-మే 8 తేదీన శ్రీసిటీ లో ఎల్ జి ఎలక్ట్రానిక్స్ పరిశ్రమకు శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న రాష్ట్ర విద్యాశాఖ, ఐటి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ మరియు ఆర్టిజి శాఖ మంత్రి నారా లోకేష్ కు ఘన స్వాగతం
రేణిగుంట, నేటి పత్రిక ప్రజావార్త :
తిరుపతి జిల్లా రెండు రోజుల పర్యటన నిమిత్తం నేటి బుదవారం రేణిగుంట విమానాశ్రయంకు చేరుకున్న రాష్ట్ర విద్యాశాఖ, ఐటీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ మరియు ఆర్టిజీ శాఖ మంత్రి నారా లోకేష్ కి ఘన స్వాగతం లభించింది. రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి మరియు జిల్లా ఇన్చార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్, జిల్లా కలెక్టర్ డా. వెంకటేశ్వర్ ఎస్ , ఎస్పీ హర్ష వర్ధన్ రాజు, ట్రైనీ కలెక్టర్ సందీప్ రఘువాన్షి, తిరుపతి, చంద్రగిరి, శ్రీకాళహస్తి, సూళ్లూరుపేట, నగరి, వెంకటగిరి, సత్యవేడు, గూడూరు ఎమ్మెల్యే లు ఆరని శ్రీనివాసులు, పులివర్తి నాని, బొజ్జల సుదీర్ రెడ్డి, నెలవల విజయశ్రీ , గాలి భానుప్రకాష్, కురుకొండ్ల రామకృష్ణ , చిత్తూరు ఎంఎల్ఏ గురజాల జగన్మోహన్, పూతలపట్టు ఎమ్మెల్యే మురళి మోహన్, డిప్యూటీ మేయర్ ఆర్ సి మునికృష్ణ, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, శ్రీకాళహస్తి ఆర్డిఓ భాను ప్రకాష్ రెడ్డి, చూడ చైర్ పర్సన్ కటారి హేమలత, తదితర అధికారులు ప్రజాప్రతినిధులు మంత్రి వర్యులకు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. అనంతరం మంత్రి రోడ్డు మార్గాన సత్యవేడుకు బయల్దేరి వెళ్ళారు.
Prajavartha Online Telugu News