గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరంలో స్థానిక సమస్యల పరిష్కారం కోసం నగరపాలక సంస్థలో చేపట్టే డయల్ యువర్ కమిషనర్, పిజిఆర్ఎస్ లో ప్రజలు ఇస్తున్న అర్జీల్లోని ఫిర్యాదులకు సంబంధించి, సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకుంటామని గుంటూరు నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ అన్నారు. సోమవారం కమిషనర్ గారి ఆదేశాల మేరకు డిప్యూటీ కమిషనర్లు డి.శ్రీనివాసరావు, సిహెచ్.శ్రీనివాస్, బి.శ్రీనివాసరావులు, విభాగాధిపతులు కమిషనర్ చాంబర్ లో డయల్ యువర్ కమిషనర్, నగరపాలక సంస్థ బర్త్ అండ్ డెత్ విభాగం వద్ద పిజిఆర్ఎస్ నిర్వహించారు.
ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్లు తొలుత డయల్ యువర్ కమిషనర్ ద్వారా ప్రజల నుండి 17 ఫిర్యాదులు అందుకొని, మాట్లాడుతూ డయల్ యువర్ కమిషనర్ కి అందిన ఆర్జీల పరిష్కారానికి విభాగాధిపతులే క్షేత్ర స్థాయి పరిశీలనకు వెళ్లాలన్నారు. అర్జీల పరిష్కార పురోగతిపై కమిషనర్ చాంబర్ కు ఎప్పటికప్పుడు నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.
అనంతరం నగరపాలక సంస్థ బర్త్ అండ్ డెత్ విభాగం వద్ద పిజిఆర్ఎస్ ద్వారా 37 ఫిర్యాదులు అందుకొని మాట్లాడుతూ పట్టణ ప్రణాళిక విభాగం 17, ఇంజినీరింగ్ విభాగం 12, రెవెన్యూ విభాగం 4, ప్రజారోగ్య విభాగం 1, ఉపా సెల్ విభాగానికి సంబందించి 3 ఫిర్యాదు అందాయన్నారు. పిజిఆర్ఎస్ లో ప్రజల నుండి అందిన ఆర్జీలను విభాగాల వారిగా విబజించి, సంబంధిత విభాగాదిపతులకి పంపి సమస్యల సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో సిటి ప్లానర్ రాంబాబు, సిఏంఓహెచ్ డాక్టర్ అమృతం, ఎంహెచ్ఓ డాక్టర్ రవిబాబు, ఈఈలు సుందర్రామిరెడ్డి, కోటేశ్వరరావు, బయాలజిస్ట్ రామారావు, మేనేజర్ బాలాజీ బాష, విభాగాల సూపరింటెండెంట్లు, ఎస్ఎస్ లు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News