Breaking News

పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో ఈ నెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ఈ నెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జిల్లా స్థాయి యోగా కార్యక్రమం పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో జరుగుతుందని నగరపాలక సంస్థ కమిషనర్(ఇంచార్జి) చల్లా ఓబులేసు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ (ఇంచార్జి) మాట్లాడుతూ 21వ తేదీ ఉదయం 5:30 గంటలకు జరిగే జిల్లా స్థాయి యోగా కార్యక్రమంలో కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, జిల్లా కలెక్టర్ నాగలక్ష్మీ ఐఏఎస్, నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర, ఎంఎల్సీలు, ఎంఎల్ఏలు, ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారులు పాల్గొంటారని, నగర ప్రజలు, యోగా శిక్షకులు, సాధకులు, స్వచ్చంద సంస్థలు, స్టేక్ హోల్డర్స్ పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *