రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
స్టాప్ డయేరియా కాంపెయిన్-2025 పోస్టర్ను కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ పి . ప్రశాంతి సోమవారం ఉదయం స్థానిక జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, జిల్లాలో జూన్ 6 నుంచి జూలై 31 వరకు స్టాప్ డయేరియా కాంపెయిన్-2025 ను నిర్వహిస్తున్నట్లు తెలియ జేసారు . 0-5 సంవత్సరముల లోపు పిల్లల్లో డయేరియా వల్ల సంభవించే మరణాలను పూర్తిగా అరికట్టడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం అన్నారు. అందులో భాగంగా జిల్లా లో 0-5 సంవత్సరముల లోపు పిల్లలు 1.28.495 మంది ఉన్నారనీ తెలిపారు. తల్లితండ్రులకు అవగాహన కల్పించడం కోసం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని ఆదేశించారు. ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు , సామాజిక ఆరోగ్య కేంద్రాలు , ఏరియా ఆసుపత్రులు , ప్రభుత్వ సామాన్య ఆసుపత్రులలో పట్టణ ఆరోగ్య కేంద్రాలు ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ , అంగన్వాడి కేంద్రాలు
ప్రైవేటు ఆసుపత్రులలో జింక్ & ఓఆర్ఎస్ కార్నర్ లు ఏర్పాటు చేసి డయేరియా చికిత్స అందించడం జరుగుతుందని తెలియ జేసారు . సమన్వయ శాఖల అధికారులతో సమావేశాలు నిర్వహించాలని, స్టాప్ డయేరియా కాంపెయిన్-2025 సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకొని వెళ్లడంలో కార్యాచరణ సిద్ధం చేయాలన్నారు.
గ్రామస్థాయి లో ANM & MLHP/CHO&AWW& ASHA లు ద్వారా 0-5 సంవత్సరముల పిల్లల ఉన్న ప్రతి ఇంటింటికి వెళ్లి ప్రతి పిల్ల వానికి రెండు ఓఆర్ఎస్ పాకెట్స్ & 14 జింక్ టాబ్లెట్స్ లు ఇవ్వడం జరుగుతుందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖా ధి కారి డా . కె వెంకటేశ్వర రావు తెలియ జేసారు . జిల్లా వ్యాప్తంగా 1589 ఓ ఆర్ ఎస్ & జింక్ కార్నర్స్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలియ జేసారు . ఈ కార్యక్రమం నిమిత్తం 514 బృందాలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలియ జేసారు . ఆరోగ్య సిబ్బంది ఇంటింటికి వెళ్ళినపుడు ఓఆర్ఎస్ ద్రావణం తయారు చేయడం , వాటి వలన కలిగే ఉపయోగాలు తెలియ జేయడం జరుగుతుందని తెలియ జేసారు . సురక్షిత మంచి నీరు ,తల్లి పాల ప్రాముఖ్యత , అనుబంద ఆహరం యొక్క ప్రాముఖ్యత ,పోషకాహారం , వ్యాధి నిరోధక టీకాలు ( రోటా వైరస్ వాక్సిన్ & మీజిల్స్ & రుబెల్లా వాక్సిన్ & విటమిన్ A, వ్యక్తి గత పరి శుభ్ర త గురించి కూడా అవగాహన కల్గించడం జరుగుతుందని తెలియ జేసారు .
ప్రతి గ్రామం లో శాని టేషన్ మరియు క్లోరి నేషన్ ల ఫై కుడా ప్రత్యెక శ్రద్ద వహించడం జరుగుతుందని తెలియ జేసారు .
పోస్టర్స్ & బ్యానర్స్ & కరపత్రముల ద్వార డయేరియా వ్యాది ఫై ప్రజలకు అవగాహన కల్గించడం జరుగుతుందని తెలియ జేసారు .
ఈ కార్యక్రమం లో జిల్లా ఇమ్మ్యూ నై జేషన్ అధికారి డా పి .కోమల , ప్రోగ్రాం అధికారులు డా షమ్మి కుమార్ , డా నిషాంత్ , సమన్వయ శాఖల అధికారులు తదితరులు అందరు పాల్గొన్నారు
Prajavartha Online Telugu News