జెరాక్స్ కాఫీలతో హాజరుకావాలని తెలిపారు. ఆసక్తిగల వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
Prajavartha Online Telugu News