Breaking News

తూర్పుగోదావరి జిల్లా నూతన బాడీ సమీక్షా సమావేశం

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లా జంతు హింస నివారణ సంఘం (DSPCA), తూర్పుగోదావరి జిల్లా నూతన బాడీ సమీక్షా సమావేశం తేదీ: 07.05.2025 ఉదయం 11.00 గం.లకు వీడియో కాన్ఫిరెన్స్ హాల్, కలెకెరేట్, బొమ్మూరు నందు నిర్వహించబడుతుంది. నూతనముగా ఏర్పడిన తూర్పుగోదావరి జిల్లా లో జిల్లా కలెక్టర్ వారి ఆధ్వర్యములో జిల్లా జంతు హింస నివారణ సంఘం (DSPCA), తూర్పుగోదావరి జిల్లా లో నూతన బాడీ ఏర్పడింది. ఈ సొసైటి లో వివిధ ప్రభుత్వ శాఖల భాగస్వామ్యం తో అనగా రెవెన్యూ, పోలీసు, ట్రాన్స్ పోర్ట్, పంచాయితీ రాజ్ మరియు పశు సంవర్ధక శాఖ ల జిల్లా అధికార్లు సభ్యులు గా వ్యవహరిస్తారు. మరియు జంతు ప్రేమికులు, గోశాల నిర్వాహకులు జాతీయ మరియు రాష్ట్ర స్థాయి యానిమల్ వెల్ఫేర్ బోర్డు ప్రతినిధులు అనధికార సభ్యులు గా వ్యవహరిస్తారు ఈ సంఘానికి జిల్లా కలెక్టర్ గారు చైర్ పర్సన్ గాను, జిల్లా పోలీసు అధికారి వైస్ చైర్ పర్సన్ గాను, జంతు ప్రేమికులలో ఒకరు మరియొక వైస్ చైర్ పర్సన్ గాను DSPCA నోడల్ ఆఫీసర్ అయిన వెటరినరీ అసిస్టెంట్ సర్జన్ కోశాధికారిగా అలాగే జిల్లా పశు సంవర్ధక శాఖాధికారి కార్యదర్శి గా వ్యవహరిస్తారు. ఈ యొక్క సంఘం యానిమల్ వెల్ఫేర్ బోర్డు ఆఫ్ ఇండియా వారి సూచనలకు అనుగుణంగా రిజిస్టర్ అయినది. ఈ సొసైటి లోని సభ్యులందరూ విధిగా ఈ సమీక్షా సమావేశమునకు హాజరు కావాల్సినదిగా కార్యదర్శి డా. టి. శ్రీనివాస రావు, జిల్లా పశు సంవర్ధక శాఖాధికారి, తూర్పుగోదావరి జిల్లా వారు తెలియజేసియున్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఇంద్రకీలాద్రిపై భక్తులకు సరికొత్త సేవలు- రాష్ట్రంలోనే తొలిసారిగా ‘లడ్డూ ప్రసాదం ఏటీఎం’ ప్రారంభం

ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం (ఇంద్రకీలాద్రి) కొండ దిగువన, అర్జునవీధి ప్రారంభంలోని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *