
-పాపులర్ షూ మార్ట్ ఎండి చుక్కపల్లి అరుణ్ కుమార్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జాతీయస్థాయి బాక్సింగ్ పోటీలో లక్ష్యంగా ముందుకు సాగాలని పాపులర్ షూ మార్ట్ ఎండి చుక్కపల్లి అరుణ్ కుమార్ తెలిపారు. ఈనెల 12 13 తేదీలలో విశాఖపట్నంలో జరగనున్న రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ బాక్సింగ్ పోటీలలో జిల్లా క్రీడాకారులు పథకాలు సాధించాలని చెప్పారు. ఉమ్మడి కృష్ణాజిల్లా బాక్సింగ్ ఆధ్వర్యంలో మున్సిపల్ స్టేడియంలో బుధవారం నిర్వహించిన సబ్ జూనియర్ బాక్సింగ్ సెలక్షన్స్ కు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రస్థాయి పోటీలకు జిల్లా తరఫున ఎంపికైన క్రీడాకారులను అభినందించి వారికి స్పోర్ట్స్ కిట్ ను అందజేశారు. ఈ సెలక్షన్స్ ఉమ్మడి కృష్ణా జిల్లాల బాక్సింగ్ అసోసియేషన్ అధ్యక్షులు ఉమ్మడి వీర రాఘవులు, కార్యదర్శి కే.వి చైతన్యకుమార్, కోశాధికారి బి బాలాజీ, కార్య నిర్వాహక కార్యదర్శి బి. రాజా రమేష్, అసోసియేషన్ బాక్సింగ్ కోచ్ లు హేమంత్ రెడ్డి సాయి ఆధ్వర్యంలో నిర్వహించినట్లు తెలిపారు.
బాలుర జట్టు : జ్యోతి శివ స్మరణ్ (నారాయణ స్కూల్), జాన్ (రవీంద్ర భారతి పబ్లిక్ స్కూల్), సందీప్ సాగర్ (విజయ్ బ్రిలియంట్ హై స్కూల్), సూర్య ప్రణవ్ (శ్రీ చైతన్య స్కూల్), కార్తీక్ (ఉషోదయ హై స్కూల్), చైతన్య (ఎన్ ఎస్ ఎం హై స్కూల్), జీవన్ కుమార్(మౌంట్ కర్మెల్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్, పాయకపురం).
బాలికల జట్టు : కె.కార్తిక (బిషప్ హాజరయ్య హై స్కూల్), హేమ శ్రీ (ఎమ్ ఎస్ ఆర్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్).
Prajavartha Online Telugu News