విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జూన్ మొదటి వారం నుండి ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో కౌలురైతులు పంటల పండించాలంటే నాణ్యత కలిగిన విత్తనాలు అందించాలని ఆంధ్రప్రదేశ్ కౌలురైతుల సంఘం రాష్ట్ర ,అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎ.కాటమయ్య, పి.జమలయ్యలు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ మేరకు నేడు ఒక పత్రిక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సాగు ప్రణాళికను ప్రకటించి సాగుకు అవసరమైన అన్ని రకాల పంటలకు సంబంధించిన నాణ్యత కల్గిన సర్టిఫైడ్ విత్తనాలను అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్ మార్కెట్లో విత్తనాల ధరలు విపరీతంగా పెంచేసుకుని కంపెనీలు లాభా గడుస్తున్నాయన్నారు.ప్రైవేటు కంపెనీలు అమ్మే విత్తనాలలో నాణ్యత ఉండటం లేదని గత ఖరీఫ్ సీజన్ లో అనేక జిల్లాల్లో వెలుగులోకి వచ్చాయని,నాసిరకం, కల్తీ విత్తనాలను రైతులకు అంటకట్టి మోసగిస్తున్నారన్నారు.వీటిని దృష్టిలో పెట్టుకొని వ్యవసాయశాఖాధికారులు విత్తన డీలర్స్ నిర్వహిస్తున్న ఏజెన్సీలను ప్రైవేట్ షాపులను తనిఖీలు నిర్వహించి నాసిరకం, కల్తీ విత్తనాలను అరికట్టాలని కోరారు. కల్తీ నాసిరకం విత్తనాలను ఉత్పత్తి చేసి రైతులకు అంటగట్టి మోసగిస్తున్న కంపెనీల,షాపుల యజమానులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే పీడియాక్టు ఉపయోగించి విత్తనాల కల్తీని అరికట్టాలని కోరారు.రాష్ట్రంలో ప్రతి ఏడాది 85.65 లక్షల ఎకరాల్లో పంటల సాగు చేస్తారని వ్యవసాయ శాఖ అంచనాలు వెసేదని ఈ సంవత్సరం ఇంతవరకు విత్తనాలను సన్నద్ధం చేయటంలో వ్యవసాయ శాఖ నిర్లక్ష్యంగా ఉందన్నారు. అంచనా వేసే పంటలలో వరి పంట 34.75లక్షలు, వేరుశనగ 14.80 లక్షల ఎకరాలు, పత్తి 14.67 లక్షల ఎకరాలు, కందులు 9లక్షల ఎకరాలు, మొక్కజొన్న,మినుములు, పెసలు తదితర పంటలు సాగు చేస్తారని రాష్ట్రప్రభుత్వం ముందస్తుగా అంచనా వేసి విత్తనాలు సిద్ధం చేసేవారు. కానీ ఇంతవరకు ఏపీ సీడ్స్ వారు విత్తనాలు తయారు చేయడంలో సిద్ధంగా లేదని, గతంలో ఏపీ సీడ్స్ కి సప్లై చేసిన కంపెనీలకు బకాయిలు ఉన్నాయని అందువల్లనే సప్లై దారులు ఎవరూ ఏపీ సీడ్స్ కు విత్తనాలు ఇవ్వటానికి ముందుకు రావడంలేదని అందువల్ల ఆలస్యం అవుతున్నదని సమాచారం తెలుస్తున్నది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి రైతాంగానికి అవసరమైన అన్ని రకాల పంటలకు సంబంధించిన సర్టిఫైడ్ చేసిన విత్తనాలను పూర్తి సబ్సిడీతో అందించాలన్నారు. బయట మార్కెట్లో విత్తన కంపెనీలు ధ్రువీకరించిన విత్తనాలను అమ్మే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, ట్రూత్ పుల్ సీడ్ పేరుతో విత్తనాలు అమ్ముతున్న కంపెనీలు వ్యవసాయ శాఖ వద్ద నమోదు చేయాలని, అనివార్య కారణాలవల్ల ట్రూత్ పుల్ సీడ్ వల్ల రైతాంగానికి నష్టం జరిగితే ఆ కంపెనీల నుంచి నష్టపరిహారం చెల్లించే విధంగా కఠిన చట్టాలను చేయాలని ఎ. కాటమయ్య, పి.జమలయ్యలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Tags vijayawada
Check Also
అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం
-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …
Prajavartha Online Telugu News