Breaking News

జాయింట్ కలెక్టర్లు మరియు జిల్లా పౌర సరఫరాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి అయిన నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన, కమీషనర్, పౌర సరఫరాల శాఖ, ఆంధ్రప్రదేశ్ వారు రాష్ట్రంలోని అందరు జాయింట్ కలెక్టర్లు మరియు జిల్లా పౌర సరఫరాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఈ క్రింది తెల్పిన ముఖ్య సూచనలు జారీ చేసినారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం యం.డి.యూ. వాహనాల ద్వారా నిత్యావసర సరుకుల పంపిణీ నిలిపివేతకు నిర్ణయం తీసుకున్న మేరకు, జూన్ 1, 2025 నుండి నిత్యావసర సరుకుల పంపిణీ సంబంధిత చౌకధరల దుకాణముల వద్దనే జరుగును. 65 సంవత్సరములు పైబడిన లబ్దిదారులకు మరియు అంగవైకల్యం కల్గిన లబ్దిదారులకు మాత్రం ఇంటివద్దకే నిత్యావసర సరుకుల పంపిణీ చేయబడును. రేషన్ కార్డులు దాఖలు చేసే ప్రక్రియలో ప్రజలు ఎదుర్కొంటున్న సాంకేతిక సమస్యలను పరిష్కరించుటకు గాను కొంత వెసులుబాటును కల్గించబడును. ప్రభుత్వం వారు తీసుకున్న నిర్ణయం అత్యంత సున్నితమైనందున, లబ్దిదారులకు ఎటువంటి అసౌకర్యము కల్గకుండా నిత్యావసర సరుకుల పంపిణీ నిర్వహించవలెను. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టరేట్ లోని సంయుక్త కలెక్టర్ ఛాంబర్ నుండి జిల్లా ఇన్ చార్జి కలెక్టర్ ఏ. భార్గవ్ తేజ, జిల్లా పౌర సరఫరాల అధికారి కోమలి పద్మ , జిల్లా పౌర సరఫరాల సంస్థ జనరల్ మేనేజర్ లక్ష్మీ పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *