Breaking News

తూర్పు నియోజకవర్గాన్ని టీడీపీ కంచుకోటగా మారటానికి గద్దె రామమోహన్‌ కృషే కారణం : ఎంపీ కేశినేని శివనాథ్

–తూర్పులో కన్నుల పండుగగా మిని మహానాడు
–హజరైన ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామమోహన్, స్వచ్ఛాంద్ర కార్పోరేషన్‌ ఛైర్మన్‌ పట్టాభి, నెట్టం రఘురామ్‌
–పసుపుమయంగా మారిన బెంజ్‌సర్కిల్‌ పరిసరాలు,
-జై ఎన్టీఆర్, జై తెలుగుదేశం నినాదాలతో మారుమోగ్రిన బెంజ్‌సర్కిల్‌ పరిసరాలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పు నియోజకవర్గాన్ని తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా మార్చిన ఘనత హ్యాట్రిక్‌ ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌దేనని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్‌ జిల్లా అధ్యక్షుడు నెట్టం రఘురామ్‌ అన్నారు.
తూర్పు నియోజకవర్గ మిని మహానాడు బుధవారం కన్నుల పండుగగా జరిగింది. నియోజకవర్గంలోని బెంజ్‌సర్కిల్‌ దగ్గర ఉన్న జ్యోతి కన్వెన్షన్‌ హాలు అంతా పసుపు మయంగా మారింది. బెంజ్‌సర్కిల్‌ ప్రాంతం బుధవారం మాత్రం పసుపు జెండాలు, జై ఎన్టీఆర్, జై చంద్రబాబు, జై తెలుగుదేశం నినాదాలతో మారుమ్రోగింది. మిని మహానాడు సందర్భంగా నిర్వహించిన సభకు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ అధ్యక్షత వహించారు.
ముఖ్య అతిధిగా విజయవాడ పార్లమెంట్‌ సభ్యుడు కేశినేని శివనాథ్‌ హజరై మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి తూర్పు నియోజకవర్గాన్ని కంచుకోటగా మార్చిన ఘనత ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌దేనని అన్నారు. నియోజకవర్గంలోని డివిజన్లలో ప్రతి రోజూ పర్యటిస్తూ పేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందచేయడమే కాకుండా తన సొంత నిధులతో పేదలకు ఆర్థిక సహాయాలను అందజేస్తున్న ఏకైక ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ అని అన్నారు. ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ చేస్తున్న సేవా, సహాయ కార్యక్రమాలను చూసి తాను కూడా స్ఫూర్తి పొందుతున్నానని ఎంపీ కేశినేని శివనాథ్‌ చెప్పారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హాయంలో టీడీపీ నాయకులు పట్టాభిరామ్, చెన్నుపాటి గాంధీలపై దాడితోపాటుగా కృష్ణలంకలో పార్టీ నాయకులపై కూడా వైఎస్సార్‌సీపీ నాయకులు దాడి చేశారన్నారు. ఆ సమయంలో కూడా పార్టీ శ్రేణులు ఎక్కడా తొందరపడకుండా చట్టప్రకారం వ్యవహారించారని చెప్పారు. నిన్న తిరువూరులో ఎన్నికల సందర్భంగా వైఎస్సార్‌సీపీ నాయకులు చేసిన దౌర్జన్యాలకు టీడీపీ కార్యకర్తలు గట్టిగా సమాధానం చెప్పారన్నారు. సంక్షేమాన్ని, అభివృద్థిని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సమంగా చేస్తున్నారని ఎంపీ కొనియాడారు. దేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా అత్యధికంగా ఫించను అందిస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ అని చెప్పారు. రాష్ట్ర అభివృద్థికి, సంక్షేమానికి కృషి చేస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడికి మనం అందరం మద్దతుగా ఉండాలన్నారు. యువ నాయకుడు నారా లోకేష్‌ సారధ్యంలో కోటి మందికిపైగా సభ్యత్వం కలిగిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీయేనని చెప్పారు.
తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హాయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు రోడ్లపై తిరగకుండా హౌస్‌ అరెస్ట్‌లు చేసి ఇబ్బందులు పెట్టారన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పెట్టిన ఇబ్బందులకు నారా చంద్రబాబునాయుడు ఏమాత్రం బెదరకుండా మనల్ని అందరిని ధైర్యంగా ముందుకు నడిపారని అన్నారు. జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్, బిజేపీ కూడా తెలుగుదేశం పార్టీతో కలిసి కూటమిగా పనిచేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు స్థానికంగా ఉన్న అంశాలను చర్చించుకుని తీర్మానాలు చేసి పార్టీని మరింతగా ముందుకు తీసుకువెళ్లేందుకు మహానాడు కార్యక్రమం దోహదం చేస్తోందన్నారు. కేశినేని శివనాథ్‌ను ఎంపీగా, ఎమ్మెల్యేగా తనను అత్యధిక మెజార్టీతో గెలిపించిన పార్టీ శ్రేణులకు ఎమెల్యే గద్దె రామమోహన్‌ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.
తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్‌ జిల్లా అధ్యక్షుడు నెట్టం రఘురామ్‌ మాట్లాడుతూ మహానాడు అంటే తెలుగుదేశం పండుగ అని అన్నారు. తెలుగుదేశం పార్టీ స్థాపించిన నాటి నుంచి ప్రతి ఏడాది క్రమం తప్పకుండా మహానాడును నిర్వహించుకుంటున్నామని చెప్పారు. ప్రజాస్వామ్య యుతమైన రాజకీయాల్లో అత్యంత దారుణమైన పాలనను గత ఐదు సంవత్సరాల వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో చూశామన్నారు.
స్వచ్చ ఆంధ్రప్రదేశ్‌ కార్పోరేషన్‌ ఛైర్మన్‌ కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ మాట్లాడుతూ ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ హ్యాట్రిక్‌ ఎమ్మెల్యే అని అన్నారు. నిత్యం ప్రజల మధ్యన ఉండే అతికొద్ది మంది ఎమ్మెల్యేల్లో గద్దె రామమోహన్‌ ఒకరు అని అన్నారు. ఆయన నిత్యం ప్రజల మధ్యనే ఉంటారు కాబట్టి ఆయనకు హ్యాట్రిక్‌ విజయాన్ని ప్రజలు అందించారన్నారు. న్యితం ఎవరో ఒకరికి సహాయం చేయనిదే ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ ఇంటికి వెళ్ళరని అన్నారు. అధికారంలో లేనప్పుడు వైఎస్సార్‌సీపీ నాయకులు ప్రజా సమస్యలపై స్పందిస్తే మంచిదని, అలా కాకుండా దౌర్జన్యాలు చేస్తామంటే ప్రభుత్వం చూస్తు ఊరుకోదని, చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటుందని అన్నారు.
ఈ కార్యక్రమములో రాష్ట్ర శాలివాహన, కుమ్మరి కార్పోరేషన్‌ ఛైర్మన్‌ పేరేపి ఈశ్వర్, మాజీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్‌బాబు, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు బొప్పన భవకుమార్, షేక్‌ ఫిరోజ్, గన్నె ప్రసాద్, చెన్నుపాటి గాంధీ, ఉడా మాజీ ఛైర్మన్‌ తూమాటి ప్రేమ్‌నాథ్, జిల్లా తెలుగు యువత అధ్యక్షుడు షేక్‌ నాగూర్, జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు చెన్నుపాటి ఉషారాణి, జిల్లా ఎస్సీ విభాగం అధ్యక్షుడు సొంగా సంజయ్‌వర్మ పాటుగా నియోజకవర్గం లోని పార్టీ డివిజన్‌ అధ్యక్షులు, కార్యదర్శులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, కార్యదర్శులు, అధిక సంఖ్యలో పార్టీ డివిజన్‌ నాయకులు, కార్యకర్తలు హజరయ్యారు. పార్టీ కోసం కృషి చేసి మరణించిన పార్టీ నాయకులు, కార్యకర్తలను నివాళులు అర్పించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *