Breaking News

బుధవారం అర్ధరాత్రి దొండగుంట-2 డీ-సిల్టేషన్ రీచ్ వద్ద డ్రెడ్జింగ్ బోట్ సీజ్

-ఏడీ మైన్స్ పణి భూషణ్ రెడ్డి

రాజమహేంద్రవరం / కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త :
బుధవారం సుమారు రాత్రి 11:30 కి రోజువారీ సాధారణ తనిఖీలో భాగంగా తూర్పు గోదావరి జిల్లా, కొవ్వూరు డివిజన్ లో గల డీ-సిల్టేషన్ ఇసుక రీచ్ లను తనిఖీ చేస్తుండగా, దొండగుంట-2 డీ-సిల్టేషన్ ఇసుక రీచ్ నందు ఇసుకతో కూడిన ఒక డ్రెడ్జింగ్ బోట్ నుండి పోక్లైన్ సహాయంతో ఇసుకను దించుతుండగా అధికారులు గుర్తించి, NGT నిభందనలు ఉల్లంఘిoచినందుకు డ్రెడ్జింగ్ బోట్ ను పట్టుకుని సీజ్ చేసినట్లు జిల్లా మైన్స్ అధికారి డి ఫణి భూషణ్ రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలియచేసారు. ఉల్లంఘనల నేపథ్యంలో తదుపరి చర్యలు నిమిత్తం ఇరిగేషన్ శాఖ వారికి అప్పగించడమైనది. తూర్పు గోదావరి జిల్లా పరిధిలో నిబంధనలకి విరుద్దంగా అక్రమ ఇసుక కార్యకలాపాల్లో ఇప్పటివరకు పాల్గొన్న 10 డ్రెడ్జింగ్ బొట్లను అధికారులు సీజ్ చేసారు. గోదావరి నది మీదుగా నిర్మించిన బ్రిడ్జ్ ల వద్ద నుండి 500 మీ పరిధిలో త్రవ్వకములు చేపట్టిన 24 బొట్లను అధికారులు సీజ్ చేసి, అక్రమ ఇసుక కార్యకలాపాలను అరికట్టే విధంగా చర్యలు చేపడుతున్నారు. సంయుక్త తనిఖీలో జిల్లా గనులు మరియు భూగర్బ శాఖ, రాజమహేంద్రవరం స్థానిక రెవెన్యూ , ఇరిగేషన్ శాఖల వారు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *