-సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో కూడేరు మండలం జయపురం గ్రామంలో పాల్గొని ఇంటింటి గృహ సందర్శన చేసి ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరించి వారి సమస్యలను సావధానంగా వింటూ సంబంధిత అధికారులకు పరిష్కారానికి ఆదేశాలు ఇచ్చిన ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్
అనంతపురము జిల్లా, కూడేరు, నేటి పత్రిక ప్రజావార్త :
కూటమి ప్రభుత్వం ఎంతో బాధ్యతతో ప్రజలకు సేవ చేస్తున్నామని, “సుపరిపాలనలో తొలి అడుగు” కార్యక్రమానికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని రాష్ట్ర ఆర్థిక & ప్రణాళిక, వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వము ఏర్పడి సంవత్సరం పూర్తయిన సందర్భంగా “సుపరిపాలనలో తొలి అడుగు” అనే కార్యక్రమంలో భాగంగా ప్రజా ప్రతినిధులు, అధికారులతో కలిసి రాష్ట్ర ఆర్థిక & ప్రణాళిక, వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ బుధవారం ఉరవకొండ నియోజకవర్గం, కూడేరు మండలం, జయపురం గ్రామంలో పాల్గొని ఇంటింటినీ సందర్శించి వారితో ఆప్యాయంగా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న పలు సంక్షేమ, అభివృద్ది కార్యక్రమాలు వివరించి వారికి ప్రభుత్వం నుండి అందుతున్న లబ్ది వివరాలను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలోని పలువురు ప్రజలు కూటమి ప్రభుత్వం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారని, ఇది బాధ్యత కలిగిన మంచి ప్రభుత్వం అని మంత్రికి తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తయిన సందర్భంగా సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమానికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు. సుపరిపాలన తొలి అడుగు పేరుతో ప్రతి పల్లెలోనూ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రతి పల్లెల్లో తిరుగుతుంటే అద్భుతమైన స్పందన ప్రజల నుండి వస్తోందని ఎక్కడికి వెళ్లినా కూడా ప్రజలు ఇది మా ప్రభుత్వం సుపరిపాలన అందించే మంచి ప్రభుత్వము వారి ఆశలు, ఆకాంక్షలు తీర్చే ప్రభుత్వమని ప్రజలు సంతోషంగా చెప్పుతున్నారని తెలిపారు. గతంలో అరాచక పాలన ప్రభుత్వం ఉన్నదని, ప్రజలను భయభ్రాంతులను గురి చేశారని తెలిపారు. సంక్షేమం అంటే అన్ని పథకాలు ఆపేసి నాలుగు పథకాలు అమలు చేయడం కాదు, సంక్షేమం ఇస్తూ అన్ని పథకాలు అమలు చేయడం నాయకుని లక్ష్యమని,రూ .3 వేలు ఇస్తున్న పెన్షన్ పెద్ద ఎత్తున రూ.4 వేలకు పెంచి పెన్షన్ ఇవ్వడం జరుగుతోందన్నారు. గత ప్రభుత్వం 45 లక్షల మందికి అమ్మఒడి వేస్తే ప్రస్తుత కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పేరుతో 67 లక్షల మంది పిల్లలకు రూ.10 వేల కోట్లు ఇవ్వడం జరిగింది. దీపం పథకం, అన్నా క్యాంటీన్లు ప్రారంభించాము. జిల్లాకు సంబంధించి హంద్రీనీవా కాలువని వెడల్పు చేస్తున్నాము, డిస్ట్రిబ్యూటర్ల పనులు ప్రారంభించేలా ఆదేశాలు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. తాము బాధ్యతతో ప్రజల కోసం పని చేస్తున్నామనీ, ఇంకా చేయలసింది ఎంతో ఉందనీ, జిల్లాకి రుణం తీర్చుకొనునుటకు పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు మంత్రులు అందరం బాధ్యతతో పని చేస్తున్నామనీ తెలిపారు. గత 5 సంవత్సరాలు జిల్లా ప్రగతి గురించి మాట్లాడని నాయకులు, సంఘాలు నేడు అవాకులు, చవాకులు మాట్లాడుతున్నారని అన్నారు.
జయపురం గ్రామానికి సుపరిపాలనతో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొనటానికి చేరుకున్న మంత్రికి గ్రామస్థులు ఘన స్వాగతం పలికారు. మంత్రి ఇంటి ఇంటికి వెళ్లి కూటమి ప్రభుత్వము అందజేస్తున్న సంక్షేమ పథకాలు సక్రమంగా అందుతున్నాయా అని, ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయా అని ప్రజలను అడిగి తెలుసుకొని, వారు చెప్పే సమస్యలు వింటూ వారు అందజేసిన సమస్యల అర్జీలను తీసుకోవడం జరిగింది.జయపురం గ్రామానికి చెందిన ఎస్.బేబీ,ప్రభుత్వ పాఠశాలలో 8 వ తరగతి చదువుతుంది,ఇటీవల రోడ్డు ప్రమాదంలో కాలికి తగిలిన గాయానికి సుమారు రూ.2 లక్షల ఖర్చులు అయిందని మంత్రికి తెలపగా బాధపడుతున్న బేబీని మంత్రి పరామర్శించి మెడికల్ బిల్స్ అన్నియు అందజేయాలని, ప్రభుత్వము నుండి ఆర్థిక సహాయం అందజేయడం జరుగుతుందని మంత్రి వారికి హామీ ఇచ్చారు. ఇంకా ఏమైనా సస్యలు ఉన్నాయని అడిగి తెలుసుకొని బేబీ తల్లిగారైన ఎస్.కవిత కు వితంతు పింఛన్ ను మంత్రి అందజేశారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో జయపురం గ్రామంలోని 55 మందికి రైతులకు 105 రకం కందులను మంత్రి రైతులకు ఉచితంగా పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ రమాదేవి, లలితమ్మ, జిల్లా, మండల స్థాయి అధికారులు, పలువురు ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు,కార్యకర్తలు గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News