Breaking News

పెండింగ్ ప్రాజెక్టులను గాలికి వదిలేసిన చంద్రబాబు… : సిపిఐ కే రామకృష్ణ

-సెకి ఒప్పందాన్ని రద్దు చేయని కూటమి ప్రభుత్వం 

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త :
దాసరి భవన్లో ఈరోజు జరిగిన ఎన్టీఆర్ జిల్లా సిపిఐ జిల్లా కార్యవర్గ సమావేశంలో ముఖ్యఅతిథిగా హాజరైన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ప్రసంగిస్తూ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పూర్తిగా పెండింగ్ ప్రాజెక్టును గాలికి వదిలేసి గోదావరి బనకచర్ల పైన దృష్టి సారించిందని పోలవరాన్ని నిర్లక్ష్యం చేస్తుందని హంద్రీనీవా రాయలసీమలో ఉన్న అనేక పెండింగ్ ప్రాజెక్ట్స్ ప్రస్తావనే తీసుకురావడం లేదని ఇది చాలా దురదృష్టకరమని ఇప్పటికైనా ప్రభుత్వం వాస్తవాల పైన ఆధారపడి రాష్ట్రంలో జాతీయ హోదా ప్రాజెక్టు పొందిన పోలవరం ప్రాజెక్టు పైన దృష్టి సారించి రాష్ట్ర ప్రగతికి దోహదపడేలా చంద్రబాబునాయుడు ప్రభుత్వం కృషి చేయాలని అన్నారు ముఖ్యంగా రైతాంగం కు అనేక వాగ్దానాలు చేసి 20 వేల రూపాయలు సంవత్సరానికి ఇస్తామని చెప్పిన ప్రభుత్వం మాట తప్పిందని ఇప్పటివరకు రైతాంగానికి ఖరీఫ్ సీజన్ అయిపోవస్తున్నప్పటికీ ఏమాత్రం కూడా ఉపయోగకరంగా లేదని ధాన్యం ధరకు ఇప్పుడు వరకు రైతాంగానికి డబ్బు చెల్లించలేదని రాష్ట్రవ్యాప్తంగా రైతులు పెద్ద ఎత్తున ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నప్పటికీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి రైతాంగం గురించి ఆలోచన లేదని అన్నారు ఇప్పటికైనా రైతాంగం పట్ల ప్రభుత్వం సానుకూలత చూపనీయడల రైతులు ఉద్యమాలకు శ్రీకారం చుట్టాల్సి వస్తుందని హెచ్చరించారు ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లాలో ఆపరేషన్ బుడమేరు చేపట్టి తక్షణమే యుద్ధప్రాతిపదిక పైన నిధులు కేటాయించి వర్షాకాలం దృష్టిలో పెట్టుకుని గండ్లు పూడ్చి ఆక్రమణలు తొలగించి 160 కిలోమీటర్ల ప్రవాహ తీరాన్ని క్రమబద్ధీకరించి ఎనికేపాడు వద్ద గల అండర్ టన్నెల్ సామర్థ్యాన్ని పెంచి తక్షణమే చర్యలు తీసుకొని ఎడల మరోమారు బుడమేరు ప్రమాదం పొంచి ఉందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు పెండింగ్ ప్రాజెక్టుల పట్ల ఎన్టీఆర్ జిల్లాల్లో పార్టీ, రైతాంగం పెద్ద ఎత్తున ప్రాజెక్టుల సాధన కోసం ఉద్యమంచే పెట్టాలని విజ్ఞప్తి చేశారు అంతే కాకుండా విద్యుత్ ఛార్జీలు పెంపు పట్ల అసహనము వ్యక్తం చేశారు ఒకనాడు ప్రతిపక్షంలో ఉన్న పార్టీ ఈనాడు అధికారంలోకి వచ్చేటప్పటికి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వారు చేసిన ఉద్యమాల పరిస్థితి మరిచిపోయారని ఈ రోజున సఖి ఒప్పందాన్ని రద్దు చేయకుండా కార్పొరేట్లకు అదాని అంబానీలకు అడుగులకు మడుగులోత్తే కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉన్నచంద్రబాబు నాయుడు పునర్ ఆలోచించాలని తక్షణమే సెకి ఒప్పందాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రద్దు చేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు రానున్న పార్టీ మహాసభల దృష్టిలో పెట్టుకుని జిల్లా రాష్ట్ర జాతీయ మహాసభలు జయప్రదానికి కొనుకోవాలని ఒంగోలులో జరుగుతున్న ఆగస్టు నెలలో 23 24 25వ తేదీలలో జరుగుతున్న రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయటానికి ప్రతి ఒక్క పార్టీ కార్యకర్త నాయకత్వం కంకణదారులు కావాలని 100 సంవత్సరాల చరిత్ర కలిగిన కమ్యూనిస్టు పార్టీ ఆ వైపుగా మహాసభలు జయప్రదం చేసుకోవాలని మహాసభల జయప్రదానికి ప్రజల్ని కలవడం ద్వారా పార్టీల ముందు తీసుకుపోవాలని కోరారు
ఎన్టీఆర్ జిల్లా సిపిఐ కార్యదర్శి దోనేపూడి శంకర్ ప్రసంగిస్తూ ఎన్టీఆర్ జిల్లాలో పార్టీ కార్యకలాపాలు చురుకుగా సాగుతున్నాయని ఏ కొండూరు కిడ్నీ బాధితులకు సిపిఐ పోరాట ఫలితంగా అతి త్వరలోనే కృష్ణాజిల్లాల సరఫరా పైపులైన్ల ద్వారా నిర్మాణం పూర్తిగా వచ్చిందని మరియు అల్ట్రాటెక్ సిమెంట్ కార్మికులకు ప్రమాదంలో గాయపడి మరణించిన కార్మికులకు ఈనాటి వరకు కంపెనీ వారిచ్చి నష్టపరిహారం తప్పనిచ్చి ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా బాధితులకు అందలేదని చాలా దురదృష్టకరమని అంతే కాకుండా పరిటాల క్వారీలో మృతి చెందిన నలుగురికి కూడా ప్రభుత్వపరంగా ఎటువంటి సహాయం అందలేదని సిపిఐ పోరాట ఫలితంగా లేబర్ డిపార్ట్మెంట్ ద్వారా మాత్రమే సహాయం అందిందని ఎంతమంది మంత్రులు ఎమ్మెల్యేలు పార్లమెంటు సభ్యులు ఉన్నప్పటికీ ఒక్క రూపాయి కూడా చనిపోయిన కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించలేదని అన్నారు ఆపరేషన్ బుడమేరుకు సంబంధించి ఎన్టీఆర్ జిల్లాలో కృష్ణాజిల్లాలో ఏలూరు జిల్లాలో గత వరదల్లో పడిన గండ్లు ఈనాటికీ పూడ్చ లేదని వేల్పూరు వద్ద మరియు కేసరపల్లి తెన్నేరు చట్టా కూలిపోయినప్పటికీ ఈనాటికి నిర్మించలేదని వెలగలేరు రెగ్యులేటర్ వద్ద అరకురగా పనులు సాగుతున్నాయని లాకులు రిపేర్ చేస్తున్నారని ఇంకా పూర్తి కాలేదని కొండపల్లి వద్ద కేవలం ఒక గండి దగ్గర మాత్రమే గైడ్వాల్ నిర్మాణం చేస్తున్నారని ఇది బుడమేరు వరదను నిర్వహించలేదని వెలగలేరు రెగ్యులేటర్ దిగు భాగాన విజయవాడ వరకు ఉన్నటువంటి ఆక్రమణలను తొలగించాల్సిన అవసరం ఉందని విజయవాడ నగరంలో 3501 ఆక్రమణలు ఉన్నాయని ప్రభుత్వ సర్వే ని ప్రకటించిందని ఈనాటి వరకు ఇరిగేషన్ శాఖ ప్రభుత్వంగానే ఎటువంటి చర్యలు చేపట్టలేదని ఆక్రమణలు తొలగించని యెడల విజయవాడ నగరం మరో ప్రమాదం ఉందని తక్షణమే బుడమేరు ముంపు నివారణకు ఆపరేషన్ ప్రత్యామ్నాయం చూపి 1500 కోట్ల రూపాయలు యుద్ధ ప్రాతిపదిక పైన కేటాయించి బుడమేరుని ఆధునికరించాలని అలాగే ఐదో తేదీన ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా అన్ని మండల నియోజకవర్గ కేంద్రాల్లో సఖీ ఒప్పందానికి వ్యతిరేకంగా స్మార్ట్ మీటర్ల బిగింపుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసన ధర్నాలు చేపట్టి స్మార్ట్ మీటర్లను ధ్వంసం చేయాలని సిపిఐ రాష్ట్ర సమితి తెలిపిన జయప్రదం చేయాలని కోరారు ఎన్టీఆర్ జిల్లా మహాసభలు ఆగస్టు ఒకటి రెండో తేదీలలో జగ్గయ్యపేట పట్టణంలో జరుగుతున్నాయని వాటి జయప్రదానికి జిల్లా పార్టీ యావత్తు కృషి చేయాలని శంకర్ కార్యవర్గంలో కోరారు ఈ సమావేశానికి సిపిఐ జిల్లా రైతు సంఘం నాయకులు చుండూరు సుబ్బారావు అధ్యక్ష వహించారు వేదికపై రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షులు సిహెచ్ కోటేశ్వరరావు రాష్ట్ర మహిళా సమాఖ్య కార్యదర్శి పి దుర్గా భవాని విజయవాడ నగర పార్టీ కార్యదర్శి జి కోటేశ్వరరావు ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పరుచూరి రాజేంద్ర ఆసీనులయ్యారు పై నాయకులు ప్రసంగిస్తూ జగ్గయ్యపేటలో జరుగుతున్న జిల్లా మహాసభల జయప్రదానికి ప్రతి ఒక్క కార్యవర్గ సభ్యులు బాధ్యత వహించి కృషి చేయాలని పారిశ్రామిక కేంద్రంగా ఉన్న జగ్గయ్యపేట పట్టణంలో పార్టీ వ్యాప్తికి మహాసభ దోహదపడాలని కార్మిక సంఘాల తోడ్పాటుతో మహాసభ జయప్రదానికి అందరం కృషి చేయాలని కోరారు ఈ సమావేశంలో జిల్లా పార్టీ సహాయ కార్యదర్శి బుడ్డి రమేష్ విజయవాడ నగర పార్టీ సహాయ కార్యదర్శిలు లంక దుర్గారావు నక్క వీరభద్రరావు మహిళా సమాఖ్య విజయవాడ నగర కార్యదర్శి పంచదారల దుర్గాంబ జిల్లా యువజన సమాఖ్య ఆర్గనైజింగ్ కార్యదర్శి లంకా గోవిందరాజులు జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం కార్యదర్శి చిలుకూరి వెంకటేశ్వర్లు జిల్లా రైతు సంఘం కార్యదర్శి మల్నీడు యల్లమందారావ్ తిరువూరు నియోజకవర్గ పార్టీ కార్యదర్శి షేక్ నాగుల మీరా జగ్గయ్యపేట నియోజకవర్గ కార్యదర్శి అంబాజీ శివాజీ జిల్లా సిపిఐ కార్యవర్గ సభ్యులు బుట్టిరాయప్ప తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *