Breaking News

ప్రపంచ పొగాకు వ్వతిరేక దినోత్సవం

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఈ రోజు ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ బాల కృష్ణ నాయక్  ఆధ్వర్యం లో వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం నుండి స్విమ్స్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించ బడినది. ఈసందర్భంగా వారు ప్రసంగిస్తూ పొగ త్రాగడం, గుట్కా సేవించడం ఆల్కహాల్ తీసుకోవడం వంటి దురలవాట్ల వలన ఊపిరి తిత్తులు దెబ్బ తినడం, కాన్సర్, మరియు హృదయ సంబంధిత వ్యాధులు సోకే ప్రమాద ముందన్నారు. అందు వలన పొగ తాగుడు వల్ల కలిగే ప్రమాద కరమైన ఆరోగ్య సమస్యల పై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. ముఖ్యంగా యువత సులభం గా చెడు అలవాట్లకు బానిసలవుతారని కనుక వారిలో పొగ త్రాగడం, గుట్కా నమలడం మరియు ఇతర దురలవాట్లను మానిపించేందుకు ప్రోత్సహించాలని తగ్గించేందుకు కృషి చేయాలని తెలిపారు.
“ఈ సంవత్సరం థీమ్:

“పొగాకు ఆకర్షణ వెనుకున్న నిజాన్ని బహిర్గతం చేయడం, పొగాకు మరియు నికోటిన్ ఉత్పత్తులపై పరిశ్రమ యొక్క అసత్య ప్రకటన లను బహిర్గతం చేయడం,” అనే ఈ నినాదాన్ని ప్రజల్లో తీసుకు వెళ్ళాలన్నారు. ఇది ముఖ్యంగా కొన్ని కంపెనీలు మరియు నికోటిన్ ఉత్పత్తుల తయారీదారులు నూతన తరాన్ని ఎలా ఆకర్షిస్తున్నారో, ఎలా తప్పుడు ప్రకటనల ద్వారా ప్రభావితం చేస్తారో వివరించబడుతుందని తెలిపారు.

( థీమ్ యొక్క ముఖ్య ఉద్దేశ్యాలు:

-పొగాకు వినియేగం పై పరిశ్రమ ఉపయోగించే మోసపూరిత ప్రణాళికలను బహిర్గతం చేయడం

-యువతను మరియు సామాన్యులను ఆరోగ్యకరమైన నిర్ణయాలు తీసుకునేలా అవగాహన కల్పించడం

-ప్రజారోగ్యాన్ని కాపాడేందుకు కఠినమైన నిబంధనలు అమలు చేయడం)
కఠినమైన నిబంధనలో భాగంగా మన తిరుపతి జిల్లా నందు
TOFEI – టబాకో ఫ్రీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్
COTPA – సిగరెట్ అధర్ టొబాకో ప్రొడక్ట్స్ యాక్ట్ 2003
DTCC – DISTRICT TOBACCO SESSION CENTRE ఉమ్మడి జిల్లా ప్రకారం TCC నందు 2024-2025 సంవత్సరం లో 2564 మంది పేషెంట్స్ కి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగిందని అందులో 2084 మందికి ఉచితంగా( నికోటిన్ పాచెస్ మరియు గమ్స్ ) మందులు ఇవ్వడం జరిగిందని 164 మంది అలవాటును మానుకొని రికవరీ అయిన పేషెంట్ స్ ఉన్నారని ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందని వైద్య ఆరోగ్య శాఖాది కారి తెలిపారు.
చివరగా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం ముందు మానవ హారం గా చేరి జిల్లా అధికారి
‘మనం అందరం కలిసికట్టుగా ఈ పరిశ్రమ అసత్య ప్రచారాన్ని తిరస్కరిద్దాం, యువతను రక్షించుకుందాం, ఆరోగ్యవంతమైన — పొగరహిత సమాజాన్ని నిర్మిద్దాం.’ అని అందరి చేత ప్రతిజ్ఞ చేయించారు.
ఈ కార్యక్రమం లో అదనపు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ శ్రీనివాసుల రెడ్డి, మెటర్నటి హాస్పిటల్ సూపరింటెండెంట్‌ డాక్టర్ పార్ధ సారధి రెడ్డి, డి పి ఎమ్ ఓ డాక్టర్ శ్రీనివాసరావ్, డిప్యూటి డి ఎమ్ హెచ్ ఓలు డాక్టర్ మృదుల వాణి, డాక్టర్ మురళి కృష్ణ, ఎన్ సిడి/ సిడి ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ రెడ్డి ప్రసాద్, డి ఐ ఓ ఇంచార్జ్ డాక్టర్ ఛత్ర ప్రకాష్ రెడ్డి, ఆరుణ ఎన్ టి సి పి సోషియల్ వర్కర్, కిరణ్ కుమార్, ఖాజా వలి డిప్యూటి డెమో లు, ఇతర అధికారులు పట్టణ ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు, ఏ ఎన్ ఎమ్ లు, ఆశ కార్యకర్తలు నర్సింగ్ స్టూడెంట్స్ పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *