Breaking News

ఉపాధ్యాయులు వృత్తిపరమైన సామర్థ్యాలు పెంచుకోవాలి

-సమగ్ర శిక్షా ఎస్పీడీ బి.శ్రీనివాసరావు, IAS., 
-ముగిసిన రాష్ట్ర స్థాయి రిసోర్స్ పర్సన్స్ మూడు రోజుల పాటు శిక్షణా కార్యక్రమం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రతి ఉపాధ్యాయుడు వృత్తి పరమైన సామర్థ్యాలను పెంచుకోవాలని, తన వద్ద చదువుకునే పిల్లలను తన పిల్లలుగా భావించి వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేసేలా విద్య నేర్పాలని సమగ్ర శిక్షా ఎస్పీడీ బి.శ్రీనివాసరావు, IAS.,  అన్నారు.
కేఎల్ యూనివర్శిటీ(వడ్డేశ్వరం) వేదికగా పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో, రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (SCERT) , సమగ్ర శిక్షా సమన్వయంతో, రాష్ట్ర స్థాయి సబ్జెక్టు రిసోర్స్ పర్సన్స్ కు (State Resource Persons – SRPs) మూడురోజుల శిక్షణా కార్యక్రమం మే 26 న ప్రారంభమై బుధవారంతో ముగిసింది.
ఈ ముగింపు సభకు ముఖ్య అతిధిగా హాజరైన సమగ్ర శిక్ష రాష్ట్ర పథక సంచాలకులు బి. శ్రీనివాసరావు IAS., మాట్లాడుతూ జిల్లాస్థాయిలో జరిగే శిక్షణా కార్యక్రమాలను కూడా ఇదే స్పూర్తితో విజయవంతంగా నిర్వహించాలని కోరారు . రాష్ట్రంలో తీసుకువస్తున్న విద్యా సంస్కరణల పై ప్రధానంగా పాఠ్యపుస్తకాల అభివృద్ధి, విద్యా సంవత్సర క్యాలెండర్, విద్యార్థుల మూల్యాంకన విధానాలు, పాఠశాల క్లస్టర్ కాంప్లెక్స్ లు, హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డులు, ఉపాధ్యాయ హ్యాండ్‌బుక్, రాజ్యాంగ విలువలు, విలువల బోధన, లింగ సమానత్వం, డిజిటల్ విద్యా వనరులు, LEAP యాప్, TEACH టూల్, 6 వ తరగతి సంసిద్దత మెటీరియల్ మొదలైన అంశాలను, విద్యార్థుల అభివృద్ధికి చేపడుతున్న చర్యలను వివరించారు.
కార్యక్రమానికి అధ్యక్షత వహించిన SCERT డైరెక్టర్ ఎం. వెంకట కృష్ణారెడ్డి మాట్లాడుతూ శిక్షణలో పాల్గొన్న 416 మంది SRPలకు తరువాత జిల్లా స్థాయిలో ఉపాధ్యాయులకు నిర్వహించే శిక్షణా తరగతుల గురించి కార్యాచరణ ప్రణాలికను తెలియజేస్తామన్నారు. జాతీయ విద్యా విధానం – 2020 (NEP 2020) లక్ష్యాలను అందుకుంటూ, AP మోడల్ ఎడ్యుకేషన్ లో భాగంగా రాష్ట్రంలో అమలు జరుగుతున్న విద్యా సంస్కరణలపై వీరికి సమగ్ర శిక్షణ అందించామన్నారు. ఇది వచ్చే విద్యా సంవత్సరానికి రాష్ట్ర విద్యా వ్యవస్థను సిద్ధం చేయడంలో కీలకమైన భాగంగా నిలుస్తుందని తెలిపారు. కె .ఎల్. యూనివర్సిటీ డీన్ KRS ప్రసాద్, SCERT సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *