Breaking News

అంబేద్కర్ ఆశయ సాధన కోసం కృషి చేయాలి

-ఎమ్మెల్యే సుజనా చౌదరి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి ఎనలేని కృషి చేసిన మహనీయుడు డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్ ఆశయసాధనకు ప్రతీ ఒక్కరు కృషి చేయాలని పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయ( సుజనా చౌదరి) అన్నారు.
భవానిపురం, 41 వ డివిజన్ అంబేద్కర్ సొసైటీ సెక్రెటరీ పెరికల నాగభూషణం ఆధ్వర్యంలో బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ 134వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే సుజనా చౌదరి ముఖ్యఅతిథిగా పాల్గొని కూటమి నేతలతో కలిసి అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడుగు, బలహీన, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం భారత రాజ్యాంగాన్ని రూపకల్పన చేసి అందరికి సమాన హక్కులు కల్పించిన మహోన్నత వ్యక్తి అంబేడ్కర్‌ అని కీర్తించారు. దేశంలో నేడు అన్ని వ్యవస్థలు, క్రమ పద్ధతిలో నడుస్తున్నాయంటే దానికి డా.బీఆర్‌ అంబేడ్కర్‌ రాసిన రాజ్యాంగమే కారణమని తెలిపారు. భారతదేశాన్ని ప్రపంచానికి చాటిన అతి కొద్దిమందిలో అంబేడ్కర్‌ ఒకరని తెలిపారు. ఆయన చదువుకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చారని, ఎన్నో కష్టాలు ఎదురైనా ఎంతో పట్టుదలగా చదువుకున్నారని, ఆయన ఆశయాలకు అనుగుణంగా ప్రతీ ఒక్కరు స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలన్నారు.
అనంతరం మాలపల్లి లో రచ్చబండ కార్యక్రమం నిర్వహించి స్థానిక ప్రజల సమస్యలను తెలుసుకున్నారు.
ప్రజా సమస్యల పరిష్కారం కోసం సుజనా మిత్ర ఏర్పాటు చేశామన్నారు. డివిజన్లలోని సమస్యలను వారికి తెలపాలని సూచించారు. పేదలు, బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.

పచ్చకామెర్ల వాడికి లోకమంతా పచ్చగా కనబడుతుంది
సుజనా చౌదరి

పశ్చిమ నియోజకవర్గంలో అభివృద్ధి జరగడంలేదని మాజీ ఎమ్మెల్యే వేలంపల్లి శ్రీనివాసరావు విమర్శించారని విలేకరి ప్రశ్నించగా పచ్చకామెర్ల వాడికి లోకమంతా పచ్చగా కనబడుతుందని సుజనా ఎద్దేవా చేశారు. వేలంపల్లి శ్రీనివాస్ అభివృద్ధి కళ్ళకు గంతలు కట్టే ప్రయత్నం మానుకోవాలని సూచించారు . నియోజకవర్గంలో పర్యటించి పశ్చిమ అభివృద్ధిని చూడాలని సుజనా చౌదరి వెల్లంపల్లి కి సలహా ఇచ్చారు. కార్యక్రమంలో సెంట్రల్ జి యస్ టి అసిస్టెంట్ మేనేజర్ ఏం నాగరాజు, పత్తి నాగేశ్వరరావు, బబ్బురి శ్రీరామ్, సందీప్, వినోద్, కన్ని , పెయ్యేల దాసు, తదితరులు పాల్గొన్నారు.

భావితరాలకు స్ఫూర్తి ప్రదాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్
ఎన్డీఏ కూటమి నేతల ఆధ్వర్యంలో నాలుగు స్తంభాల సెంటర్ లో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఎమ్మెల్యే సుజనా చౌదరి ముఖ్యఅతిథిగా పాల్గొని ఎన్డీఏ కూటమినేతలు నాగుల్ మీరా, అడ్డూరి శ్రీరామ్, కామా దేవరాజ్ లతో కలిసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా సుజనా మాట్లాడుతూ భావితరాలకు స్ఫూర్తి ప్రదాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అన్నారు. భారతదేశాన్ని రాచరికం నుంచి ప్రజాస్వామ్య దేశంగా మనుగడ సాగించడానికి అంబేద్కర్ భారత ప్రజలకు రాజ్యాంగాన్ని రూపొందించారని పేర్కొన్నారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రపంచంలోనే అత్యుత్తమమైందని ప్రజాస్వామ్య దేశంగా భారత్ పరిఢవిల్లుతోందన్నారు .అణగారిన వర్గాలకు హక్కులు కల్పించిన ప్రదాత అంబేద్కర్ అని కొనియాడారు. గత వైసీపీ ప్రభుత్వంలో అంబేద్కర్ విగ్రహాలను కూడా పట్టించుకోక నిర్లక్ష్యం చేశారని తెలిపారు. గత ఏడాది ఎన్నికల పర్యటనలో భాగంగా పశ్చిమ లో ఉన్న అంబేద్కర్ విగ్రహాలను చూసి బాధపడ్డారని అన్నారు. అంబేద్కర్ విగ్రహాలన్నీ సుందరీకరణ పనులు చేపట్టి ఆధునికరిస్తామని ఆరోజు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని తెలిపారు. టిడిపి అధికార ప్రతినిధులు నాగుల్ మీరా మాట్లాడుతూ ఎమ్మెల్యే సుజనా చౌదరి పశ్చిమ లో విద్యా,వైద్యం మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తూ సమగ్రమైన అభివృద్ధి ప్రణాళికను రూపొందిస్తున్నారని తెలిపారు. అంబేద్కర్ ఆశయాలను కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుందన్నారు. కార్యక్రమంలో కూటమి నేతలు మంటి కోటేశ్వరరావు,గుడివాడ నరేంద్ర రాఘవ, మద్ది రాజీవ్ కృష్ణ, పచ్చిపులుసు శివప్రసాద్, పైలా సురేష్,రెడ్డిపల్లి రాజు,యేదుపాటి రామయ్య, ఏలూరి సాయి శరత్, బొడ్డుపల్లి శ్రీనివాస్, గన్నవరపు శ్రీనివాస్, గణేష్,తదితరులు పాల్గొన్నారు.

ఐక్యంగా ముందుకు వెళ్దాం
ఎమ్మెల్యే సుజనా చౌదరి

జై భీమ్ మాల మహానాడు కమిటీ ఆధ్వర్యంలో పాత రాజరాజేశ్వరి పేటలో అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే సుజనా చౌదరి, టిడిపి అధికార ప్రతినిధి నాగుల్ మీరా ముఖ్య అతిథులుగా పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నియోజకవర్గ అభివృద్ధికి ఐక్యంగా ముందుకు వెళ్దామని ఎమ్మెల్యే సుజనా చౌదరి పిలుపునిచ్చారు. తనకు అత్యధిక మెజారిటీ ఇచ్చిన పశ్చిమ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తన పాలన ఉంటుందన్నారు. ఓటు వేయని వారికి కూడా సంక్షేమం అందాలనేదే తన అభిమతం అన్నారు. మాజీ ఎమ్మెల్యే వైసీపీ కార్పొరేటర్లు లేనిపోని విమర్శలు మాని అభివృద్ధికి సహకరించాలని ఎమ్మెల్యే సుజనా కోరారు. కార్యక్రమంలో కూటమి నేతలు జ్యోతుల విజయ్, నున్న కృష్ణ, లెవిన్ బాబు, గాయత్రి, వసుంధర, దేవకి తదితరులు పాల్గొన్నారు.

ఐక్యంగా ముందుకు వెళ్దాం
ఎమ్మెల్యే సుజనా చౌదరి

జై భీమ్ మాల మహానాడు కమిటీ ఆధ్వర్యంలో పాత రాజరాజేశ్వరి పేటలో అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే సుజనా చౌదరి, టిడిపి అధికార ప్రతినిధి నాగుల్ మీరా ముఖ్య అతిథులుగా పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నియోజకవర్గ అభివృద్ధికి ఐక్యంగా ముందుకు వెళ్దామని ఎమ్మెల్యే సుజనా చౌదరి పిలుపునిచ్చారు. తనకు అత్యధిక మెజారిటీ ఇచ్చిన పశ్చిమ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తన పాలన ఉంటుందన్నారు. ఓటు వేయని వారికి కూడా సంక్షేమం అందాలనేదే తన అభిమతం అన్నారు. మాజీ ఎమ్మెల్యే వైసీపీ కార్పొరేటర్లు లేనిపోని విమర్శలు మాని అభివృద్ధికి సహకరించాలని ఎమ్మెల్యే సుజనా కోరారు. కార్యక్రమంలో కూటమి నేతలు జ్యోతుల విజయ్, నున్న కృష్ణ, లెవిన్ బాబు, గాయత్రి, వసుంధర, దేవకి తదితరులు పాల్గొన్నారు.

భారతీయ జనతా పార్టీ 34 వ డివిజన్ బీజేపీ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
జాతీయ బిజెపి ఎస్సీ నాయకురాలు బొడ్డు నాగలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించిన జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే సుజనా చౌదరి ముఖ్యఅతిథిగా పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఖుద్దుస్ నగర్ లో పర్యటించి స్థానిక ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు..ప్రతి ఒక్కరికి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే సుజనా హామీ ఇచ్చారు. కార్యక్రమంలో టీడీపీ అధికార ప్రతినిధి నాగుల్ మీరా, అడ్డూరి శ్రీరామ్ బుల్లా విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

35వ డివిజన్ టిడిపి అధ్యక్షురాలు భూదాల నందకుమారి ఆధ్వర్యంలో పెజ్జోని పేటలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే సుజనా చౌదరి ముఖ్యఅతిథిగా పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో కూటమినేతలు బొడ్డు నాగలక్ష్మి, లెవిన్ బాబు, ప్రదీప్ రాజ్, సునీత తదితరులు పాల్గొన్నారు.

హెచ్.బీ కాలనీ షెడ్యూల్డ్ కులాల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో భవానిపురం ఎన్డీఏ కార్యాలయంలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు జెట్టి రామారావు, సెక్రెటరీ దాసరి బుజ్జి , కోటేశ్వరరావు, అలీ, వాణి, మేరీ, నజీబ్, జోసెఫ్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిన్నతనంలోనే కండరాల క్షీణత గుర్తింపుపై ప్రత్యేక దృష్టి: మంత్రి కందుల దుర్గేష్

-అమరావతి రేర్ డిసీజెస్ ఆర్గనైజేషన్ ఫౌండర్ శోభారాణి సుంకర సేవలు అభినందనీయమని కొనియాడిన మంత్రి దుర్గేష్ అమరావతి, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *