-తిరువూరులో నియోజకవర్గ స్థాయి మినీ మహానాడు
-టిడిపి జెండా ఆవిష్కరించిన నెట్టెం రఘురామ్, ఎంపి కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే కొలికపూడి, అబ్జర్వర్ సుఖవాసి శ్రీనివాస్
-ముఖ్యఅతిథిగా హాజరైన టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య
-తిరువూరులో లెదర్ పరిశ్రమ తీసుకువచ్చేందుకు కృషి
-జాతీయ అధ్యక్షుడుగా ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు కొనసాగాలని తీర్మానం
-టిడిపి కార్యకర్తలకు నెట్టం రఘురామ్, వర్ల రామయ్య క్రమశిక్షణ ఆదర్శం
తిరువూరు, నేటి పత్రిక ప్రజావార్త :
తెలుగుదేశం పార్టీలో జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో వున్న విద్య,ఐటీశాఖల మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో కోటి మంది సభ్యత్వాలు పార్టీలో నమోదు కావటం జరిగింది. దేశంలో ఏ ప్రాంతీయ పార్టీలో లేని విధంగా రికార్డ్ క్రియేట్ చేసిన యువ నాయకుడు లోకేష్ కి మహానాడు లో టిడిపి జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏ పదవి ఇచ్చినా ఆ పదవికే వన్నె తీసుకువస్తాడని విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ అన్నారు. యువనాయకుడు నారా లోకేష్ కి ఉన్నత పదవి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అలాగే తిరూవూరు నియోజకవర్గ అభివృద్ది కోసం ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తో కలిసి లెదర్ పరిశ్రమకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నట్లు ఎంపి కేశినేని శివనాథ్ తెలిపారు.
తిరువూరు నియోజకవర్గంలో నియోజకవర్గ స్థాయి మినీ మహానాడు కార్యక్రమం బుధవారం పట్టణంలోని శ్రీరస్తు ఫంక్షన్ హాల్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధులుగా టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య, జిల్లా పార్టీ అధ్యక్షుడు, కెడిసిసి బ్యాంక్ చైర్మన్ నెట్టం రఘురామ్, ఎంపి కేశినేని శివనాథ్ పాల్గొన్నారు. ముందుగా తెలుగుదేశం పార్టీ జెండాను ఎగరవేయటంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు. మిని మహానాడు కార్యక్రమానికి ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు సభాధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా ఎంపి కేశినేని శివనాథ్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన నాటి నుంచి వున్న నాయకులు ఈ నియోజకవర్గంలో వున్నారు. 43 ఏళ్లుగా పార్టీకి సేవ చేయటమే లక్ష్యంగా కృషి చేస్తున్నారు. పదువులు వచ్చిన రాకపోయినా పార్టీ బలోపేతం కోసం కష్టపడ్డారన్నారు. తిరుపూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ పాత తరం కొత్త తరం కలయిక అన్నారు. ఇటువంటి నాయకులు, కార్యకర్తలు వున్న తిరువూరు నియోజకవర్గం అబివృద్ది కోసం ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తో కలిసి తిరువూరు నియోజకవర్గాన్ని అభివృద్ది లో ముందు నిలబెట్టడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు.
43 ఏళ్ల క్రితం నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని బడుగు, బలహీన వర్గాలకు అండగా వుండాలనే ఆశయంతో స్థాపించటం జరిగిందన్నారు. పేద వాడికి కూడు, గుడ్డ, నీడ అనే నినాదంలో ప్రారంభమైన టిడిపి ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా భారత దేశ ప్రజలందరూ ఆదరించే పార్టీ గా తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దటంలో టిడిపి జాతీయ అధ్యక్షుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి మరువలేనిదన్నారు.
టిడిపి ఆవిర్భవించినప్పటి నుంచి దేశ రాజకీయల్లో కీలకపాత్ర పోషిస్తుందన్నారు. దేశ రాజకీయాలను ప్రభావితం చేసిన ప్రాంతీయ పార్టీ ఏదైన వుందంటే అది తెలుగుదేశం పార్టీ మాత్రమే అన్నారు. ఆనాడు 1989లో ఎన్టీఆర్ నేషనల్ ఫ్రంట్ ఏర్పాటు చేసిన విషయం గుర్తు చేశారు. నేడు ఎన్డీయే కూటమిలో బాగస్వాములుగా వున్నామన్నారు. ఆనాడు ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు దేశంలోని ఎన్నో రాష్ట్రాలు నేడు అమలు చేస్తున్నాయన్నారు. ఆనాడు చంద్రబాబు నాయుడు ప్రారంభించిన పనికి ఆహార పథకాన్ని ప్రస్తుతం దేశం మొత్తం ఆచరిస్తుందన్నారు. ప్రజలకు సంక్షేమం, అభివృద్ది అందించటంలో తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ముందు వుంటుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచనల్లో ఎప్పుడు 20 ఏళ్ల ముందు వుంటారని కొనియాడారు. కంప్యూటర్ దేశ ఆర్థిక పరిస్థితిని మార్చే స్థితికి వచ్చిందంటే చంద్రబాబు నాయుడు కృషే కారణమన్నారు. ఎపిలో ఆర్టిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ కంప్యూటింగ్ అభివృద్ది చేసేందుకు ముఖ్యమంత్రి కృషిచేస్తున్నట్లు తెలిపారు.
ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు విద్యావేత్త, ఉన్నతమైన ఆలోచన భావాలు గల నాయకుడంటూ కొనియాడారు. ఎమ్మెల్యే కొలికపూడి తన ఆవేశం కొంచెం తగ్గించుకుంటే పరిణితి గల నాయకుడవుతాడని సూచించారు.నియోజవర్గంలో అందర్నీ కలుపుకుంటూ ముందుకువెళుతున్నారన్నారు. అలాగే తిరువూరు నియోజకవర్గం అభివృద్ది కాంక్షిస్తూ టిడిపిలో చేరిన కౌన్సిలర్లను ఎంపి కేశినేని శివనాథ్ అభినందించారు.
పార్టీకి బలం బలగం కార్యకర్తలే అంటూ ఉత్సాహపర్చారు. పదవులు అందరి రాకపోవచ్చు…రాలేదని బాధపడకుండా పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలన్నారు.పదవులు రాని కార్యకర్తలు నాయకులు వర్ల రామయ్య, నెట్టెం రఘరామ్ లను ఆదర్శం తీసుకోవాలన్నారు. కొన్ని పరిస్థితుల కారణంగా తనకి పదవి ఆగిన కూడా క్రమశిక్షణ గల నాయకుడిగా వర్ల రామయ్య రోజు కష్టపడతున్నారని తెలిపారు. అలాగే మంత్రిగా చేసిన నెట్టెం రఘురామ్ కూడా పదవి ఆశించకుండా తనంతట తానుగా ఎమ్మెల్యే శ్రీరాంరాజగోపాల్ ను ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రతిపాదించాడు. వీరిద్దర్ని కార్యకర్తలు ఆదర్శం తీసుకోవాలన్నారు.తనకి ఎప్పుడు అండ దండగా వుంటూ సమయానికి తగిన సలహాలు ఇస్తూ నడిపిస్తున్న వర్ల రామయ్య, నెట్టెం రఘురామ్ కి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు సుఖవాసి శ్రీనివాస్ , తిరువూరు పట్టణ అధ్యక్షుడు బొమ్మసాని ఉమా మహేష్ ,గంపలగూడెం మండల పార్టీ అధ్యక్షుడు వీరారెడ్డి, జి.కొండూరు మండల పార్టీ అధ్యక్షుడు గడ్డి కృష్ణారెడ్డి, తిరువూరు మండలం పార్టీ అధ్యక్షుడు వెంకట నర్సిరెడ్డి , విసన్న పేట మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మట్టా వేణుగోపాల్, ఎన్టీఆర్ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు సొంగా సంజయ్ వర్మ, ఎ.ఎం.సి మాజీ చైర్మన్ అలవాల రమేష్ రెడ్డి, రాష్ట్ర హజ్ కమిటీ లో మెంబర్ , కౌన్సిలర్ షేక్ అబ్దుల్ హుస్సేన్, సీనియర్ మహిళ నాయకులు రామకోటమ్మ, మసీద్ కమిటీ చైర్మన్ మొహిద్దీన్, ఎన్.టి.ఆర్ జిల్లా తెలుగు యువత అధికార ప్రతినిధి మాదల హరికృష్ణ (కిట్టు) లతోపాటు టిడిపి శ్రేణులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News