Breaking News

ప్రతి ఫిర్యాదును శాశ్వతంగా పరిష్కరించాలి…

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్ లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను అదనపు కమిషనర్ డాక్టర్ డి చంద్రశేఖర్ నిర్వహించారు. ప్రజలు తీసుకువచ్చిన ఫిర్యాదులను, శాఖధిపతులు స్వీకరించారు. ప్రతి ఫిర్యాదుదారులకు తమ స్వయంగా వచ్చి పరిశీలించి శాశ్వతమైన పరిష్కారాన్ని తీసుకొచ్చే విధంగా చూస్తామని తెలియపరిచారు. ఈ సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో 14 ఫిర్యాదులు ఉండగా అందులో పట్టణ ప్రణాళిక సంబంధించినవి 6, ఇంజనీరింగ్ 2 , రెవెన్యూ సంబంధించినవి 2, వైద్య & ఆరోగ్యం 3, ఎస్టేట్ 1 మొత్తం కలిపి 14 ఫిర్యాదులను అందుకున్నారు అధికారులు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ ప్రాజెక్ట్. డాక్టర్ డి చంద్రశేఖర్ తో పాటు చీఫ్ సిటీ ప్లానర్ సంజయ్ రత్నకుమార్, చీఫ్ ఇంజనీర్ ఆర్ శ్రీనాథ్ రెడ్డి, సూపరిండెంటింగ్ ఇంజనీర్ పి. సత్యకుమారి,పి సత్యనారాయణ, డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ మాల్యాద్రి, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ బి సోమశేఖర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *