గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
నగర శివారు ప్రాంతాల్లో మౌలిక వసతులు కల్పనే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ పరిధిలో 1.39 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు నిర్వహించడానికి శంకుస్తాపన చేయడం జరిగిందని నగర మేయర్ కోవేలమూడి రవీంద్ర తెలిపారు. శుక్రవారం గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని 20 మరియు 22 వ డివిజన్లలో వివిధ అభివృద్ధి పనులు చేయుటకు స్థానిక శాసన సభ్యులు గల్లా మాధవి తో కలిసి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, నగరంలోని శివారు ప్రాంతాలలో మౌలిక వసతులను కల్పించుటకు స్థానిక శాసన సభ్యులు కృషి చేస్తున్నారన్నారు. నగరంలోని అన్ని డివిజన్లలో కుల మత పార్టీలకతీతంగా వివిధ అభివృద్ధి పనులు నిర్వహిస్తున్నామన్నారు. నగరంలోని శివారు ప్రాంతాలలో చీకటి పడితే అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని పిర్యాదులు అందుతున్నాయని, వాటిని అరికట్టుటకు నిరంతరం నిఘా ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. గుంటూరు నగరాభివ్రుద్దికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా సహాయ సహకారాలు అందిస్తున్నారన్నారు. గుంటూరు నగరంతో పాటు నగరంలో విలీన గ్రామాల్లో కూడా అభివృద్ధి పనులు ప్రాధాన్యతా క్రమంలో నిర్వహించుటకు చర్యలు తీసుకున్నామన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక గుంటూరు నగరంలో అభివృద్ధి పనులు వేగవంతంగా నిర్వహిస్తున్నామని, స్థానిక ప్రజా ప్రతినిధుల ప్రతిపాదనల మేరకే అభివృద్ధి పనులు చేస్తున్నామన్నారు.
పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు గల్లా మాధవి మాట్లాడుతూ, గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని 20 మరియు 22 డివిజన్లో 1.39 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేయుటకు శంకుస్తాపన చేశామన్నారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా, వారి అవసరాలను దృష్టిలో ఉంచుకొని అభివృద్ధి పనులు చేస్తున్నామన్నారు. గుంటూరు నగరం రాజధాని అమరావతి పరిధిలో ఉన్నందున భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని పలు అభివృద్ధి పనులు చేస్తున్నామన్నారు. అలాగే పశ్చిమ నియోజకవర్గంలో పారిశుధ్యం పై కూడా ప్రత్యేక శ్రద్ధ చూపించి, రోడ్ల పై చెత్త పేరుకుపోకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని తెలియచేశారు. అలాగే పనులు చేస్తున్న గుత్తేదార్లు పనులను నిర్దేశిత సమయంలో నాణ్యతాప్రమానాలతో పూర్తి చేయాలన్నారు.
సదరు కార్యక్రమంలో కార్పోరేటర్లు గేదెల నాగరంగమణి, నిమ్మల వెంకట రమణ, ఇంజనీరింగ్ అధికారులు,సిబ్బంది, కూటమి నాయకులు, సచివాలయాల కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News