Breaking News

అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమంలో లో మీరు పాల్గొనవచ్చు

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జూన్ 21 2025 విశాఖపట్నంలో జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవం లో పాల్గొనవచ్చునని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. అందుకు ఇంటర్నేషనల్ యోగ డే సర్వేలో పాల్గొని ప్రజల సమతాన్ని తెలుపవలసిందిగా కోరారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ జూన్ 21, 2025న విశాఖపట్నంలో జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవం లో పాల్గొనడానికి ఆసక్తి ఉన్నవారు ఇంటర్నేషనల్ యోగ డే పార్టిసిపెంట్ సర్వేలో పాల్గొని వారు తమ సమతాన్ని తెలుపవచ్చు అని తెలిపారు. సచివాలయం సిబ్బంది తమ వద్దకు వచ్చినప్పుడు ఇంటర్నేషనల్ యోగ దినోత్సవం లో మీకు పాల్గొనేందుకు ఆసక్తి ఉందా లేదా అనే ప్రశ్నతో చేస్తున్న సర్వేలో ప్రజలు పాల్గొని, ఆసక్తి ఉన్నవారు తెలిపి అంతర్జాతీయ యోగా దినోత్సవం లో పాల్గొనే సదవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కమిషనర్ తెలిపారు. ప్రజల వద్దకు వచ్చిన సచివాలయం సిబ్బందికి ఓటీపీ తెలిపి వారు ఈ సర్వేలో సహకరించవలసిందిగా కోరారు. విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో గల 64 వార్డులలో ప్రతి వార్డులో యోగాంధ్ర కార్యక్రమాలను దిగ్విజయం చేసేందుకు ప్రజలు, సిబ్బంది పాల్గొని తమ ఆరోగ్యం పట్ల ముందడుగు వేస్తూ ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు యోగాన్ని చేస్తున్నారని తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *