Breaking News

విద్యార్థులందరూ రాజ్యాంగంపై అవగాహన కలిగి ఉండాలి

-ఎమ్మెల్యే సుజనా చౌదరి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అంబేద్కర్ జయంతి పురస్కరించుకొని జన సేవ సొసైటీ ఆధ్వర్యంలో మొగల్రాజపురం సిద్ధార్థ కళాశాలలో యూత్ పార్లమెంట్ నిర్వహించారు. వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.. ఎమ్మెల్యే సుజనా చౌదరి ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ అంబేద్కర్ జయంతి రోజున యూత్ పార్లమెంట్ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషకరమన్నారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తోందని తెలిపారు. ప్రపంచంలోనే అతి పెద్ద రాజ్యాంగం భారత దేశం కలిగి ఉండటం మనమంతా గర్వించదగ్గ విషయమన్నారు. ప్రజలకు హక్కులు, స్వేచ్చా, సమానత్వం రాజ్యాంగం వల్ల మాత్రమే సాధ్యమైందన్నారు. ఈరోజున మనం ప్రశాంతంగా, సగర్వంగా తలెత్తుకు జీవిస్తున్నామంటే అది రాజ్యాంగం మనకు కల్పించిన వరం వల్ల మాత్రమేనన్నారు. ప్రతి ఒక్కరూ రాజ్యాంగం గురించి తెలుసుకోవాలని, భావితరాలకు తెలియ చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. స్వతంత్ర భారతదేశంలో గత పది సంవత్సరాల మోడీ పాలనలో దేశ ఆర్థిక వ్యవస్థను పూర్తిగా మార్చే అనేక ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారన్నారు. ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ మారుతుందన్నారు. నేటితరం విద్యార్థులు సామాజికపరంగా రాజకీయంగా అవగాహన కలిగి ఉండాలని రాజ్యాంగం గురించి తెలుసుకోవాలని సుజనా చౌదరి సూచించారు.
కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా బిజెపి అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్, బిజెపి సీనియర్ నాయకులు వామరాజు సత్యమూర్తి, కిలారి దిలీప్,జనసేవ సొసైటీ అధ్యక్షులు ఆదిశేషు, రాష్ట్ర అధ్యక్షులు ధనుష్ తదితరులు పాల్గొన్నారు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

వర్షాల నేపథ్యంలో మురుగునీటి ప్రవాహానికి ఎలాంటి అంతరాయం లేకుండా పటిష్ట చర్యలు

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వర్షాల నేపథ్యంలో మురుగునీటి ప్రవాహానికి ఎలాంటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *