Breaking News

దేశవ్యాప్తంగా నిర్వహించిన స్వచ్ఛ సర్వేక్షన్-2025అవార్డు తిరుపతి కి రావడం ఎంతో సంతోషదాయకం

-రెవెన్యూ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖా మంత్రి పరియు జిల్లా ఇన్చార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్
-స్వచ్ఛ సర్వేక్షన్ లో భాగంగా సూపర్ స్వచ్చ లీగ్ లో తిరుపతి కార్పొరేషన్ కి ఫైవ్ స్టార్ రేటింగ్
-తిరుపతి జిల్లాను జీరో వెస్ట్ జిల్లా గా మార్చుదాం
-తిరుపతి ని ఉత్తమ స్థానంలో నిలపడమే లక్ష్యం : కమిషనర్ ఎన్.మౌర్య
-స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డు కార్పొరేషన్కు దకడం తిరుపతి ప్రజలందరికీ గర్వకారణం తిరుపతి ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు

తిరుపతి,  నేటి పత్రిక ప్రజావార్త :
దేశవ్యాప్తంగా నిర్వహించిన స్వచ్ఛ సర్వేక్షన్ -2025 అవార్డు తిరుపతి కి రావడం ఎంతో సంతోషదాయకం అని రెవెన్యూ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖా మంత్రి పరియు జిల్లా ఇన్చార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు.

మంగళవారం స్థానిక కచ్చపి ఆడిటోరియం నందు స్వచ్ఛత విజయోత్సవ సభ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ డా.ఎస్ వెంకటేశ్వర్, ఎం.ఎల్.ఏ లు ఆరణి శ్రీనివాసులు, బొజ్జల సుదీర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ మౌర్య, ట్రైనీ కలెక్టర్ సందీప్ రఘువాన్షి తో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొన్న రెవెన్యూ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖా మంత్రి పరియు జిల్లా ఇన్చార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్.. జిల్లా ఇంచార్జి మంత్రి మాట్లాడుతూ…తిరుపతి జిల్లాకు వివిధ హోదాలలో ఉన్నటువంటి కార్మికులకు అధికారులకు మరి మీ అందరితో కూడా సమయానికి పని చేయించడంతో పాటు అంత మంచి రిజల్ట్ రావడానికి కారణమైన మున్సిపల్ కమిషనర్ మౌర్యకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు. ప్రతి మూడవ శనివారం ప్రజాప్రతినిధులు స్వచ్ఛంద కార్యక్రమంలో భాగస్వాములై పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతూ అందరికీ పరిశుభ్రత పై అవగాహన ఉండేలా ఒక సమాచారాన్ని చేరవేసిన నాయకులకు ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు. గౌ. ముఖ్యమంత్రివర్యులకు ఒక ఆలోచన వస్తే దానిని ఆచరణలో పెట్టి కార్యరూపం దాల్చేలా నిత్యం కృషి చేస్తారని తెలిపారు. మన పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉంటే ఆరోగ్యం బాగుంటుందని అన్నారు. మన భావితరాలకు పరిశుభ్రతపై అవగాహన కల్పించడమే ఈ స్వచ్ఛభారత్ యొక్క ముఖ్య ఉద్దేశమని తెలిపారు. 2004కు ముందు కూడా ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబునాయుడు గారు పారిశుద్ధ కార్మికులు బాగుండాలని, వారు ఆరోగ్యంగా ఉండేలా ఎన్నో కార్యక్రమాలను చేపట్టారని తెలిపారు. ముఖ్యమంత్రి గారు ప్రపంచ దేశాల పర్యటనలకు వెళ్ళినప్పుడు అక్కడున్నటువంటి పారిశుద్ధ నిర్వహణను గమనించి అదేవిధంగా మన రాష్ట్రం కూడా పరిశుభ్రతను పాటించేలా పలు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారని అన్నారు. దేశంలోనే స్వచ్ఛత లో భాగంగా రాష్ట్రానికి విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, రాజమండ్రి, తిరుపతి మునిసిపాలిటీలకు స్వచ్చా సర్వేక్షన్ – 2025 అవార్డు రావడానికి శానిటరీ వర్కర్స్ చాలా కష్టపడ్డారని అందుకు నిదర్శనమే ఈ అవార్డు అని తెలిపారు. ప్రజాప్రతినిధులందరూ ముఖ్యమంత్రి గారి అడుగుజాడల్లోనే నడుస్తూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతున్నారని తెలిపారు. 2018లో అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు తూకివాకం దగ్గర ఏర్పాటుచేసిన వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ ను పరిశీలించి దానిని ఇంకా మెరుగుపడేల చేయాలని చెత్త నుండి సంపద తయారు చేసే మార్గాలను అన్వేషించి పలు సూచనలు ఇచ్చారనీ అన్నారు. రాబోయే రోజుల్లో ఇంకా మెరుగ్గా పనిచేసి తిరుపతి జిల్లాను అభివృద్ధి పథంలో తీసుకురావాలని కమిషనర్ మౌర్యాకి సూచించారు. ఈరోజు తిరుపతి నగరపాలక సంస్థకి ఈ అవార్డు రావడం,ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా గర్వంగా ఉందని అన్నారు. సానిటరీ వర్కర్లు అందరూ కూడా చాలా కష్టపడుతున్నారని వారి పిల్లల భవిష్యత్తు కూడా ఈ ప్రభుత్వం బాధ్యతగా తీసుకుంటుందని తెలిపారు. పేదరికం లేని సమాజం ఉండాలనేదే రాష్ట్ర ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం గా నారా చంద్రబాబు నాయుడు పి-4 కార్యక్రమాన్ని తీసుకొచ్చారని ఈ కార్యక్రమం అమలు దిశగా బాటమ్ 20% లో ఉన్న బంగారు కుటుంబాలకు మొదటి 10 శాతం లో ఉన్న ధనవంతులైన మార్గదర్శలను ఎన్నుకొని బంగారు కుటుంబాలకు చేయూతనివ్వాలని అన్నారు.

తిరుపతి నగరపాలక కమిషనర్ మాట్లాడుతూ.. దేశంలోనే పుణ్యక్షేత్రమైన తిరుపతిని ఉత్తమ స్థానంలో నిలపడమే ధ్యేయంగా పనిచేస్తున్నామని అన్నారు. సూపర్ స్వచ్చ లీగ్ లో తిరుపతి రావడం గర్వకారణంగా ఉందని అన్నారు. పారిశుద్ధ్యం పై ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారని అన్నారు. ఒక్కో వార్డుకు ప్రత్యేకంగా సచివాలయ సిబ్బందిని ఏర్పాటు చేసి చెత్త నిర్వహణపై ప్రజలకు అవగాహన కల్పించడం జరిగిందన్నారు. స్వచాంధ్ర – స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా నగరంలోని సుమారు 25 ప్రాంతాల్లో ఎక్కువగా చెత్త కుప్పలను పూర్తిగా తొలగించి మొక్కలు నాటడం జరిగిందని అన్నారు. సఫాయి మిత్ర సురక్ష కింద పారిశుద్ధ్య కార్మికులకు రక్షణ కిట్లు, వైద్య పరీక్షలు నిర్వహించడం జరిగిందని అన్నారు. పారిశుద్ధ్యం పై ప్రజల్లో మంచి అవగాహన కల్పించామని అన్నారు. తిరుపతి నగరంలో ఉత్పత్తి అయ్యే 250 టన్నుల చెత్త నిర్వహణ చేసి జీరో వేస్ట్ సిటీ గా మార్చుతామని అన్నారు. గార్బేజ్ ఫ్రీ సిటీ లో 7 స్టార్ రేటింగ్ సాధించేందుకు కృషి చేస్తామని అన్నారు. తూకివాకం వద్ద ఉన్న ఇంటిగ్రేటెడ్ వెస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ నుండి మరింత బాగా నిర్వహిస్తామని అన్నారు. రానున్న కాలంలో తిరుపతిని దేశంలోనే ఉత్తమ స్థాయిలో ఉంచేలా కృషి చేస్తామని అన్నారు. ప్రజలు, అధికారులు, సిబ్బంది అందరి సహకారంతోనే అవార్డు సాధించామని అన్నారు. ఇదే స్పూర్తి తో స్వచ్ఛ తిరుపతి నీ సాధించేందుకు మరింత కృషి చేస్తామని అన్నారు.

తిరుపతి ఎం.ఎల్.ఏ మాట్లాడుతూ … స్వ‌చ్ఛ‌స‌ర్వేక్ష‌ణ్ అవార్డు కార్పోరేష‌న్ కు ద‌క్క‌డం తిరుప‌తి ప్ర‌జ‌లంద‌రికీ గ‌ర్వ‌కార‌ణమ‌ని తెలిపారు. ఈ అవార్డు పొంద‌టంలో క‌మిష‌న‌ర్ మౌర్య‌, పారిశుద్ధ్య సిబ్బంది కృషి ఎంతో ఉంద‌ని ఆయ‌న చెప్పారు. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు స్వ‌చ్ఛాంధ్ర – స్వ‌ర్ణాంధ్ర ద్వారా ప‌రిశుభ్రత‌పై అవ‌గాహాన క‌ల్పిస్తున్నార‌ని ఆయ‌న చెప్పారు. స్వ‌యంగా ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు నాలుగు రోజుల కింద‌ట కపిలేశ్వ‌ర స్వామి ఆల‌యాన్ని శుభ్ర‌ప‌రిచార‌ని ఆయ‌న తెలిపారు. వ్య‌క్తిగ‌త ప‌రిశుభ్ర‌త‌కు ఎంత ప్రాధాన్య‌త ఇస్తామో అలాగే ప‌రిస‌రాల ప‌రిశుభ్ర‌త‌కూ అంతే ప్రాధాన్య‌త ఇవ్వాల‌ని ఆయ‌న కోరారు. పుణ్య‌క్షేత్ర‌మైన తిరుప‌తిలో పారిశుద్ధ్యం మెరుగు ప‌రిచేందుకు పారిశుద్ధ్య కార్మికుల‌ను పెంచాల‌ని ఇన్చార్జి మంత్రి అన‌గాని స‌త్య‌ప్రసాద్ ను ఆయ‌న కోరారు. అలాగే మున్సిప‌ల్ కార్పోరేష‌న్ ప‌రిపాల‌న భ‌వ‌నాన్ని పూర్తి చేసేందుకు మంత్రి స‌హ‌క‌రించాల‌ని ఆయ‌న విజ్జ‌ప్తి చేశారు. మ‌రోవైపు 28ఏళ్ళ కింద ఏర్పాటు చేసి యుజిడి వ్య‌వ‌స్థ‌ స్థానంలో పెరిగిన జ‌నాభాకు అనుగుణంగా నూత‌న అండ‌ర్ గ్రౌండ్ డ్రెయినేజి ఏర్పాటుకు వెంట‌నే చ‌ర్య‌లు తీసుకోవాల‌ని మంత్రి అన‌గాని స‌త్య‌ప్ర‌సాద్ ను కోరారు. అలాగే తిరుప‌తిలోని ప్రైవేట్ భూముల‌ను సైతం 22ఏ లో పెట్టేశార‌ని వీటిని తొలిగించి ప్ర‌జ‌ల‌కు న్యాయం చేయాల‌ని ఎమ్మెల్యే కోరారు. ఉద్యోగులు, పారిశుద్ధ్య కార్మికులు అంకిత భావంతో ప‌ని చేయాల‌ని ఆయ‌న కోరారు. ప్ర‌జ‌లు కూడా త‌మ‌వంతు బాధ్య‌త‌తో వ్య‌వ‌హ‌రించాల‌ని ఆయ‌న విజ్జ‌ప్తి చేశారు.

శ్రీకాళహస్తి ఎం.ఎల్.ఏ మాట్లాడుతూ .. స్వచ్ఛ లీగ్ అవార్డు తిరుపతి నగర పాలక సంస్థ కి రావడం కమిషనర్ మరియు సానిటరీ వర్కర్స్ యొక్క కృషి ఫలితమే అని వారిని అభినందించారు. ఇదే స్ఫూర్తి తో శ్రీ కాళహస్తి మునిసిపాలిటి ని కూడా పరిశుభ్రత లో ప్రథమ స్థానం లో నిలిపేల కృషి చేస్తామని అన్నారు.
ఈ కార్యక్రమానికి హాజరైన పలువురు ప్రజా ప్రతినిధులు సభనుద్దేశించి ప్రసంగిస్తూ తిరుపతి నగరపాలక సంస్థ కి ప్రతిష్టాత్మక అవార్డు రావడం చాల శుభదాయకం అని అన్నారు. ఈ అవార్డు రావడానికి నగరపాలక కమిషనర్ కి మరియు కారణమైన పారిశుధ్య కార్మికులకు ధన్యవాదాలు తెలియజేసారు.

కార్యక్రమానంతరం తిరుపతి నగరపాలక సంస్థకు ఈ అవార్డు రావడానికి ప్రధాన కారణమై,అహర్నిశలు శ్రమించినటువంటి సానిటరీ వర్కర్స్ కు జిల్లా ఇన్చార్జి మంత్రి చేతులమీదుగా మొమెంటోలను ప్రధానం చేశారు.

ఈ కార్యక్రమంలో డిప్యూటి మేయర్లు ముద్ర నారాయణ, ఆర్.సి ముని కృష్ణ, గ్రీన్ అండ్ బ్యుటిఫికేషన్ చైర్మన్ సుగుణమ్మ, యాదవ కార్పోరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, హస్త కళా అభివృద్ధి కార్పోరేష న్ చైర్మన్ పసుపులేటి హరిప్రసాద్, నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ సదాశివం, అర్బన్ డెవలప్మెంట్ డైరెక్టర్ ఊక విజయ్ కుమార్, అడిషనల్ కమీనర్ చరణ్ తేజ రెడ్డి, డిప్యూటీ కమిషనర్ అమరయ్య, స్మార్ట్ సిటీ జి.ఎం. చంద్రమౌళి, హెల్త్ ఆఫీసర్ యువ అన్వేష్, సూపరింటెండెంట్ ఇంజినీర్ శ్యాంసుందర్, ఎస్సీ కార్పొరేషన్ బోర్డు డైరెక్టర్ కుమారమ్మ, తిరుపతి జిల్లా రజక బోర్డ్ డైరెక్టర్ కరాటి చంద్ర, అధికారులు, కార్పోరేట్ లు, ప్రజా ప్రతినిధులు, శానిటరీ వర్కర్స్ లు, పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *