Breaking News

యోగా సాధన అలవాటుగా మారాలి

-యోగా సాధన తో వివిధ రకాల సమస్యలకు పరిష్కారం
-స్థానిక హోమియో వైద్య కళాశాల లో 6వ రోజు యోగంధ్ర కార్యక్రమం
-జేసి. చిన్న రాముడు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
యోగా అభ్యాసం ఒక అలవాటుగా మార్చు కోవాలనీ జిల్లా జాయింట్ కలెక్టర్, యోగాంధ్ర నోడల్ అధికారి ఎస్. చిన్న రాముడు పేర్కొన్నారు.

స్థానిక ప్రభుత్వ హోమియోవైద్య కళాశాల ఆవరణలో శనివారం 6వ రోజు యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ఎస్. చిన్న రాముడు మాట్లాడుతూ, యోగాంధ్ర కార్యక్రమం ద్వారా యోగా సాధన పై ప్రజల్లో అవగాహన కల్పించడం జరుగుతోందని పేర్కొన్నారు. అందులో భాగంగానే సమాజంలోని వివిధ వర్గాలను భాగస్వామ్యం చేస్తూ వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో షెడ్యూల్ రూపొందించడం జరిగిందన్నారు. పర్యాటక ప్రాంతాల్లో యోగ సాధన లో భాగంగా గోదారి గట్టు ఒడ్డున ఉన్న సరస్వతి ఘాటు వద్ద ఆదివారం ఉదయం యోగ సాధన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. యోగా పై ప్రజల్లో చైతన్యం కలిగించే దిశగా ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా భాగస్వామ్యం కావాలని రాష్ట్ర ముఖ్యమంత్రి పిలుపు ఇవ్వడం జరిగిందన్నారు. రాష్ట్ర స్థాయి లక్ష్యాలను సాధించే దిశగా రాజమహేంద్రవరం నగర ప్రజలు, స్త్రీలు, విద్యార్థులు, వికలాంగులు,  వృద్ధులు అందరూ కలిసి యోగ సాధన కార్యక్రమంలో స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేయవలసిందిగా ఆయన పేర్కొన్నారు.

ఆదివారం జూన్ 1 వ తేదీ పర్యాటక ప్రాంతంలో యోగా సాధన
ఎంతో పవిత్రమైన గోదావరి నది ఒడ్డున ఉన్న సరస్వతి ఘాట్ తో పాటు గౌతమి ఘాట్ వద్దా 7వ రోజు యోగ సాధన కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు జేసి. చిన్న రాముడు తెలిపారు. పర్యాటక ప్రదేశాల యొక్క విశిష్టతలు చాటు కోవడానికి ఇదో మంచి అవకాశం అన్నారు.

ఈ కార్యక్రమంలో డీఆర్వో టి. సీతారామ మూర్తి , జిల్లా ఆయుర్వేద వైద్యులు /జిల్లా ఆయుష్ అధికారి డా కె. రమేష్, యోగాంధ్ర జిల్లా సమన్వకర్త పి. కాజియా, జిల్లా వ్యవసాయ అధికారి ఎస్ మాధవరావు, సుమారు 250 పై ప్రభుత్వ ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థలు , నగర ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *