Breaking News

జిల్లాలో పర్యాటక రంగ అభివృద్ధి గురించి వివరిస్తున్న జిల్లా జాయింట్ కలెక్టర్ : శుభం బన్సల్

తిరుపతి,  నేటి పత్రిక ప్రజావార్త :
నేటి శుక్రవారం ఉదయం విజయవాడ లోని మురళి ఫార్చూన్ హోటల్ నందు జరిగిన జీఎఫ్ఎస్టీ టూరిజం కాంక్లేవ్‌లో తిరుపతి జిల్లా సంయుక్త కలెక్టర్ శుభం బన్సల్ పాల్గొని తిరుపతి జిల్లా పర్యాటక రంగం గురించి పి .పి. టి ద్వారా వివరిస్తూ .. గతేడాది తిరుపతి కి టూరిజంలో భాగంగా సుమారుగా 4 కోట్ల మంది విచ్చేయగా అందులో సుమారు 2.6 కోట్ల మంది తిరుమల దర్శనం చేసుకున్నారని తెలిపారు. సెంటిమెంట్ ఎనాలిసిస్ వ్యవస్థ ద్వారా పర్యాటకులు ఎక్కువగా సందర్శిస్తున్న ప్రదేశాలు, వారికి నచ్చిన విషయాలు, అలాగే అభివృద్ధి చేయాల్సిన అంశాలను గుర్తించామని అన్నారు.ఈ విశ్లేషణ ఆధారంగా పర్యాటక అనుభవాన్ని మరింత మెరుగుపరచేందుకు చర్యలు తీసుకుంటున్నామనీ అన్నారు. అంతేకాకుండా పర్యాటక రంగంలో తిరుపతి జిల్లా రాష్ట్రవ్యాప్తంగా ముందంజలో ఉందని మరింత అభివృద్ధి చెందుటకు తగినన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పర్యాటకులకు అధిక ప్రాధాన్యత కల్పించేందుకు కృషి చేస్తున్నామని ఈ సందర్భంగా తెలిపారు. జిల్లాలో పర్యాటక రంగాన్ని రాష్ట్రంలోనే కాకుండా దేశం లోనే ముందంజలో నిలిపేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు. అదనంగా, WhatsApp ఆధారిత సూచనలు, వర్చువల్ రియాలిటీ (VR), ఆల్టర్నేట్ రియాలిటీ (AR), AI వంటి సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన అనుభవాలను అందిస్తున్నామని మరియు ఇంటి వద్ద కూర్చొన్న వారు కూడా మన ప్రాంతీయ వారసత్వాన్ని ఈ విధంగా అనుభవించగలుగుతున్నారని తెలిపారు. పర్యాటకుల భద్రత కోసం అత్యవసర SOS ఫీచర్లను కూడా ప్రవేశపెడుతున్నామని అన్నారు. మన రాష్ట్రం భౌగోళికంగా గొప్ప సంపదను కలిగి ఉందని, ప్రాచీన దేవాలయాలు, కోటలు మరియు గౌ. ముఖ్యమంత్రి గారి మార్గదర్శనంలో ప్రారంభమైన కాలానుగుణ అభివృద్ధి కార్యక్రమాలు దీనికి నిలువెత్తు సాక్ష్యాలని, వీటిని నూతన సాంకేతికతతో సమర్పించేందుకు మేము సంకల్పబద్ధంగా పనిచేస్తున్నామని అన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *