-వడదెబ్బకు గురికాకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలి
-తడి చెత్త పొడి చెత్త వేరు చేయాలి : జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్
-నియోజకవర్గ ప్రజలలందరూ చుట్టుపక్కల ప్రదేశాలు పరిశుబ్రంగా ఉంచుకోవడం వలన ఎలాంటి ఆరోగ్య సమస్యలు దరిచేరవు : సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయ శ్రీ
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో ప్రతి నెల మూడవ శనివారం జనవరి నెల నుంచి గ్రామ పంచాయతీ, వార్డు, మండలo, మున్సిపాలిటీలో స్వర్ణాంధ్ర, స్వచ్ఛఆంధ్ర కార్యక్రమాన్ని పటిష్టంగా నిర్వహించాలి అని జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. శనివారం నాయుడుపేట లో ఏర్పాటుచేసిన స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా హీట్ ది బీట్ అనే థీమ్ తో జిల్లా కలెక్టర్ డా. ఎస్ వెంకటేశ్వర్ సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవెల విజయశ్రీ తో కలిసి పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతినెల మూడో శనివారం ప్రతి గ్రామపంచాయతీ, వార్డు, మండలం, మున్సిపాలిటీలో స్వర్ణాంధ్ర, స్వచ్ఛ ఆంధ్ర పటిష్టంగా అమలు చేయాలని తెలిపారు. ప్రతి నెల కూడా ఒక విభిన్నమైనటువంటి నినాదంతో మనం ముందుకు వెళ్తున్నాం అన్నారు. గడిచిన నాలుగు నెలల్లో మనము ఈ — చెత్త, ఇంటింటి చెత్త సేకరణ వంటి కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. మే నెలలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉందని బీట్ ద హీట్ అనే నినాదంతో ముందుకెళ్తున్నామన్నారు. ఏప్రిల్ నెల నుంచే ఎండలు ఎక్కువగా ఉన్నాయని చాలా ప్రదేశాలలో 42 డిగ్రీలలో ఉష్ణోగ్రత నమోదవుతుందని ఎవరూ ఎండ తీవ్రతకు ఇబ్బంది పడకుండా ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వయోవృద్ధులు కూడా ఎండ తీవ్రత వల్ల ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక జాగ్రత్తలు చేపడుతున్నామన్నారు. మొక్కలు నాటడం, చలివేంద్రాలు ఏర్పాటు చేయడం, పక్షులకి జంతువులకి ఉపాధి హామీ పథకం కింద నీటి తొట్టెలు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ఇంటింటికి వెళ్లి ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఇచ్చే ప్రక్రియ కూడా జరుగుతోందన్నారు. ప్రతి ఒక్కరూ ఇంటింటి చెత్త సేకరణ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని తెలిపారు. ప్రతి ఇంటి దగ్గర చెత్త సేకరణ చేయడం వలన చెత్త వేరు చేసే ప్రక్రియ సులభం అవుతుందని తెలిపారు. మున్సిపాలిటీలలో వేస్ట్ మేనేజ్మెంట్ కష్టతరంగా మారి చెత్తకుప్పలు పేరుకుపోయి ప్రజలు అనారోగ్య బారిన పడుతున్నారని చెత్త నిలువలు లేకుండా చూసుకోవాలని అన్నారు.
సూళ్లూరుపేట నియోజకవర్గం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ముఖ్యంగా నాయుడుపేట టౌన్ లో స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని కలెక్టర్ గారు హాజరవడం జరిగిందని తెలిపారు. సూళ్లూరుపేట నియోజకవర్గ ప్రజలలందరూ చుట్టుపక్కల ప్రదేశాలు పరిశుబ్రంగా ఉంచుకోవడం వలన ఎలాంటి ఆరోగ్య సమస్యలు దరిచేరవని తెలిపారు. స్వతహాగా జాగ్రత్తలు తీసుకోవడం వలన సూళ్లూరుపేట నియోజకవర్గం అంతా కూడా క్లీన్ గా ఉంటుందని ఈ స్వచ్ఛ కార్యక్రమాన్ని మన గౌ. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు ప్రతి మూడో శనివారం చేయమని మనందరికీ కూడా ఆదేశాలు ఇచ్చారని, ఇందులో భాగంగా స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగస్వామ్యం కావడం జరిగిందని తెలిపారు. ఈరోజు బీట్ ద హిట్ అనే నినాదంతో టౌన్ మొత్తం పరిశుభ్రంగా ఉంచుకుంటూ మొక్కలు నాటడం చలివేంద్రాలు ఏర్పాటు చేయడం, మునిసిపల్ పార్కులో ఈరోజు పక్షులకి చిరుధాన్యాలు, త్రాగునీటిని ఏర్పాటు చేశామని తెలిపారు. అలాగే నాయుడుపేట టౌన్ లో చాలా ప్రదేశాలలో చలివేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముందు జిల్లా కలెక్టర్ ఎమ్మెల్యే తో కలిసి పట్టణ సమీపంలోని గోమతి సెంటర్ వద్ద రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటారు. అనంతరం బీట్ ద హీట్ కార్యక్రమంలో భాగంగా గాంధీ మునిసిపల్ పార్కులో పక్షుల సంరక్షణ కోసం చిరుధాన్యాలు, త్రాగునీరు, చలువ పందిళ్ళు మజ్జిగ చలివేంద్రాన్ని ప్రారంభించి మజ్జిగ పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం, నాయుడు పేట మున్సిపల్ చైర్ పర్సన్ కటకం దీపిక, వైస్ చైర్మన్ షేక్ రఫీ, మున్సిపల్ కమిషనర్ ఫజులుల్లా, తాసిల్దార్ రాజేంద్ర, తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News