-కూటమి ప్రభుత్వం తో అన్ని రకాల దళితులు అభివృద్ధి.
-ఉమ్మడి చిత్తూరు జిల్లా లో ఎస్ సి లకు 2221 యూనిట్లు కు రూ.92 కోట్లు.
-రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ చైర్ పర్సన్ డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి
చిత్తూరు, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వంతోనే దళితులు అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతున్నారని రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ చైర్ పర్సన్ డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా పర్యటనలో భాగంగా సోమవారం సాయంత్రం స్థానిక ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయం నందు సాంఘిక సంక్షేమ మరియు సాధికారత అధికారి జి. చిన్నయ్య తో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వంతోనే దళితులు అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతున్నారని తెలిపారు. చిత్తూరు జిల్లాలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఋణాలు పొంది మాదిగ మాలలు రెండు కులాలు కూడా ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి చెందాలన్నారు. చిత్తూరు జిల్లాలో 954 యూనిట్లు,తిరుపతి జిల్లాలో 1267 యూనిట్లు, మొత్తం 2221 యూనిట్లు కు గాను రూ.92 కోట్లు కు విధులు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. చిత్తూరు జిల్లాలో ఎస్ సి కార్పొరేషన్ ద్వారా 117 షాప్స్ ఉన్నాయన్నారు. 2014- 2019 సంవత్సరం మధ్యకాలంలో రాష్ట్రంలో 7 500 లక్షల కోట్లు బడ్జెట్ ప్రవేశపెడితే అందులో 40 వేల కోట్లు దళితుల అభివృద్ధికి కేటాయించడం జరిగిందని తెలిపారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2015 – 2018 లో జిల్లాలో 242 కోట్లు తో 4 లక్షల మంది యువతకు వివిధ రకాలుగా ఉపాధి అవకాశాలు కల్పించడం జరిగిందన్నారు., సబ్ ప్లాన్ ద్వారా వివిధ రకాల అభివృద్ధి కార్యక్రమాలు జిల్లాలో చేపట్టడం జరిగిందని తెలిపారు. డ్రైవర్లుగా ఉన్న దళిత యువతను ఓనర్లు గా మార్చిన ఘనత కూడా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దక్కుతుందన్నారు.గతం లో నారా లోకేష్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఉన్న సమయం లో 4 వేల కిలోమీటర్ల పై సి సి రోడ్లు వేస్తే ఎక్కువ శాతం దళిత గ్రామాలలో సిసి రోడ్లు వేయడం జరిగిందని తెలిపారు.
డాక్టర్ బి.ఆర్ గారు అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచిన విదంగా ఎస్సీలు ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా అభివృద్ధి చెందాలని రాజ్యాంగంలో రిజర్వేషన్ కల్పించడం జరిగిందని దానికి అనుగుణంగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం దళితుల అభివృద్ధికి పని చేస్తుందన్నారు. దళితులు అన్నదమ్ములుగా ఉండాలన్న ఉద్దేశంతో జనాభా ప్రాతిపదన ఆధారంగా మాదిగలు మాలలు అభివృద్ధి చెందుటకు అవకాశం ఉంటుందన్న ఉద్దేశ్యంతో ఎస్సి విభజన జరిగిందని, విభజన తర్వాత మాదిగలు అందరూ కూడా సంతోషిస్తున్నారని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారు దళితుల కు అండగా ఉన్నారని,మాదిగలు,మాలలు కూటమి ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు వినియోగించుకొని ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా అభివృద్ధి చెందాలన్నారు.
2019 నుంచి 20 24 మధ్య ఐదు సంవత్సరాలలో వైసీపీ ప్రభుత్వం దళితుల అభివృద్ధికి ఎలాంటి కార్యక్రమాలు చేపట్టలేదని తెలిపారు. ఎస్సీ గ్రామాల్లో పర్యటించినప్పుడు గత ఐదు సంవత్సరాలలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఎలాంటి రుణాలు మంజూరు కాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ఈ సమావేశంలో ఎస్సి సంఘాల నాయకులు తదితరులు ఉన్నారు.
Prajavartha Online Telugu News