Breaking News

నేటి యువ శిల్ప కళాకారులకు ఆదర్శం దేవు దీక్షితులు


విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
శిలలపై శిల్పాలు చెక్కినాడు…సహజత్వం ఉట్టిపడేలా శిల్పాలను రూపొందించడంలో సుప్రసిద్ధ శిల్ప కళాకారుడు దేవు దీక్షితులు (శిల్పి) అందవేసిన చేయి. వంశపారంపర్యంగా వస్తున్న శిల్పాల తయారీ విద్య దానికి తోడు ఆయన ఆసక్తితో నేటి తరానికి శిల్ప తయారీకి నిదర్శనంగా నిలిచాడు. మట్టితో శిల్పాలను తయారు చేసి తద్వారా అచ్చులను తయారు చేసుకుని కంచు, రాగి తదితర మూర్తులను రూపొందించడం ఆయనకు వెన్నతోపెట్టి విద్య. ఆ విద్యతోపాటు తదితర విషయాలను ‘‘నేటి పత్రిక ప్రజావార్త’’ కు వివరించారు. దేవాలయాలకు పంచలోహ విగ్రహాలు, దేవుడి పూజకు అవసరమయ్యే వస్తు సామాగ్రి, దేవుని ఊరేగింపుకు ఉపయోగించే వాహనాలు, మకర తోరణాలు, గంటలు, కవచాలు, కంచుపాత్రలు, పంచలోహ విగ్రహాలు తదితరాలు తయారు చేస్తామని తెలిపారు. దేశ నాయకుల విగ్రహాలు, ప్రముఖుల విగ్రహాలు కంచుతో తయారుచేసి అందజేస్తామన్నారు. క్లేవర్క్‌, వాక్స్‌, కంచుతో వివిధ స్టెప్స్‌లో విగ్రహాలు తయారు చేస్తామన్నారు. దీనిలో 50 సంవత్సరాలు అనుభవం వుందన్నారు. ఇది తనకు వంశపారంపర్యంగా నాకు ఈ నైపుణ్యం వచ్చిందన్నారు. డిగ్రీ చదివి, ఫైన్‌ ఆర్ట్స్‌ డిప్లొమా ఇన్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ చేశానని తెలిపారు. ఒంగోలు, గుంటూరు వివిధ ప్రాంతాలలో మెడికల్‌ అండ్‌ హెల్త్‌ డిపార్ట్‌మెంట్‌లో ఆర్టిస్టుగా పనిచేసి రిటైర్డ్‌ అయినట్లు తెలిపారు. వీటితోపాటు సిమెంట్‌తో చేసిన విగ్రహాలు తయారీ, ఇలస్ట్రేషన్‌ వర్క్‌ మరియు పెయింటింగ్‌తో చిత్రాలు చిత్రీకరిస్తానన్నారు. కొద్దికొద్దిగా కనుమరుగవుతూ కొంత వరకు పరిమితం అవుతున్న శిల్ప కళాతయారీ విద్యను భావి తరాల వారికి తెలియజేయాలనేదే తన తాపత్రయమన్నారు. ఎంతోమంది గొప్పగొప్ప వ్యక్తల ప్రశంసలు, మరెన్నో అవార్డులు సాధించినా భావితరాలకు ఏదో చేయాలనే తపనతోపాటు తన కళ చిరస్మరణీయంగా నిలవాలన్నదే తన ఉద్దేశ్యమన్నారు. తాను తయారు చేసిన విగ్రహాలు ఇప్పటికీ కాలేజీల నుండి కళాక్షేత్రాలు తదితర కూడలి ప్రాంతాలలో వివిధ సైజులలో విగ్రహాలు మనం చూడవచ్చని తెలిపారు. అలాగే పూర్వీకుల జ్ఞాపకార్థం కూడా విదేశాల నుండి కూడా ఇక్కడకు వచ్చి తన చేత విగ్రహాలు చేయించుకుని వెళతారని తెలిపారు. ఎన్‌టిఆర్‌, సినీ డైరెక్టర్‌ జంధ్యాల, పట్టాభి సీతారామయ్య, మదర్‌థెరిసా, ఆచార్య ఎన్‌జి రంగా, ఇందిరాగాంధీ విగ్రహం, శ్రీకృష్ణదేవరాయలు విగ్రహం, దేశభక్తులు, అలెగ్జాండర్‌ గ్రాహంబెల్‌, శాస్త్రజ్ఞులు, తదితర విగ్రహాలు రెండు జంట తెలుగు రాష్ట్రాలలో దేవాలయాలలో మనం చూడవచ్చు. ఇప్పటికైనా ఇప్పటి ప్రభుత్వాలు కనుమరుగువుతున్న పురాతనమైన విగ్రహాల తయారీ కళను ప్రోత్సహించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇటువంటి కళాకారులను గుర్తించి ప్రభుత్వాలు తగిన విధంగా పురస్కారాలు అందజేయాలని ఆశిద్దాం…అవి ప్రోత్సాహకాలుగా యువతకు ఆదర్శంగా నిలుస్తాయి.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *