Breaking News

పంటల కనీస మద్దతు ధరలను కేంద్రం పున:సమీక్షించాలి

-పెట్టుబడికి అనుగుణంగా మద్దతు ధరలను పెంచాలి
-సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండ్‌

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కేంద్రం పంటలకు ప్రకటించిన కనీస మద్దతు ధరలపై పున:సమీక్ష జరపాలని, పంట పెట్టుబడి ఖర్చును పరిగణనలోకి తీసుకుని మద్దతు ధరలు పెంచాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండ్‌ చేశారు.
ఈ మేరకు కె.రామకృష్ణ నేడొక ప్రకటన విడుదల చేశారు. 2025`26 ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి వరితోసహా 14 పంటలకు కేంద్రం మద్దతు ధరలను ప్రకటించింది. అత్యధిక విస్తీర్ణంలో పండిరచే ధాన్యానికి కంటితుడుపు చర్యగా క్వింటాకు రూ.69లు మాత్రమే పెంచింది. మొక్కజొన్నకు రూ.175, కందులు రూ.450, మినుములు రూ.400, పెసలు రూ.86, వేరుశనగ రూ.480, పొద్దుతిరుగుడు రూ.441, పత్తి రూ.589 చొప్పున మద్దతు ధరలు పెంచింది. పెట్టుబడి ఖర్చులతో పోల్చుకుంటే ఈ కనీస మద్దతు ధరలు నామమాత్రమే. ఈ మద్దతు ధరల ప్రకటనబట్టి చూస్తే కేంద్ర ప్రభుత్వం మరోమారు రైతులకు అన్యాయం చేసినట్లు గోచరిస్తున్నది. ముఖ్యంగా ధాన్యం రైతులపట్ల కేంద్రం మరింత చిన్నచూపు ప్రదర్శిస్తోంది.
గత ఏడాది వరి ఒక ఎకరా సాగు ఖర్చు దాదాపు రూ.30 వేల వరకుకాగా, ఈ ఏడు విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, నూర్పిళ్లు, కూలీల వేతనాలు తదితరాలు పెరిగి ఎకరాకు రూ.40 వేలకుపైగా ఖర్చవ్వనుంది. ప్రధాన పంటలకు గత ఏడాదికంటే పంట ఉత్పత్తి ఖర్చులు 15% పెరిగాయి. గత సంవత్సరం ధాన్యానికి రూ.117లు పెంచగా, ఈ ఏడాది కేవలం రూ.69 మాత్రమే పెంచి కేంద్రం చేతులు దులుపుకుంది. ఇది రైతుల నెత్తిన గుదిబండ మోపడమే. పెరిగిన ఖర్చుల మేరకు కూడా మద్దతు ధరలు పెంచే పరిస్థితి లేకపోవడం విచారకరం.
కేంద్ర మంత్రివర్గ సమావేశం తదుపరి కేంద్రమంత్రి ప్రెస్‌మీట్‌లో డాక్టర్‌ స్వామినాథన్‌ కమీషన్‌ సిఫార్సులు అమలు చేస్తున్నట్లుగా, పంట ఉత్పత్తి ఖర్చుకు 50% కలిపి ఇస్తున్నట్లుగా అబద్ధపు ప్రకటనలు చేయడం రైతాంగాన్ని మోసగించడమే. పంట పెట్టుబడి విపరీతంగా పెరిగిపోతున్న తరుణంలో అరకొరగా మద్దతు ధర ప్రకటించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. తక్షణమే కనీస మద్దతు ధరలపై పున:సమీక్ష చేయాలని, రైతుల పంటల పెట్టుబడి ఖర్చును పరిగణనలోకి తీసుకుని మద్దతు ధరలను పెంచాలని డిమాండ్‌ చేస్తున్నామన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *