Breaking News

జీవిత కారాగార శిక్ష పొందిన ఖైదీలకు ప్రత్యేక రిమిషన్…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన జి.ఓ. నెం.71, హోం (పరోల్స్ & హెచ్.ఆర్.సి) శాఖ, తేది: 17-04-2025 ప్రకారం, 2025 ఫిబ్రవరి 1వ తేదీ నాటికి అర్హత కలిగిన జీవిత కారాగార శిక్ష పొందిన ఖైదీలకు ప్రత్యేక రిమిషన్ (Special Remission) ఇస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినది. మరియు, ప్రభుత్వం జారీ చేసిన మరో ఉత్తర్వు జి.ఓ. నెం. 97, తేది: 18-06-2025 మేరకు, రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో శిక్ష అనుభవిస్తున్న ఇద్దరు ఖైదీలకు ప్రత్యేక రీమిషన్ ఇచ్చి, వారిని 18-06-2025 న విడుదల చేయడం జరిగింది.

వివరాలు:
ఖైదీ నం. 826 – కొనేటి సత్తిబాబు, S/o అప్పారావు

ఖైదీ నం. 2547 – గజ్జవరపు మురళీకృష్ణ @ మురళి @ కృష్ణ, S/o ప్రసాద్

ఈ ఇద్దరు ఖైదీలను విడుదల చేయడానికి ముందు, ప్రభుత్వం జారీ చేసిన జి.ఓ. నిబంధనలను వారికి వివరించడం జరిగింది. అలాగే వారు స్వయంగా వ్యక్తిగత బాండ్‌లు మరియు హామీలను నిబంధిత ప్రొఫార్మాలో సమర్పించిన తర్వాతే విడుదల చేయడం జరిగింది.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *