Breaking News

శ్రీ త్రిపురాంబ సమేత పాలకేశ్వర స్వామి ఆలయంలో మంత్రి ఆనం ప్రత్యేక పూజలు

పాణ్యం, నేటి పత్రిక ప్రజావార్త :
సూపరిపాలన లో తొలి అడుగు కార్యక్రమంలో గడప గడపకు తిరుగుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించే కార్యక్రమంలో భాగంగా, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి , నంద్యాల జిల్లా పాణ్యం నియోజకవర్గంలోని గడివేముల మండలం గాడిగరేవుల గ్రామం లో వేంచేసిన శ్రీ త్రిపురాంబ సమేత పాలకేశ్వర స్వామి దేవస్థానాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలోని కోనేరును పరిశీలించి, తగిన మరమ్మతులు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం వేద మంత్రోచ్ఛారణల మధ్య పూజలు నిర్వహించగా, ఆలయ అర్చకులు, అధికారులు మంత్రికి సంపూర్ణ మర్యాదలతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తో పాటు పాణ్యం శాసన సభ్యురాలు గౌరు చరిత, దేవాదాయ శాఖ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *