విజయవాడ. నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి, యన్.టి.ఆర్ జిల్లా పరిపాలనా నియంత్రణలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన అనుబంధంలో పేర్కొన్న పోస్టుల నియామకానికి అర్హత ఉన్న అభ్యర్థుల నుండి సూచించిన ప్రొఫార్మాలో దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. దరఖాస్తుదారులు దరఖాస్తును మరియు అందుబాటులో ఉన్న ఖాళీల వివరాలను మరియు అర్హత వివరాలను వెబ్‌సైట్ చిరునామా ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
వెబ్‌సైట్ అడ్రస్:-
ntr.ap.gov.in/notice/recruitment.
నింపిన దరఖాస్తులను O/o జిల్లా లెప్రసీ ఎయిడ్స్ & TB అధికారి., యన్.టి.ఆర్, విజయవాడ జిల్లాలో మాత్రమే మాన్యువల్‌గా/ రిజిస్టర్ పోస్ట్ ద్వారా సమర్పించాలి. 25.04.2025 నుండి 30.04.2025 వరకు అన్ని పని దినాలలో ఉదయం 10.30 నుండి సాయంత్రం 5 గంటల వరకు అవసరమైన అన్ని సర్టిఫికెట్లతో పాటు పంపాలి. నింపిన దరఖాస్తులను సమర్పించడానికి చివరి తేదీ 30.04.2025 సాయంత్రం 5 గంటలలోపు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి డా.యం.సుహసిని ఓ ప్రకటనలో తెలిపారు.
Tags vijayawada
Check Also
అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం
-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …
Prajavartha Online Telugu News