Breaking News

AGILE అజైల్ ప్లాట్‌ఫామ్‌ను సమర్థవంతంగా వినియోగించాలి…

-బుడితి రాజశేఖర్, ఐ.ఏ.ఎస్.ప్రత్యేక కార్యదర్శి వ్యవసాయ & సహకారం

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ అభివృద్ధిలో మరో కీలకమైన ముందడుగు వేసింది. AGILE (Agriculture Input License Engine) యాప్‌ను బుడితి రాజశేఖర్, ఐ.ఏ.ఎస్. ప్రత్యేక ముఖ్య కార్యదర్శి (వ్యవసాయ శాఖ), ఈరోజు సచివాలయంలో అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన రాజశేఖర్, విత్తనాలు ఎరువులు, పురుగుమందులు వంటి వ్యవసాయ వనరుల లైసెన్సింగ్ వ్యాపారానికి సంబంధించిన అన్ని భాగస్వాములు AGILE ప్లాట్‌ఫామ్‌ను తప్పనిసరిగా అనుసరించి, సక్రమంగా వినియోగించాలంటూ తెలిపారు. ఇది ఒక నవీకరించబడిన, అభివృద్ధి చెందిన, కేంద్రీకృత డిజిటల్ ఇన్‌పుట్ మేనేజ్‌మెంట్ సిస్టం అని పేర్కొన్నారు.

AGILE ప్లాట్‌ఫామ్ విశేషాలు:
ఎస్. డిల్లీ రావు, ఐ.ఏ.ఎస్., వ్యవసాయ సంచాలకులు మాట్లాడుతూ, AGILE అనేది కొత్త తరం సంపూర్ణ లైసెన్సింగ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ అని తెలిపారు. ఇది కాగిత రహిత, పారదర్శక, ప్రామాణికమైన వ్యవస్థగా పనిచేస్తుందని వివరించారు.

AGILE ముఖ్యాంశాలు:
#) రియల్ టైమ్ మానిటరింగ్ డాష్‌బోర్డ్:
అధికారులు, పాలకులు లైసెన్సింగ్ స్థితిని ప్రత్యక్షంగా గమనించగల సౌకర్యం.

#) ఆధునిక నివేదికలు, విశ్లేషణలు:
ప్రణాళికలు, పాలనా పర్యవేక్షణ, పథకాల సమీక్షకు అనుకూలంగా వివరణాత్మక నివేదికలు.

#) సప్లై చైన్ మేనేజ్‌మెంట్:
ఇన్‌పుట్ పంపిణీపై ప్రత్యక్ష నిఘా, తయారీదారులు, డీలర్లు, రిటైలర్ల మధ్య సమన్వయం.

#) ఇ-గవర్నెన్స్ ఇంటిగ్రేషన్:
ఆధార్ ఆధారిత ప్రమాణీకరణ, ఎస్ఎంఎస్/ఇమెయిల్ సమాచారం, డిజిలాకర్, పేమెంట్ గేట్‌వేలు, డీలర్ నెట్‌వర్క్‌కు GIS మ్యాపింగ్.

#) వినియోగదారులకు అనుకూలమైన ఆన్‌లైన్ పోర్టల్‌లు:
రైతులు, డీలర్లు, సంస్థలు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుని, తమ లైసెన్సుల స్థితిని తెలుసుకునే సౌలభ్యం ఈ విధానం ద్వారా అందుబాటులో ఉంటుందని తెలిపారు .

కె. శ్రీనివాసులు, ఐ.ఏ.ఎస్., ఉద్యాన సంచాలకులు, టి. విజయకుమార్, ఐ.ఏ.ఎస్. (రిటైర్డ్), కార్యనిర్వాహక ఉపాధ్యక్షులు, రైతు సాధికార సంస్థ, డా. కె. గోపాల్, వైస్ ఛాన్సలర్, ఉద్యాన విశ్వవిద్యాలయం, డా. శారద జయలక్ష్మి, వైస్ ఛాన్సలర్, ఏఎన్‌జీఆర్‌ఏయూ రంగా విశ్వవిద్యాలయం, పలు శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కార్యక్రమ సమన్వయకర్తలుగా జేడీఏలు వి.డి.వి. కృపాదాస్, విజయభారతి, బాలసుబ్రహ్మణ్యం, డీఏఓ విజయకుమారి, ఏడీఏ ప్రేం శేఖర్ వ్యవహరించారు.

మహిళా డీలర్‌కు తొలి డిజిటల్ లైసెన్స్
కార్యక్రమ ముగింపు సందర్భంగా బుడితి రాజశేఖర్, స్పెషల్ సీఎస్, తొలి డిజిటల్ ఎరువుల తయారీ లైసెన్సును పలు జిల్లాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న మహిళా డీలర్ శ్రీ ఆధ్య అగ్రో కెమికల్స్, నాదెండ్ల మండలం, పల్నాడు జిల్లా సంస్థకు మంజూరు చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *