Breaking News

శాస్త్రీయ సలహా సంఘం సమావేశం

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
స్థానిక రాజమహేంద్రవరం ఐ సి ఏ ఆర్ – జాతీయ వాణిజ్య పరిశోధన సంస్థ ఆధ్వర్యంలో పనిచేస్తున్న కృషి విజ్ఞాన కేంద్రం కలవచర్ల వారి శాస్త్రీయ సలహా సంఘం సమావేశం రాజమండ్రిలో నిర్వహింపబడినది. ఈ సమావేశానికి జాతీయ వాణిజ్య పరిశోధన సంస్థ డైరెక్టర్ డాక్టర్ మాగంటి శేషు మాధవ్ అధ్యక్షత వహించగా డాక్టర్ టి. శ్రీనివాస్, అసోసియేటెడ్ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్, ప్రాంతీయ వరి పరిశోధనా స్థానం, మారుటెరు; డాక్టర్ పి. ముత్తు రామన్, ప్రధాన శాస్త్రవేత్త (వ్యవసాయ విస్తరణ విభాగం), ఐ సి ఏ ఆర్ – భారత వరి పరిశోధనా సంస్థ, హైదరాబాదు; డాక్టర్ వి ఎస్ జి ఆర్ నాయుడు, హెడ్, కెవికెకలవచర్లవేదికను అలంకరించారు. ఈ శాస్త్రీయ సలహా సంఘం సమావేశంలో సాంకేతిక నిపుణులు 2024-25 సంవత్సరంలో చేపట్టిన కార్యక్రమాలు, 2025-26 సంవత్సరంలో చేపట్టబోయే కార్యాచరణ ప్రణాళికను ఖరారు చేయడం వంటివి సభలో నిర్ధారించబడతాయి.
కెవికెకలవచర్ల వారి శాస్త్రీయ సలహా సంఘం సమావేశానికి ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో పనిచేసే పరిశోధన స్థానాల శాస్త్రవేత్తలు-ఏరువాక కేంద్రం, పెద్దాపురం, రాజమండ్రి, కాకినాడ శాస్త్రవేత్తలు; డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం పరిశోధనా స్థానం అంబాజీపేట నుండి డాక్టర్ ఎంబీవి చలపతిరావు, ప్రధాన శాస్త్రవేత్త; కొవ్వూరు అరటి పరిశోధన స్థానం నుండి డాక్టర్ పి లలితా కామేశ్వరి, ప్రధాన శాస్త్రవేత్త;ఐకార్ ప్రాంతీయ పూల పరిశోధనా స్థానం,వేమగిరి ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ డివీఎస్ రాజు; డాక్టర్ శిరీష; జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు; జిల్లా ఉద్యానవన శాఖ అధికారులు; నాబార్డు అసిస్టెంట్ జనరల్ మేనేజర్ శ్రీ వై సోము నాయుడు; వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ (ATMA), తూర్పుగోదావరి ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్టర్ వై జ్యోతిర్మయి; డాక్టర్ టి శ్రీనివాసరావు, జాయింట్ డైరెక్టర్, పశుసంవర్ధక శాఖ, తూర్పుగోదావరి; డాక్టర్ కృష్ణమూర్తి, డిప్యూటీ డైరెక్టర్, పశుసంవర్ధక శాఖ, కాకినాడ; డాక్టర్ దినకర్, అసిస్టెంట్ డైరెక్టర్; డాక్టర్ అరుణ,వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్, పుణ్యక్షేత్రం; జిల్లాలోని వివిధ మండలాలకు చెందిన రైతులు, స్వయం సహాయక బృందాల సభ్యులు,ఎన్జీవోలు, పూర్వపు సాంకేతిక అధికారులు డాక్టర్ జాన్ బాబు మరియు ఆర్. సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
డాక్టర్ మాగంటి శేషు మాధవ్ డైరెక్టర్ మాట్లాడుతూ ప్రతి సబ్జెక్టు మేటర్ స్పెషలిస్టు జిల్లాలోని కెవికె పరిధిలోని మండలాలకు చెందిన వ్యవసాయ, ఉద్యాన రంగాల సమాచారాన్ని బెంచ్ మార్పు సర్వేగా పరిగణించుకుని సహజ వనరుల ఉపలబ్ది తదితర అంశాలను మ్యాపింగ్ చేసుకుని అత్యంత అవస్థ్యకత అంశాలను గుర్తించి డాక్యుమెంట్ చేయమని సూచించారు. విధిగా జిల్లాలోని నిర్దిష్ట సమస్యలను గుర్తించి రైతులకు లబ్ధి చేకూరే విధంగా వారి కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకోవాలని సూచించారు. కే వి కే పరిధిలోని 52 మండలాలకు చెందిన వనరులను దృష్టిలో పెట్టుకొని కార్యక్రమాలను రూపొందించుకోవాలని తెలిపారు.
డాక్టర్ వి ఎస్ జి ఆర్ నాయుడు,హెడ్, కెవికెకలవచర్లమాట్లాడుతూ కేవీకే గత సంవత్సరం చేపట్టిన కార్యక్రమాలను వివరించి వ్యవసాయ విభాగం కార్యక్రమాలను సభకు వివరించారు. జే.వి.యర్.సత్యవాణి ఉద్యాన విభాగం చేపట్టిన ప్రదర్శన క్షేత్రం మరియు క్షేత్రస్థాయి పరిశీలనలను వివరించగా, రఘునందన్ సస్యరక్షణ విభాగం కార్యక్రమాలను వివరించారు. డాక్టర్ బి నాగేశ్వర్రెడ్డిపశునిర్వహణ విభాగం కార్యక్రమాలు, డాక్టర్ రవీంద్ర మత్స్యశాఖ కార్యక్రమాలను వివరించగా, సంజయ్ హెగ్డేగృహవిజ్ఞాన కార్యక్రమాలను వివరించారు.
డాక్టర్ పి. ముత్తు రామన్, ప్రధాన శాస్త్రవేత్త మాట్లాడుతూ కె వి కె తప్పనిసరిగా శిక్షణానంతరం రైతుల స్వయం ఉపాధి అవకాశాలను గమనించి విధిగా డాక్యుమెంట్ చేయాలని సూచించారు. రైతు ప్రయోజనార్థం తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడులు సాధించే దిశగా ప్రణాళికలను చేపట్టాలని సూచించారు.
డాక్టర్ టి. శ్రీనివాస్, అసోసియేటెడ్ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ మాట్లాడుతూ కేవీకేమారుటెరు పరిశోధన సంస్థ, ఏరువాక కేంద్రాలు, సమన్వయంగా వ్యవసాయ ప్రదర్శనలు క్షేత్రస్థాయి ప్రదర్శనలు చిరు సంచుల ప్రదర్శనలు చేపట్టాలని సూచించారు.
శాస్త్రీయ సలహా సంఘం సమావేశం సందర్భంగా రైతు ప్రయోజనార్థం లిల్లీ తోటల్లో నులిపురుగు నివారణ సమగ్ర యాజమాన్యం మరియు పసుపులో దుంప కుళ్ళు సమగ్ర యాజమాన్యం అనే రెండు కరపత్రాలను గౌరవ అతిధుల ద్వారా విడుదల చేయబడినాయి.
డాక్టర్ వి ఎస్ జి ఆర్ నాయుడు కె వి కె హెడ్ వందన సమర్పణతో శాస్త్రీయ సలహా సంఘం సమావేశం ముగిసినది.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

గుంటూరు నగరంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మహిళా ఓటర్ల గుర్తింపు ప్రక్రియ ప్రారంభం : నగర కమిషనర్ మయూర్ అశోక్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల (G.O.Rt.No. 1165, MA&UD Department) ప్రకారం గుంటూరు నగర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *