Breaking News

తాబేళ్ల పిల్లల సంరక్షణ కేంద్రం, శ్రీనివాస సత్రం, గుమ్మళ్ళ దిబ్బ బీచ్ ల వద్ద గల సముద్రం లోకి తాబేళ్ల పిల్లలను వదిలిన జిల్లా కలెక్టర్

-అంతరించి పోతున్న తాబేళ్లు జాతిని కాపాడాలి
-తాబేళ్లను రక్షించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది : జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్
-బీచ్ ల వద్ద ప్లాస్టిక్ నివారణ దిశగా కృషి చేస్తూ అంతరించి పోతున్న తాబేళ్లు జాతిని కలిసి కట్టుగా కాపాడుదాo : జిల్లా అటవీ శాఖ అధికారి వివేక్

చిల్లకూరు/కోట, నేటి పత్రిక ప్రజావార్త :
అంతరించి పోతున్న సముద్ర తాబేళ్ళు జాతిని రక్షించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది అని జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్ ఆన్నారు. బుదవారం చిల్లకూరు మండల లోని తాబేళ్ల పిల్లల సంరక్షణ కేంద్రం, శ్రీనివాస సత్రం, గుమ్మళ్ళ దిబ్బ బీచ్ లోకి జిందాల్ ఫౌండేషన్ వారి ఆధర్వంలో చేపట్టిన క ఆలివ్ రిఢ్లి సముద్ర తాబేళ్ల గుడ్లను సేకరించి ఉత్పత్తి చేసిన పిల్లలను జిల్లా అటవీ శాఖ అధికారీ వివేక్, జిందాల్ పవర్ లిమిటెడ్ planted అధినేత శ్రీనివాస రావు తో కలిసి సముద్రo లోకి వదిలిన జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… సముద్ర తాబేళ్లను రక్షించే బాధ్యత అటవీ శాఖ అధికారులతో పాటు సంబంధిత ప్రాంత ప్రజల సహకారం ఎంతైనా అవసరం అని అన్నారు. సముద్ర తాబేళ్లు కొన్ని నెలల పాటు వేల కి మీ దూరం ప్రయాణం చేసి తీర ప్రాంతాలకు వచ్చి గుడ్లు పెట్టడం జరుగుతుందని, వాటిని రక్షించి తాబేళ్లు ఉత్పత్తి, పరిరక్షణ కోసం కృషి చేయాలని తెలిపారు. అంతరించిపోతున్న తాబేళ్ళ ను కాపాడాలని వీటి ద్వారా మనుషులకు, ప్రకృతిని మేలు జరుగుతుందని అన్నారు. వీటి పరిరక్షణకు ప్రభుత్వం చొరవ తీసుకుని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారికి తగు సూచనులు ఇస్తోందని , డిపార్ట్మెంట్ వారితో పాటు ఇక్కడ ప్రజలు, మత్స్యకారులు కూడా వీటికి సహకరించాలని తెలిపారు. నవంబర్ నుండి ఫిబ్రవరి వరకు నాలుగు నెలలు వాటి ఉత్పతి కాలం అని వాటి గుడ్లను సేకరించి అవి పొదిగిన తరువాత వాటి పిల్లలను తిరిగి సముద్రంలోకి వదిలేలా అటవీ అధికారులు చర్యలు తీసుకుంటున్నారని అలాగే వారికి సహకారం అందిస్తున్న ఎన్ జి ఓ లు,మరియు జిందాల్ సంస్థకు కృతజ్ఞతలు తెలిపారు. శ్రీనివాస సత్రం, గుమ్మళ్ళు దిబ్బ బీచ్ లు రెండు సుందరమైనవి అని పర్యాటక ప్రాంతాలకు అనుకూలమైనవి అన్నారు. రెండు బీచ్ లో ప్లాస్టిక్ వాడకంను నివారించి, పర్యావరణ కు కృషి చేయాలని తెలిపారు. తిరుపతి జిల్లాలో ఇంత ఆహ్లాదకర బీచ్ లు ఉన్నాయని ఎవ్వరికీ తెలియదు అన్నారు. ఇది ఒక మంచి కార్యక్రమం అని ఈ ఆహ్లాదకర వాతావరణం బీచ్ ల కు రావడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు.

జిల్లా అటవీ శాఖ అధికారి మాట్లాడుతూ.. శ్రీనివాస సత్రం, గుమ్మళ్ళ దిబ్బ బీచ్ ల వద్ద ప్లాస్టిక్ నివారణ దిశగా కృషి చేస్తూ.. అంతరించి పోతున్న తాబేళ్లు జాతిని కలిసి కట్టుగా కాపాడుదాo అన్నారు. శ్రీనివాస సత్రం, గుమ్మళ్ళు దిబ్బ బీచ్ లను ప్రపంచ బెస్ట్ తాబేళ్ళు గ్రామం, రిసార్ట్ ప్రాంతoగా మార్చుదాo అని తెలిపారు. ఇక్కడ ఉన్న తాబేళ్లు 1000 కి. మీలు ప్రయాణించి ఇక్కడి వస్తున్నాయని వీటిని సంరక్షించాల్సిన బాద్యత ఉన్నదని అన్నారు. కార్పొరేట్ సామాజిక భాద్యత క్రింద సహాకరం అందిస్తూ ఇక్కడ పనులు చక్కగా జరిపిస్తున్న జిందాల్ పవర్ సంస్థ వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఇక్కడ ఫారెస్ట్ రేంజ్ అధికారులు కూడా బాగా పనిచేస్తున్నారని అన్నారు. ఇక్కడ ఉన్న ఊర్ల అభివృద్ధికి ఏ విదంగా సహాకారం కావాలనేది చెబితే జిల్లా కలెక్టర్ గారితో చర్చించి పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు. తాబేళ్లు రక్షణ కు ప్రతి ఒక్కరూ బాగస్వాములు కావాలని అన్నారు.

జిందాల్ పవర్ లిమిటెడ్ ప్లాంటెడ్ అధినేత మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణ, ప్లాస్టిక్ రహిత దిశగా జిందాల్ ఫౌండేషన్ సంస్థ తరపున కృషి చేస్తున్నామని అన్నారు. ఫిషర్ మెన్ కమిటీల వారికి చేదోడుగా ఉంటూ అలాగే ప్రకృతిని పరిరక్షించేందుకు జిందాల్ పవర్ సంస్థ ద్వారా కార్పొరేట్ సామాజిక బాద్యత క్రింద సహకారం అందించడం జరుగుతోందని అన్నారు. ఆలివ్ రిడ్లీ సముద్ర తాబేలు పరిరక్షణకు మేము చేస్తున్న ఈ ప్రయత్నం ద్వారా సముద్ర పర్యావరణ స్థిరత్వానికి మరియు సమతుల్యతకు దోహద పడుతుందని అన్నారు. తాబేళ్లను సంరక్షిస్తే అవి ప్రకృతిని సంరక్షిస్తాయని అన్నారు. Jindal Power Limited & JINDAL Foundation అద్వర్యంలో 10 వేల గుడ్లను సేకరించి వాటిని సురక్షితంగా పరిరక్షిస్తున్నామని దశలవారీగా ఇప్పటి వరకు 3500 పిల్లలను వదలడం జరిగిందని, ఈ రోజు 500 తాబేలు పిల్లలను జిల్లా కలెక్టర్ గారు వదలడం జరిగింది అని అన్నారు. ఆలివ్ రిడ్లీ సముద్ర తాబేలు జెల్లీ ఫిష్ జనాభాను నియంత్రించేందుకు, సముద్ర ఆహార శృంఖల నియంత్రణలో సహాయపడతాయి అన్నారు. సముద్రపు చేపల సంరక్షణకు ఆలివ్ రిడ్లీ సముద్ర తాబేళ్ళు ముఖ్యమైన పాత్రను పోషిస్తాయని అన్నారు.

బీచ్ లో వద్ద ఉన్న తాబేళ్లు గుడ్లను సేకరించి ఉత్పత్తి చేసే ఫక్రియను జిల్లా కలెక్టర్ పరిశీలించారు.

ఈ కార్యక్రమంలో బీచ్ ల దగ్గర తాబేల ఉత్పత్తికి, వారు చేస్తున్న కృషికి ఫారెస్ట్ రేంజ్ అధికారులను జిల్లా కలెక్టర్ ఘనంగా సత్కరించడo జరిగింది.

ఈ కార్యక్రమంలో టీ డి పి మండల అధ్యక్షుడు వెంకటేశ్వర రెడ్డి, తాసిల్దార్ శ్రీనివాసులు, ఫారెస్ట్ రేంజ్ అధికారులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

గుంటూరు నగరంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మహిళా ఓటర్ల గుర్తింపు ప్రక్రియ ప్రారంభం : నగర కమిషనర్ మయూర్ అశోక్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల (G.O.Rt.No. 1165, MA&UD Department) ప్రకారం గుంటూరు నగర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *