Breaking News

పారిశుధ్య నిర్వహణలో ప్రజలకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తుండాలి

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలు

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పారిశుధ్య నిర్వహణలో ప్రజలకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తుండాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. సోమవారం ఉదయం తన పర్యటనలో భాగంగా బందర్ రోడ్డు, బెంజ్ సర్కిల్ నేషనల్ హైవే సర్వీస్ రోడ్, డెంటల్ కాలేజ్ రోడ్డు, ఈఎస్ఐ రోడ్, భగత్ సింగ్ రోడ్, సివిఆర్ ఫ్లైఓవర్, బిఆర్టిఎస్ రోడ్, నూజివీడు రోడ్, గణపతి రావు రోడ్, పిన్నమనేని పాలీ క్లినిక్ రోడ్, పంజా సెంటర్, గులాబీ తోట అన్న కాంటీన్ ప్రాంతాలని పర్యటించి క్షేత్రస్థాయిలో పారిశుద్ధ్య నిర్వహణ పరిశీలించారు.

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పారిశుధ్య నిర్వహణలో ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అధికారులు అప్రమత్తంగా ఉంటూ పెద్ద నిర్వహణలో ఎటువంటి సమస్యలు తెరత్తకుండా చూసుకోవాలని అన్నారు. సైడ్ డ్రైనలలో వ్యర్ధాలు పేరుకోకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు, టౌన్ ప్లానింగ్ సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ ఎప్పటికప్పుడు అనధికార ఫ్లెక్సీలు తొలగించాలని, నిర్మాణ వ్యర్ధాలను రోడ్డుపైన ఉంచకుండా ఎప్పటికప్పుడు తొలగించాలని ఆదేశించారు.

గులాబీ తోట అన్న క్యాంటీన్ పరిశీలించి, ఎటువంటి లోటుబాట్లు లేకుండా ఎప్పటికప్పుడు మరమ్మత్తులు చేసుకుంటూ ఎటువంటి ఇబ్బందులు ప్రజలకు తలెత్తకుండా అధికారులు అప్రమత్తంగా ఉంటూ పర్యవేక్షిస్తుండాలని అధికారులను ఆదేశించారు. పిన్నమనేని పాలిక్ లేని గ్రూప్లో జరుగుతున్న డ్రైన్ పనులను పరిశీలించి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా వర్షపునీరు రోడ్డుపైన నిలవకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

ఈ పర్యటనలో జోనల్ కమిషనర్ కే షమ్మీ, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జి సామ్రాజ్యం, అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ గోపాలకృష్ణ నాయక్, సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *